చైనా ఫండ్స్‌తో అనుకూల కథనాలు! జర్నలిస్ట్ శిఖా దాల్మియా బండారం బట్టబయలు
ఇటీవల సబ్‌స్టాక్ లో నటాలీ వింటర్స్ అనే జర్నలిస్ట్ ప్రచురించిన ఒక ఇన్వెస్టిగేటివ్ కథనం ప్రకారం, అమెరికా మీడియాలో చైనాకు అనుకూలమైన నెరేటివ్నుపెంచడానికి ‘చైనా-యునైటెడ్ స్టేట్స్ ఎక్స్ఛేంజ్ ఫౌండేషన్’ పలువురు ప్రముఖ జర్నలిస్టులకు ఉచిత చైనా పర్యటనలను స్పాన్సర్ చేసింది. ఈ స్పాన్సర్షిప్ అందుకున్న అమెరికన్ జర్నలిస్టుల జాబితాలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ జర్నలిస్ట్, కాలమిస్ట్ మరియు పాలసీ అనలిస్ట్ అయిన ‘శిఖా దాల్మియా’ పేరు కూడా ఉంది. అమెరికన్ మీడియాలో చైనా గురించి సానుకూల కవరేజ్ తీసుకురావడం కోసమే వీరికి ఈ నిధులు సమకూర్చినట్లు ఆ కథనంలో ప్రధానంగా ఆరోపించారు.

ఈ వార్తా కథనం అమెరికాలోని ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఫైలింగ్స్ ఆధారంగా రూపొందించబడింది. చైనా పర్యటనల లబ్ధిదారుల వివరాలను ఫైలింగ్స్‌లో నేరుగా పేర్కొనకపోయినప్పటికీ, నటాలీ వింటర్స్ పాత ట్రిప్ రోస్టర్లు, ఈవెంట్ బ్రోచర్లు మరియు ఫైలింగ్స్‌ను పరిశీలించి జర్నలిస్టుల పేర్లను గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనాలో ఉచితంగా పర్యటించిన అదే ఏడాది శిఖా దాల్మియా ఫోర్బ్స్ పత్రికలో “చైనా బాషింగ్ ఈజ్ ఫర్ లూజర్స్” అనే శీర్షికతో చైనాకు అనుకూలంగా ఒక ఆర్టికల్ రాశారు. చైనాను వ్యతిరేకించడం కన్నా, వారితో వ్యాపారం చేయడం అమెరికాకు ఎంతో లాభదాయకం అని ఆమె అందులో వాదించారు.
శిఖా దాల్మియా బ్యాక్‌గ్రౌండ్ గురించి వివరిస్తూ, ఆమె తరచుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి మరియు హిందుత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా న్యూయార్క్ టైమ్స్, ది వీక్, రీజన్ వంటి పత్రికల్లో కథనాలు రాస్తుంటారని kadpathr తమ కథనంలో గుర్తుచేసింది. పౌరసత్వ సవరణ చట్టం 2020 ఢిల్లీ అల్లర్లు, మరియు గుజరాత్ అల్లర్ల విషయంలో ఆమె మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారని, భారతదేశంలో హిందూత్వ కారణంగా మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయంటూ ఆమె తప్పుడు కథనాలు రాశారని అందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీపై ఆమె చూపిస్తున్న ఈ వ్యతిరేకతకు, ఆమెకు చైనా నుండి అందిన ఈ ఫండ్స్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ కథనం ఎత్తిచూపింది.


