మేడ్చల్లో సంచలనం.. మల్లారెడ్డిని వెనక్కి నెట్టి దూసుకుపోతున్న ఈనుగు సుదర్శన్ రెడ్డి!
మేడ్చల్:
మేడ్చల్ నియోజకవర్గంలో రగులుతున్న ‘కమలం’ కాక ఇప్పట్లో చల్లారేలా లేదు. బెంగాల్ తరహాలో ఊహించని రేంజ్లో దూసుకొస్తున్న బీజేపీ “విన్నింగ్ వేవ్” క్షేత్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే వేవ్ గనుక మున్ముందు ఇలాగే కంటిన్యూ అయితే, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈనుగు సుదర్శన్ రెడ్డి బంపర్ మెజారిటీతో ఘనవిజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
సునామీలా మారనున్న 2028 ఎన్నికలు!
ప్రస్తుతం నియోజకవర్గంలో నడుస్తున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. సుదర్శన్ రెడ్డి గ్రాఫ్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్ర అసంతృప్తి.. ఈ రెండూ బీజేపీకి అతిపెద్ద వరంగా మారాయి. నాయకుడిపై నమ్మకం, స్వచ్ఛమైన రాజకీయాలు చేసే వ్యక్తిగా సుదర్శన్ రెడ్డికి ఉన్న క్లీన్ ఇమేజ్ రాబోయే ఎన్నికల నాటికి ఒక భారీ రాజకీయ సునామీని సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మల్లారెడ్డికి చెక్.. కాంగ్రెస్కు ప్యాకప్!
డబ్బు రాజకీయాలతో, హంగామాతో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డికి 2028 ఎన్నికలు ఒక పీడకలగా మారనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న వేవ్ దృష్ట్యా, మల్లారెడ్డి ఎంత ప్రయత్నించినా బీజేపీ దూకుడును అడ్డుకోవడం అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ పరిస్థితి మరింత దిగజారిపోయి, ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాబోతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు క్రమంగా కాషాయం వైపు మళ్లుతోంది.
ఇదే ఊపు, ఇదే ప్రజాదరణ 2028 ఎన్నికల నాటికి మరింత ఉధృతంగా మారడం ఖాయం. గ్రామాలు, కాలనీలు అన్న తేడా లేకుండా ప్రతి చోటా సుదర్శన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. మేడ్చల్ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు.. ఆ మార్పు సుదర్శన్ రెడ్డి రూపంలో వారికి స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ విజయావకాశాలను సుస్థిరం చేసుకోవడంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి మరికొన్ని కీలక వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ వెనుక క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తల కష్టం ఎంతో ఉంది. ఈ కార్యకర్తలే పార్టీకి అసలైన వెన్నెముక, కాబట్టి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం సుదర్శన్ రెడ్డికి అత్యంత ప్రధానం. ప్రతి మండల, బూత్ స్థాయి కార్యకర్తను పేరుపేరునా పలకరిస్తూ, వారి వ్యక్తిగత కష్టసుఖాల్లోనూ తోడుగా నిలవడం ద్వారా ఆయన నాయకత్వానికి మరింత విశ్వసనీయత పెరుగుతుంది. అంతేకాకుండా, పార్టీలోకి కొత్తగా వస్తున్న యువతను, ఇతర పార్టీల నుంచి చేరుతున్న శ్రేణులను పాత కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, అందరికీ తగిన గుర్తింపు, గౌరవం కల్పించేలా ఒక పటిష్టమైన కార్యాచరణను రూపొందించుకోవాలి. కార్యకర్తలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాననే భరోసా కల్పిస్తూ, వారిని ఎన్నికల సమరయోధులుగా నిలబెట్టినప్పుడే 2028లో మేడ్చల్ పీఠంపై కాషాయ జెండాను తిరుగులేని మెజారిటీతో ఎగురవేయడం సాధ్యమవుతుంది.
మొత్తానికి పశ్చిమ బెంగాల్ తరహాలో.. ప్రత్యర్థులకు ఏమాత్రం కోలుకునే అవకాశం ఇవ్వకుండా, 2028లో ఈనుగు సుదర్శన్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం, మేడ్చల్ గడ్డపై కమల వికాసం జరగడం ఒక చారిత్రక అవసరంగా మారిందని రాజకీయ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి!


