మువ్వన్నెల జెండాకు అవమానం: దేశం కంటే ఓట్ల రాజకీయాలే ముఖ్యమన్న మంత్రి జమీర్!
దేశభక్తి, జాతీయ జెండా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత చులకనో మరోసారి బహిర్గతమైంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు పవిత్రమైన మువ్వన్నెల జెండాను ఎగురవేయడానికి “నాకు సమయం లేదు” అంటూ కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగిస్తున్నాయి. భారతమాతకు వందనం చేయడం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం కంటే పార్టీ రాజకీయాలే ముఖ్యమన్నట్లుగా ఆయన ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీ జాతి వ్యతిరేక మానసిక స్థితికి అద్దం పడుతోంది.

విజయనగర జిల్లాలో ఆగస్టు 15న జెండా ఎగురవేసే బాధ్యతల నుంచి తనను మినహాయించాలని కోరుతూ ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లేఖ రాయడం ఆయన అహంకారానికి పరాకాష్ట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, పార్టీ బలోపేతం వంటి పనులతో తాను చాలా బిజీగా ఉన్నానని, కాబట్టి జెండా ఎగురవేసే సమయం తనకు లేదని ఆ లేఖలో రాసి జాతీయ పర్వదినాన్ని తీవ్రంగా అవమానించారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి, దేశ ప్రయోజనాల కంటే పార్టీ పనులే ముఖ్యమని చెప్పడం ఎంతటి సిగ్గుచేటు?
దేశం కంటే పార్టీ ఏనాటికీ గొప్పది కాదు. కానీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు, అధికార దాహానికి అలవాటు పడిన కాంగ్రెస్ నాయకులకు మాత్రం జాతీయవాదం అంటే ఎప్పుడూ చులకనే. జాతీయ జెండాను గౌరవించడానికి కనీస సమయం కేటాయించలేని మంత్రికి, అసలు ఆ పదవిలో కొనసాగే అర్హత ఎక్కడుంది? ఓట్ల కోసం, సీట్ల కోసం అహర్నిశలు దిగజారుడు రాజకీయాలు చేసే ఈ నాయకులకు, దేశ భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు నివాళులర్పించేందుకు కొన్ని నిమిషాల సమయం దొరక్కపోవడం కచ్చితంగా దేశ ప్రజల మనోభావాలను గాయపరచడమే.
ఈ దేశద్రోహ పూరితమైన చర్యపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక మంత్రి జమీర్ అహ్మద్ వ్యాఖ్యలను అత్యంత కఠినంగా ఖండించారు. జెండా ఎగురవేయడానికి సమయం లేదని చెప్పడం ద్వారా ఆయన సాక్షాత్తూ దేశద్రోహానికే పాల్పడ్డారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి, జాతీయ జెండాకు నివాళులర్పించే పవిత్రమైన కర్తవ్యం కంటే పార్టీ రాజకీయాలు పెద్దవా అయిపోయాయా? అంటూ ఆర్. అశోక సంధించిన ప్రశ్నలు ప్రతి సామాన్య జాతీయవాది గుండె చప్పుడు.
ఇంతటి ఘోరమైన అవమానానికి పాల్పడిన మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్‌ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. జాతీయ జెండాను అవమానించిన వ్యక్తిని ఇంకా కేబినెట్ లో కొనసాగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయన జాతి వ్యతిరేక విధానాలను పూర్తిస్థాయిలో సమర్థిస్తున్నట్లే లెక్క. ముఖ్యమంత్రి, డీకే శివకుమార్‌లు వెంటనే స్పందించి ఆయనను పదవి నుంచి పీకిపారేసి దేశం పట్ల తమకు ఏమాత్రం గౌరవం ఉందో నిరూపించుకోవాలి. లేకుంటే జాతి పట్ల కాంగ్రెస్ కు ఉన్న కపట ప్రేమ మరోసారి బట్టబయలైనట్లే.
అధికార మదంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న ఇలాంటి నాయకుల నిజస్వరూపాన్ని హిందూ సమాజం, జాతీయవాదులు ముక్తకంఠంతో ఎండగట్టాలి. “సమయం లేదు” అని కుంటి సాకులు చెబుతూ జాతీయ జెండాను అవమానించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. దేశం పట్ల, మువ్వన్నెల జెండా పట్ల కనీస భక్తి, గౌరవం లేని వీరికి అధికారంలో ఉండే నైతిక హక్కు బొత్తిగా లేదు. జాతీయవాదాన్ని అపహాస్యం చేసే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అహంకారపూరిత మంత్రులకు కర్ణాటక ప్రజలే కాదు, యావత్ భారతదేశమే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.


