తస్లీమా నస్రీన్ రాక: ఇస్లామిక్ ఉన్మాదాన్ని కప్పిపుచ్చుతూ హిందువులనే విలన్లుగా చూపుతున్న ‘లెఫ్ట్’ మీడియా!
India లో లెఫ్ట్-లిబరల్ మీడియా ఇస్లామిక్ రాడికలిజం ని కప్పిపుచ్చి, హిందువులనే తప్పు పట్టేలా వార్తలు రాయడంలో పీహెచ్డీ చేసింది. ఈ సారి వాళ్ల టార్గెట్ తస్లీమా నస్రీన్ కోల్కతా తిరిగి రావడం. The Indian Express లో వచ్చిన ‘In Taslima Nasrin’s return to West Bengal, two stories of religious majoritarianism’ అనే ఆర్టికల్ వాళ్ళ హిపోక్రసీ కి పక్కా ఉదాహరణ. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని డైరెక్ట్ గా తప్పు పట్టలేక, అనవసరంగా హిందువులను బ్లేమ్ చేస్తూ రాశారు.
2007లో తస్లీమా నస్రీన్ కోల్కతా వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆమెను ఇస్లామిక్ రాడికల్స్ బెదిరించి పంపించేశారు. ఆమె రాసిన ‘లజ్జ’ పుస్తకం లో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎండగట్టడమే ఆమె చేసిన తప్పు. అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆమెకు రక్షణ కల్పించకుండా వదిలేశాయి.
ఇప్పుడు ఆమె మళ్లీ కోల్కతా తిరిగి వస్తే, ఇన్నాళ్లూ ఫ్రీ స్పీచ్ గురించి మాట్లాడిన మేధావులు సంతోషించాల్సింది పోయి, ఇదొక “హిందూ నేషనలిస్ట్ ప్లాట్” అంటున్నారు. ఆమెకు రక్షణ కల్పించడం వల్ల ముస్లింలను కించపరిచినట్లు అవుతుందని, ఆమెకు స్వాగతం పలకడం కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని The Indian Express ఆర్టికల్ లో రాసుకొచ్చారు. అంటే ఉగ్రవాదులు బెదిరిస్తే తప్పులేదు, రక్షణ ఇస్తే మాత్రం తప్పు!
> ఈ ఎడమ చేతివాటం మీడియా వాళ్ళు “మేజారిటేరియనిజం” అనే పదాన్ని హిందువులను టార్గెట్ చేయడానికి వాడుకుంటున్నారు. ప్రాణభయంతో వచ్చిన ఒక రచయిత్రికి స్వాగతం పలికితే అది మేజారిటేరియనిజం ఎలా అవుతుందో వాళ్లకే తెలియాలి. వాస్తవాలను వక్రీకరించి, ఉగ్రవాదాన్ని సమర్థిస్తూ, హిందువులను విలన్స్ గా చూపే ఈ మీడియా ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది.
>


