షరియా చట్టాల నుండి భారతదేశానికి విముక్తి ఎప్పుడు?
చట్టం ముందు అందరూ సమానమేనా? ఆస్తి బహుమతుల విషయంలో హిందువులకే పన్ను.. ముస్లింలకు మినహాయింపా!
స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ హిందువులు మాత్రమే ఇంకా ముస్లిం రాజుల పాలనలో బ్రతుకుతున్నారా? దేశంలో రాజ్యాంగం అందరికీ సమానం అని చెబుతున్నప్పటికీ, ఆస్తి బదిలీ విషయంలో ఒక హిందువులకే ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్’ (Transfer of Property Act – 1882) నిబంధనలు ఎందుకు భారంగా మారుతున్నాయి? ఈ ప్రశ్నలు ఇప్పుడు న్యాయ నిపుణుల్లో, సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక హిందువు తన ఆస్తిని బహుమతిగా ఇస్తే ఒక న్యాయం, అదే ముస్లిం బహుమతిగా ఇస్తే మరో న్యాయం అమలులో ఉండటం ఈ దేశ పౌరులను విస్మయానికి గురిచేస్తోంది. ఇది చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న ‘జిజియా పన్ను’ లాంటి చట్టపరమైన వివక్షే అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆశ్చర్యకరమైన వ్యత్యాసానికి ప్రధాన కారణం 1882లో బ్రిటిష్ వారు రూపొందించిన ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్’. ఈ చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం.. హిందువులు, క్రైస్తవులు లేదా ఇతరులు ఎవరైనా తమ స్థిరాస్తిని (Immovable property) వేరొకరికి బహుమతిగా (Gift) ఇవ్వాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. డోనర్ సంతకం, కనీసం ఇద్దరు సాక్షులు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ మొత్తంలో ‘స్టాంప్ డ్యూటీ’ చెల్లించాలి. కానీ, ముస్లింలకు వచ్చేసరికి ఇదే చట్టంలోని ‘సెక్షన్ 129’ ఒక కవచంలా మారుతోంది. దీని ప్రకారం ముస్లింలు తమ ఆస్తిని బహుమతిగా (Hiba – హిబా) ఇవ్వడానికి ఈ చట్టంలోని రిజిస్ట్రేషన్ నిబంధనలు, స్టాంప్ డ్యూటీలు ఏవీ వర్తించవు.
చట్టంలోని ఈ వ్యత్యాసానికి సంబంధించిన ప్రధానమైన, ఆశ్చర్యకరమైన వాస్తవాలు ఇలా ఉన్నాయి:
📌 రిజిస్ట్రేషన్ అవసరం లేదు: ముస్లిం లా (Hiba) ప్రకారం దాత ప్రకటన (Declaration), తీసుకునేవారి ఆమోదం (Acceptance), ఆస్తి అప్పగింత (Delivery of possession).. ఈ మూడు షరతులు నెరవేరితే చాలు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు.
📌 మౌఖికంగా చెప్పినా చెల్లుతుంది: హిందువులు ఆస్తిని బహుమతిగా ఇవ్వాలంటే కచ్చితంగా లిఖితపూర్వక డాక్యుమెంట్ (Deed) రాయాలి. కానీ ముస్లింలు నోటిమాటతో (Oral Gift) ఆస్తిని బహుమతిగా ఇచ్చినా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది.
📌 స్టాంప్ డ్యూటీ భారం సున్నా: హిందువులు స్థిరాస్తి గిఫ్ట్ డీడ్ కు ప్రభుత్వానికి లక్షల్లో స్టాంప్ డ్యూటీ పన్ను కట్టాలి. కానీ ముస్లింలు రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనే లేదు కాబట్టి, ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.
📌 గ్రహీత నాన్-ముస్లిం అయినా సరే: దాత ముస్లిం అయితే చాలు, ఆ బహుమతి తీసుకునే వ్యక్తి (Donee) హిందువు లేదా మరే ఇతర మతస్థుడైనా సరే.. ఈ రిజిస్ట్రేషన్, పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.
ఇది కేవలం ప్రచారంలో ఉన్న మాట కాదు, సుప్రీంకోర్టు మరియు పలు రాష్ట్రాల హైకోర్టులు పదేపదే స్పష్టం చేసిన నగ్న సత్యం. హఫీజా బీబీ కేసుతో సహా అనేక కేసులలో ‘ఓరల్ హిబా’ (Oral Hiba) చెల్లుబాటును న్యాయస్థానాలు సమర్థించాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చాలా ముస్లిం మెజారిటీ దేశాల్లో సైతం పర్సనల్ లాను, సివిల్ చట్టాలను కలిపి ఆధునీకరిస్తుంటే, మన దేశంలో మాత్రం 1937 నాటి ముస్లిం పర్సనల్ లా చట్టాన్ని సెక్షన్ 129 రూపంలో ఇంకా మోస్తూనే ఉన్నాం. ఇటీవల 2026లో ఈ సెక్షన్ 129 ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు) ను ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL) వేయగా.. 1882 నాటి పాత చట్టాన్ని ఇప్పుడు ఛాలెంజ్ చేయలేరని, చట్ట సవరణ కావాలంటే పార్లమెంటును లేదా లా కమిషన్ ను ఆశ్రయించాలని కోర్టు సూచించింది.
దీంతో ఈ బ్రిటీష్ కాలం నాటి పాత చట్టాల నుండి భారతదేశానికి, ముఖ్యంగా పన్నుల భారంతో నలుగుతున్న మెజారిటీ వర్గానికి విముక్తి ఎప్పుడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆస్తి అమ్మకాలు, మార్కగేజ్ (Sale, Mortgage) వంటి ఇతర లావాదేవీల విషయాల్లో అందరికీ ఒకే చట్టం ఉన్నప్పుడు, కేవలం ‘బహుమతి’ (Gift) విషయంలో మాత్రం మతం ఆధారంగా ఒకరికి స్టాంప్ డ్యూటీ వసూలు చేయడం, మరొకరికి ఉచితంగా మినహాయింపు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని నిపుణులు అంటున్నారు. దేశంలో చట్టం ముందు అందరూ సమానులే అని నిరూపించబడాలంటే, పార్లమెంట్ లో సెక్షన్ 129కి సవరణ చేయడం లేదా ఉమ్మడి పౌరస్మృతి (UCC) తీసుకురావడం ద్వారా మాత్రమే ఈ చారిత్రక అసమానతకు ముగింపు పలకడం సాధ్యమవుతుంది.


