ప్రతీ తల్లి ఆశీస్సులు మోడీ కి ఉండగా…ఆసేతు హిమాచలం మోదికి అండగా…

2014 మే 26… ఆ రోజు ఢిల్లీ పీఠంపై నరేంద్ర దాస్ దామోదర్ మోదీ చేసింది కేవలం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కాదు, పరమశివుడి సాక్షిగా అఖండ భారత స్థాపన కోసం ఒక కర్మయోగి, ఒక మహర్షి చేసిన చారిత్రక శపథం! ఆ క్షణం నుంచే సనాతన భారతదేశపు నవయుగం మొదలైంది. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ఈ విశ్వగురు స్థాయిని తట్టుకోలేని విదేశీ శక్తులు, ఎన్జీవోల ముసుగులో, మిషనరీల పేరుతో మతమార్పిడులకు తెగబడుతూ దేశ అంతర్గత భద్రతకు ఉచ్చు బిగించాయి. ఫారిన్ ఫండింగ్ (FCRA) పేరుతో వస్తున్న డబ్బు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తుందని పసిగట్టిన మోదీ సర్కార్, ఏమాత్రం కనికరం లేకుండా ఆ నిబంధనలపై ఉక్కుపాదం మోపింది. ఇది కేవలం ఏదో ఫైల్ మీద సంతకం కాదు, జాతి భద్రత కోసం, మన సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు ఆ యోధుడు వేసిన సాహసోపేతమైన అడుగు!

ఇక పంజాబ్ వేదికగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగింది రైతుల ఉద్యమం అనుకుంటే అది మన అమాయకత్వమే. దాని వెనుక నడిపించిన ఎకో సిస్టం అంతా అంతర్జాతీయ ‘డీప్ స్టేట్’ (Deep State) దే! రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటువాదులు ప్రత్యేక దేశం కావాలంటూ తెరమీదకు వచ్చి, దేశాన్ని రావణకాష్టం చేయాలని చూసినప్పుడు, దేశ భద్రత కోసమే మోదీ ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అది డీప్ స్టేట్ ఆడుతున్న రక్తపాత నాటకాన్ని భగ్నం చేయడానికి తీసుకున్న వ్యూహాత్మక అడుగే తప్ప, ఆ మతోన్మాదులకు భయపడి కాదు! గత ప్రభుత్వాల హయాంలో చిదంబరం లాంటి వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, పాకిస్థాన్ తో కుమ్మక్కై చలామణి చేసిన దొంగ నోట్ల సామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేయడానికే మోదీ ‘పెద్ద నోట్ల రద్దు’ అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ దేశద్రోహ నెట్వర్క్ వెన్నువిరిచారు.
భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఎదుగుతుంటే డీప్ స్టేట్ శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే మన ఆర్థిక దిగ్గజం అదానీపై వరుస దాడులకు తెగబడుతున్నారు. రహదారుల నుంచి కరెంట్ వరకు ప్రతి రంగంలో పెట్టుబడులు పెడుతూ అదానీ భారత ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. నేడు బంగ్లాదేశ్ మొత్తం అదానీ ఇచ్చే విద్యుత్ పైనే ఆధారపడి ఉందంటే, ఒకే ఒక్క స్విచ్ తో వాళ్ళ దేశాన్ని చీకటి చేసే పవర్ భారత్ చేతిలో ఉంది. దీన్ని చూసి వణికిపోయిన అమెరికాలోని డీప్ స్టేట్ శక్తులు ఏకమై, హిండెన్ బర్గ్ లాంటి ఫేక్ రిపోర్టులతో అదానీని టార్గెట్ చేశాయి. కానీ అంతిమంగా సత్యమే గెలిచి, ఆ డీప్ స్టేట్ కుట్రలు బెడిసికొట్టి వాళ్ళే కేసులన్నీ వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది.

నీట్ (NEET) పరీక్షల పేపర్ లీకేజీ అనేది ముమ్మాటికీ వాస్తవమే, అందులో ఎలాంటి సందేహం లేదు! కానీ సరిగ్గా ఆ సమస్య ముసుగులో బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ప్రభుత్వాలను కూల్చినట్లు, ఇక్కడ కూడా యువతను (Gen-Z) రెచ్చగొట్టి మోదీని గద్దె దించాలని డీప్ స్టేట్ ఎకో సిస్టం కుట్రలు పన్నుతోంది. దేశాన్ని లోపలి నుంచి తొలిచేయడానికి వాళ్లు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే ఒక విషపురుగును తయారుచేశారు! అమెరికాలోని ఏసీ గదుల్లో కూర్చుని ‘అభిజిత్ దేప్కే’ లాంటి డీప్ స్టేట్ ఏజెంట్లు, అర్బన్ నక్సల్స్ స్వయంగా పుట్టించిన పార్టీ ఇది! అసలు నిన్న ఈ పార్టీ నాయకులు, వాళ్ల కార్యకర్తలు నీట్ ఉద్యమం ముసుగులో సృష్టించిన అల్లర్లు చూస్తుంటే ప్రతి హిందువు, ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది! నీట్ కు న్యాయం చేయాలని రోడ్లెక్కి వీళ్లు చేసిందేంటి? పవిత్రమైన మన హిందూ దేవుళ్లపై, దేవతలపై అత్యంత నీచంగా, అసహ్యంగా మాట్లాడారు! ‘కాశ్మీర్ అసలు భారతదేశంలో భాగమే కాదు’ అంటూ పచ్చి దేశద్రోహ నినాదాలు చేశారు! మన ప్రాణాలు కాపాడే పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ కిరాతకంగా దాడులకు తెగబడ్డారు! అసలు నీట్ సమస్యకు… హిందూ దేవుళ్లను తిట్టడానికి, కాశ్మీర్ మనది కాదనడానికి సంబంధం ఏంటి? రోడ్ల మీద అల్లర్లు చేస్తున్న వీళ్లు నిజంగా విద్యార్థులా? లేక అమెరికా ఏసీ గదుల్లో అభిజిత్ దేప్కే లాంటి వాళ్లు పెంచి పోషిస్తున్న ‘యాంటీ-హిందూ అర్బన్ నక్సల్స్’ (Anti-Hindu Urban Naxals) .
కానీ, ఆ విదేశీ కుట్రలు, డీప్ స్టేట్ పన్నాగాలు పవిత్ర భారత గడ్డపై సాగవు. ఈ దేశ యువతకు, యావత్ భారతదేశ ప్రజలకు మోదీపై ఉన్నది కేవలం నమ్మకం కాదు, అచంచలమైన విశ్వాసం. అందుకే చరిత్రను తిరగరాస్తూ ముచ్చటగా మూడోసారి మోదీకి బ్రహ్మరథం పట్టారు. భారతమాత ముద్దుబిడ్డ అయిన నరేంద్ర మోదీకి ఈ దేశంలోని కోట్ల మంది తల్లుల రూపంలో సాక్షాత్తూ ఆ భరతమాత ఆశీస్సులే రక్షక కవచంలా ఉన్నాయి. ఆ తల్లులందరికీ ఒక కన్న కొడుకుగా, విదేశీ రాబందుల నుండి, ఈ యాంటీ-హిందూ అర్బన్ నక్సల్స్ నుండి ఈ ‘భారత మాత’ను సురక్షితంగా కాపాడేందుకు నరేంద్ర మోదీ అనే ఆ అలుపెరగని యోధుడు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతూనే ఉంటాడు!


