మోదీపై బూతులు.. వెనుక చైనా నిధులు? బట్టబయలైన iThrive సీఈఓ కుట్ర!
ఆరోగ్యం, పోషకాహారం పేరుతో ‘iThrive’ (ఐథ్రైవ్) అనే వెల్నెస్ కంపెనీని నడుపుతున్న సీఈఓ ముగ్ధా ప్రధాన్ తన మానసిక వికృతత్వాన్ని, అహంకారాన్ని బట్టబయలు చేసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో కొందరు యువత ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆమె స్వయంగా ప్రధానిపై అత్యంత జుగుప్సాకరమైన, నీచమైన భాషను ఉపయోగించారు. ప్రజల ఆరోగ్య సమస్యల మూలాలను పరిష్కరిస్తామని గొప్పలు చెప్పుకునే ఈ సీఈఓ, తన బూతు పురాణంతో తనకే అత్యవసరంగా మానసిక వైద్యం అవసరమన్న విషయాన్ని సమాజానికి స్పష్టం చేశారు.
ఒక దేశ ప్రధాని అని కూడా చూడకుండా ఆమె వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన వైరల్ వీడియోలో ఆమె అహంకారపూరితంగా మాట్లాడుతూ… “మహిళలు, పిల్లల కోపాన్ని అణచివేయడం తమ హక్కు అని భావించే ఈ ముసలివాళ్లందరినీ నేను పట్టుకుని చెంపదెబ్బ కొట్టాలనుకుంటున్నాను” అని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, “దేశ ప్రధాని స్థానంలో కూర్చుని, మమ్మల్ని క్షమిస్తున్నాను అంటూ రీల్స్ చేస్తావా? నువ్వు నాకు కనిపిస్తే ఒక్క చెంపదెబ్బ కొడతాను. ఆ పదవిలో ఉండాల్సిన అర్హత నీకు లేదు, నా దేశం నుంచి గెట్ అవుట్, నీ పదవి నుంచి గెట్ అవుట్” అంటూ తన విద్వేషాన్ని కక్కారు.
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. 45 ఏళ్ల వయసున్న ఈమె, ప్రధాని వయసును కించపరుస్తూ మాట్లాడటం ఆమె ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రముఖ జర్నలిస్టులు, సామాన్యులు సైతం ఆమెను ఏకిపారేస్తున్నారు. “బహిరంగంగా ఇంత అస్థిరంగా, ద్వేషపూరితంగా ప్రవర్తించే ఒక మహిళ తయారు చేసే బ్రాండ్ ఉత్పత్తులను ఎవరైనా ఎలా నమ్ముతారు? ఆమెకు అర్జెంట్‌గా మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ అవసరం” అంటూ నెటిజన్లు iThrive బ్రాండ్‌ను సైతం బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈమె ప్రధానిపై ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం వెనుక విదేశీ నిధుల కుట్ర ఉందన్న బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఫంగ్ కుటుంబానికి చెందిన ‘ఫంగ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్’ (Fung Strategic Investments) నుండి iThrive కంపెనీకి పెట్టుబడులు అందినట్లు సమాచారం. చైనా అనుకూల శక్తుల ఫండింగ్ తో నడిచే ఇలాంటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే దేశ ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని, చైనా ‘అసెట్’ గా పనిచేస్తున్న ఈమెపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఒకవైపు జంతర్ మంతర్ వద్ద తనను, తన చనిపోయిన తల్లిని అత్యంత దారుణంగా దూషించిన ఆందోళనకారులను సైతం “దారి తప్పిన పిల్లలు”గా భావించి, క్షమిస్తున్నానని ప్రధాని మోదీ హుందాతనాన్ని ప్రదర్శిస్తే… ముగ్ధా ప్రధాన్ లాంటి కార్పొరేట్ సీఈఓలు మాత్రం ఆ హుందాతనాన్ని అలుసుగా తీసుకుని బూతులు మాట్లాడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక కంపెనీ ఫౌండర్, ఇలా ఒక రోడ్ సైడ్ ట్రోలర్ లాగా మారిపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


