జై శ్రీరామ్’ నామాన్ని ఉగ్రవాదంతో పోల్చిన సాయి పల్లవికి ‘సీతమ్మ’ పాత్రా? బాలీవుడ్ కు హిందువులంటే అంత చులకనా?
నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాలీవుడ్ ‘రామాయణం’లో జగన్మాత, మహాపతివ్రత అయిన సీతమ్మ వారి పాత్రకు సాయి పల్లవిని ఎంపిక చేయడం హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన ఇతిహాసంలో, గతంలో హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన ఒక నటికి అవకాశం ఇవ్వడాన్ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. రామాయణం మీద, శ్రీరాముడి మీద ఏమాత్రం భక్తి, గౌరవం ఉన్నా మేకర్స్ ఇలాంటి కాస్టింగ్ ఎంపిక చేయరని, ఇది కేవలం సినిమా పేరుతో ఉద్దేశపూర్వకంగా హిందువుల సహనాన్ని పరీక్షించడమేనని పలువురు మండిపడుతున్నారు.
స్వంత దేశంలోనే కాందిశీకులుగా మారి దారుణ మారణహోమానికి గురైన కాశ్మీరీ పండిట్ల విషాదాన్ని, గోరక్షకులు చేసిన ఒక దాడితో పోల్చుతూ గతంలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలను ఈ దేశం ఇంకా మర్చిపోలేదు. పవిత్రమైన “జై శ్రీరామ్” అనే తారకమంత్రాన్ని ఉగ్రవాదంతో, హింసతో ముడిపెడుతూ తన యాంటీ-హిందూ భావజాలాన్ని ఆమె ఏనాడో బహిర్గతం చేశారు. మతం పేరుతో ప్రాణాలు తీసేవాళ్లంతా ఒకటే అంటూ, గోవులను కాపాడేవాళ్లను ఉగ్రవాదులతో సమానం చేసే ప్రయత్నం చేసిన ఒక నటికి, అదే శ్రీరాముడి కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడిన త్యాగమయి సీతమ్మ పాత్రను పోషించే నైతిక అర్హత ఏమాత్రం లేదని హిందూ సంఘాలు కరాఖండిగా చెబుతున్నాయి.
ఇది కేవలం ఒక నటి ఎంపిక వ్యవహారం కాదు, హిందూ దేవుళ్లంటే, హిందువుల విశ్వాసాలంటే బాలీవుడ్‌కు ఉన్న చులకన భావానికి నిదర్శనం. సనాతన ధర్మం మీద కనీస గౌరవం లేని వ్యక్తులకు ఇలాంటి పవిత్రమైన పాత్రలు ఇచ్చి, వివాదాల ద్వారా పబ్లిసిటీ తెచ్చుకుని వందల కోట్లు సంపాదించాలనే బాలీవుడ్ దుర్బుద్ధిని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. “జై శ్రీరామ్” అని పలికే వాళ్లను ఉగ్రవాదులుగా చూసే నటిని సీతమ్మగా అంగీకరించే ప్రసక్తే లేదని, ఈ విషయంలో నమిత్ మల్హోత్రా బృందం తమ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే, ఈ సినిమాను హిందూ సమాజం ఎలా బహిష్కరిస్తుందో త్వరలోనే చూస్తారని తీవ్రస్థాయిలో హెచ్చరికలు వెలువడుతున్నాయి.


