పాక్ మంత్రితో సీజేపి లీడర్ సీక్రెట్ డీల్? బయటపడ్డ అసలు నిజాలు!
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఆయన ప్రొఫెషనల్ హిస్టరీని కాస్త లోతుగా తవ్వి చూస్తే.. ఏకంగా పాకిస్థాన్ మాజీ మంత్రితో లింకులు ఉన్నట్లు బయటపడింది. ఇంతకీ ఈ కనెక్షన్ ఎక్కడ మొదలైంది? దీని వెనుక ఉన్న కథేంటి? అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం.

అసలు ట్విస్ట్ ‘గవి’ (Gavi) సంస్థతోనే.. అశుతోష్ రాంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. వ్యాక్సిన్ల కోసం పనిచేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ‘గవి’ (Gavi – The Vaccine Alliance) లో ఆయన పనిచేశాడు. మొదట 2021 మే నుంచి 2022 జూలై వరకు అక్కడ జాబ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ 2024 అక్టోబర్‌లో అదే సంస్థలో పార్ట్-టైమ్ కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యాడు. 2025 సెప్టెంబర్ వరకు అక్కడే తన సేవలు అందించాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఎవరీ సానియా నిష్తార్? ఆమెతో లింక్ ఏంటి? అశుతోష్ రెండోసారి గవి సంస్థలో చేరే సమయానికి, ఆ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా పాకిస్థాన్‌కు చెందిన డాక్టర్ సానియా నిష్తార్ ఉన్నారు. ఆమె 2024 మార్చి 18నే ఆ పోస్టులో కూర్చున్నారు. ఇంతకీ ఈమె ఎవరంటే.. పాకిస్థాన్ దేశానికి చెందిన ఒక బడా నాయకురాలు. కేవలం హెల్త్ ఎక్స్పర్ట్ మాత్రమే కాదు, పాకిస్థాన్ లో సెనేటర్ గా, ఫెడరల్ మంత్రిగా కూడా పనిచేశారు.
ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న టైంలో (2018 నుంచి 2022 వరకు) పేదరిక నిర్మూలన విభాగానికి మంత్రి హోదాలో స్పెషల్ అడ్వైజర్ గా ఈమె వ్యవహరించారు. ఇమ్రాన్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘ఎహసాస్’ (Ehsaas) స్కీమ్ డిజైన్ చేసింది కూడా ఈవిడే. అంతకుముందు 2013లో పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా చక్రం తిప్పారు.

ఒకే టైంలో ఆప్ (AAP) తో దోస్తీ.. ఒక పక్క పాకిస్థాన్ మాజీ మంత్రి సీఈఓగా ఉన్న సంస్థలో అశుతోష్ పనిచేస్తూనే.. మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తో, అరవింద్ కేజ్రీవాల్ తో చాలా క్లోజ్ గా మెలిగాడు. 2024 అక్టోబర్ టైంలో గవి సంస్థకు పనిచేస్తూనే, ఆప్‌తో కూడా టచ్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఏకంగా సీజేపి (CJP) లో చేరి ఆ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయిపోయాడు.
సోరోస్ నెట్‌వర్క్‌తో సంబంధాలు? అశుతోష్ రాంకాకు, పాక్ మాజీ మంత్రి సానియా నిష్తార్ కు మధ్య నేరుగా మాట్లాడుకునేంత సంబంధాలు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే.. పాకిస్థాన్ నాయకురాలు నడిపిస్తున్న ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ లో, మన దేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు పనిచేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు ఈ ఇంటర్నేషనల్ నెట్ వర్క్ కు.. భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహించే ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ (George Soros) తో కూడా లింకులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
దీంతో, ఒక పక్క పాకిస్థాన్ మాజీ మంత్రి, మరో పక్క జార్జ్ సోరోస్ నెట్వర్క్, ఇంకో పక్క దేశంలోని రాజకీయ పార్టీల మధ్య ఈయన ఒక వారధిలా పనిచేశాడా? అన్న అనుమానాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.


