పాకిస్థాన్‌కు గుండె దడ: ‘ఊహించని రీతిలో బదులిస్తాం’ – రాజ్‌నాథ్ సింగ్ సింహగర్జన
కార్గిల్ విజయ్ దివస్ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దుల్లో పాక్ చేసే ప్రతి దుస్సాహసానికి ఇకపై ఊహించని రీతిలో బదులిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ పాకిస్థాన్‌తో భవిష్యత్తులో చర్చలంటూ జరిగితే, అవి కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) పైనే ఉంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. పీవోకే అనేది భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, దానిని పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిందని రాజ్‌నాథ్ సింగ్ ప్రపంచ దేశాలకు గట్టిగా తేల్చిచెప్పారు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌లో మిలిటరీకి, మిలిటెన్సీకి మధ్య ఎలాంటి తేడా లేదని, ఉగ్రవాదులతో కలిసే అక్కడి ఆర్మీ పనిచేస్తోందని రక్షణ మంత్రి మండిపడ్డారు. ఉగ్రవాదులను, వారికి మద్దతిస్తున్న ప్రభుత్వాలను భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుగా చూడబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా పాకిస్థాన్‌కు అప్పటికే స్పష్టంగా తెలియజేశామని గుర్తుచేస్తూ, దేశ సార్వభౌమాధికారం విషయంలో ఉగ్రవాదుల పట్ల రాజీలేని పోరాటం చేస్తామని దాయాది దేశానికి రాజ్‌నాథ్ సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.


