బొద్దింకల టార్గెట్ అమిత్ షా: సరిహద్దుల్లో ఉక్కుపాదం.. ఉగ్రవాదుల వెన్నులో వణుకు!
ఢిల్లీ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న కుట్రల అసలు లక్ష్యం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాదు.. హోంమంత్రి అమిత్ షా! అదృశ్య శక్తులు (డీప్ స్టేట్) ఆయనపైనే గురిపెట్టడానికి కారణం ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలే.
బీజేపీ ముఖ్యమంత్రుల సహకారంతో దేశ సరిహద్దులన్నింటినీ అమిత్ షా పటిష్టంగా మూసివేయడమే ఇందుకు ప్రధాన కారణం. జమ్మూ కాశ్మీర్, నేపాల్, బెంగాల్, అలాగే అస్సాంలో చొరబాటుదారులు, ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియా దేశంలోకి ప్రవేశించకుండా ఆయన ఉక్కుపాదం మోపారు.
ప్రస్తుతం పంజాబ్ సరిహద్దు మాత్రమే వారికి కాస్తోకూస్తో మిగిలి ఉన్న ఏకైక మార్గం. సరిహద్దుల్లోనే కాదు, దేశం లోపల కూడా అమిత్ షా ఆపరేషన్ నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది.
2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయడంతో పాటు, అక్రమ డ్రగ్స్ పరిశ్రమపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అతిక్ అహ్మద్ ఎన్కౌంటర్ తర్వాత, నేపాల్ నుంచి వచ్చే డ్రగ్స్ రవాణా దాదాపుగా ఆగిపోయింది.
జోర్డాన్ బ్రౌన్ లాంటి ఒక చిన్న స్థాయి మిషనరీ నేపాల్ మీదుగా చొరబడేందుకు యత్నించినా ఇట్టే పసిగట్టి పట్టుకునేంతలా మన నిఘా వ్యవస్థను పదునుపెట్టారు. దేశంలో ప్రశాంత వాతావరణం ఉంటే తమ రాజకీయ పబ్బం గడవదని భయపడుతున్న వామపక్షాలు, విచ్ఛిన్నకర శక్తులే ఇప్పుడు అమిత్ షాను టార్గెట్ చేసి అస్థిరత సృష్టించాలని చూస్తున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలంటూ పాలుతాగే వయసులో రోడ్డెక్కుతున్న నేటి యువత (Gen Z) ఒక్కసారి గతంలోకి తొంగి చూడాలి.
అప్పట్లో జైపూర్, హైదరాబాద్, పుణె, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో మార్కెట్కు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోయే భయానక పరిస్థితి ఉండేది. కానీ 2014 నుంచి 2026 వరకు ఉగ్రవాద దాడులు 70 శాతం మేర తగ్గాయి, మెయిన్ స్ట్రీమ్ ఇండియాలో ఒక్క భారీ ఉగ్రదాడి కూడా జరగలేదు.
ఆనాటి నెత్తురోడిన చరిత్రను చూడని యువత.. నేడు దేశం కల్పిస్తున్న అద్భుతమైన భద్రతను అనుభవిస్తూనే, ఆ భద్రతను కల్పిస్తున్న నాయకుడి పైనే నిరసనలకు దిగడం హాస్యాస్పదం. ఒక్కసారి మేల్కొండి.. భారతదేశం ఎంత సురక్షితంగా మారిందో గమనించండి!


