’కాక్రోచ్’ (బొద్దింకలు) అనే పదం ఎవరు వాడారు? ఏ సందర్భంగా వాడారు..?ఎవరు తమకే అని అపాదించుకున్నారు…?ఎవరు బలయ్యారు…?
భారతదేశ ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) ఈ పదాన్ని ఉపయోగించారు.
ఎవరిని ఉద్దేశించి అన్నారు?:
వకాలత్ (న్యాయవాద వృత్తి) లో నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న వకీళ్లను (న్యాయవాదులను) ఉద్దేశించి ఆయన ఆ పదం వాడారు. ఆ నకిలీ వకీళ్లకు క్లయింట్లు దొరకనప్పుడు ఆక్టివిజమ్ చేయడం ప్రారంభిస్తారు అని ఒక నిర్దిష్టమైన సందర్భంలో ఆ మాట అన్నారు.
దీని వల్ల ట్రిగ్గర్ అయింది అపాదించుకుంది ఎవరు?:
న్యాయమూర్తి చేసిన ఆ వ్యాఖ్యలు దేశంలోని నిరుద్యోగ యువకులందరినీ ప్రభుత్వమే ‘కాక్రోచ్’ అని పిలిచింది” అంటూ దాన్ని తమకు ఆపాదించుకుని అభిజీత్ ట్రిగ్గర్ అవ్వడమే కాకుండా దేశం లోని యువతను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు.
నిజానికి
ప్రభుత్వం కానీ, సీజేఐ కానీ నిరుద్యోగులందరినీ కాక్రోచ్లు అనలేదు.
నకిలీ డిగ్రీలతో ప్రాక్టీస్ చేసే లాయర్ల గురించి మాత్రమే ఆ మాట చెప్పారు.
కానీ కొందరు కావాలనే ఆ వార్తను తప్పుగా వక్రీకరించి, ఆ నిందను నేరుగా మోడీ ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేసి…చిరికి చిరికి గాలివాన లా చేసి చివరికి యువతను తప్పుదోవ పట్టించాడు.
ఎవరైనా కూడా ఏదీ సరిగ్గా పరిశీలించకుండా, ఒకదానితో ఒకటి సంబంధం లేని తప్పుడు విషయాలను ఒకదాని తర్వాత ఒకటి జోడించి ఏదైనా ప్రచారం చేస్తున్నారంటే… దాని వెనుక వారి అసలు ఉద్దేశం వేరే ఉంటుందని స్పష్టంగా అర్థం చేసుకోవాలి…
ఎక్కడో ఉద్యోగ చేస్తున్న అభిజీత్ డీప్కె అనేవాడు ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం మానేసి..హఠాత్తుగా NEET పరీక్ష పత్రాల లీకేజీ అంటూ చేస్తున్న హడవిడి వెనక అసలు సూత్రం ఏంటి అన్నది మరియు దీనికి సహకరిస్తున్న బడా నేతలు NGO సంస్థలు చేస్తున్న కుట్ర ప్రభుత్వం పసిగట్టేసింది.
అందుకే ఇక ఆటలు సాగవని వీరికి తెలిసి దేశం లోని యువత రెచ్చగొట్టి విషపూరిత సమాచారం మెదళ్ళల్లో జొప్పించి జంతర్ మంతర్ వైపు పరుగులు పెట్టేలా చేసింది


