అమిత్ షా దెబ్బకు వణికిపోతున్న పాకిస్తాన్: ఐఎస్ఐ ఏజెంట్ ఫ్రస్ట్రేషన్ వీడియో!
భారతదేశంలో ఉగ్రవాదానికి చరమగీతం పాడాలన్న దృఢ సంకల్పంతో ఉన్న మోదీ ప్రభుత్వ దెబ్బకు పాకిస్తాన్ ఉగ్ర మూకలు బెంబేలెత్తుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించడానికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) పన్నిన కుట్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని భద్రతా దళాలు సమూలంగా పాతాళంలోకి తొక్కేశాయి. ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న షెహజాద్ భట్టి (Shahzad Bhatti) ఉగ్రవాద నెట్‌వర్క్‌ను భారత భద్రతా సంస్థలు ఉక్కుపాదంతో అణచివేసిన తీరు న్యూ ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన భద్రతా బలగాలు ఏకంగా 200 మందికి పైగా ఉగ్రవాద ఆపరేటివ్‌లను అరెస్టు చేసి జైలులో వేశారు. వీరి వద్ద నుంచి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కింగ్ ఉన్న గ్రెనేడ్లు, ఐఈడీలు, తుపాకులు, మరియు గూఢచర్యం కోసం వాడే సీసీటీవీ కెమెరాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. భారత దేశ భద్రత విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం, ఈ చర్యతో పాక్ ఉగ్రవాదులకు మరియు వారికి మద్దతు ఇస్తున్న స్లీపర్ సెల్స్ కు ఒక స్పష్టమైన, కఠినమైన హెచ్చరిక పంపింది.
అయితే, తన నెట్వర్క్ కుదేలు కావడంతో ఫ్రస్ట్రేషన్ కు గురైన పాకిస్తాన్ గ్యాంగ్‌స్టర్, ఐఎస్ఐ తొత్తు షెహజాద్ భట్టి సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన అక్కసును వెళ్లగక్కాడు. అమిత్ షా దెబ్బకు మైండ్ బ్లాక్ అయిన ఈ ఉగ్రవాది, ఇప్పుడు అరెస్టు అయిన వారెవరు తన అనుచరులు కాదంటూ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇండియా దెబ్బకు గజగజ వణుకుతున్న ఈ ఉగ్రవాది, తన పరువు కాపాడుకోవడానికి దిక్కుమాలిన వాదనలు తెరపైకి తెస్తూ భారత ప్రభుత్వ సంస్థలకే సవాల్ విసిరే సాహసం చేస్తున్నాడు.
భట్టి తన వీడియోలో చేసిన అత్యంత హాస్యాస్పదమైన వాదన ఏమిటంటే, అరెస్టు చేసిన వ్యక్తులు తన వారు కారని, వారంతా ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ మద్దతుదారులని, జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసిన వారినే పోలీసులు పట్టుకెళ్లారని వక్రీకరించాడు. వాళ్లు CJP వాళ్లయినా సరే, తాను వారికి న్యాయపరమైన, ఆర్థికపరమైన మద్దతు ఇస్తానని పగటి కలలు కంటున్నాడు. ఉగ్రవాదులకు మరియు ఆందోళనకారులకు ముడిపెడుతూ వండిన ఈ కట్టుకథను చూస్తే, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు ఎలా డ్రామాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది.
తన పిరికితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఐఎస్ఐ ఏజెంట్ తన 3,000 మంది స్లీపర్ సెల్స్ ఇంకా భారతదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ ఒక బూటకపు బెదిరింపుకు దిగాడు. దమ్ముంటే అరెస్టు చేసిన వారి ముఖాలను, వారి వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాలను టీవీల్లో లైవ్ లో చూపించాలంటూ మోదీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు. అడుక్కుతినే దేశంలో ఉంటూ ఆన్లైన్ లో వీడియోలు పెట్టి రెచ్చిపోవడం కాదు, ఇండియన్ ఆర్మీ చేతికి చిక్కితే వాడి నెట్వర్క్ కాదు కదా, వాడి ఉనికి కూడా లేకుండా చేస్తారనే నిజం వాడికి త్వరలోనే తెలుస్తుంది.
ఉగ్రవాదులు ఎన్ని వేషాలు వేసినా, సోషల్ మీడియాలో ఎన్ని డ్రామాలు ఆడినా వారి అసలు రంగును నిర్భయంగా kadpathr బయటపెడుతూ ఉంటుంది. షెహజాద్ భట్టి లాంటి పాక్ ఉగ్రవాదుల మాటలు కేవలం గాలి బుడగలే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మోదీ ప్రభుత్వ దెబ్బకు పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్ నడ్డి విరిగింది అన్నది పచ్చి నిజం, ఇలాంటి వీడియోలు వారి అసహాయతకు, భయానికి నిదర్శనం మాత్రమే!


