ఇంటర్నెట్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) అంటూ కొన్ని రోజులుగా ఏఐ ఇమేజ్‌లు, రీల్స్‌తో తెగ హల్చల్ చేస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్ అభిజీత్ డిప్కేకి రియల్ వరల్డ్‌లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. జైపూర్‌లోని నిరసనల్లో పాల్గొనేందుకు పెద్ద లీడర్లా ఎంట్రీ ఇచ్చిన ఈ ‘బొద్దింకల’ రాజుగారికి, ఊహించని విధంగా పబ్లిక్ నుంచి గట్టి ట్రీట్మెంట్ దొరికింది. నిత్యం కీబోర్డ్ ముందు కూర్చుని, వింత వింత కాన్సెప్ట్‌లతో నెటిజన్ల సహనాన్ని పరీక్షించే ఈయన గారికి, ఎవరో ఒక ఆగంతకుడు ‘మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్’ అన్నట్టు డైరెక్ట్ యాక్షన్ ద్వారా సమాధానం చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ‘స్లాప్-కలేష్’వీడియో నెట్టింట వైరల్ అవుతూ మీమ్స్ జాతరను లేపుతోంది.
అసలు సీన్ ఏంటంటే, తన అనుచరులు భుజాలపై ఎక్కించుకుని జై కొడుతుంటే, డిప్కే గారు ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టు గాల్లో తేలిపోతూ ఊరేగుతున్నారు. అంతలోనే గుంపులో నుంచి దూసుకొచ్చిన ఒక యువకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డిప్కే గారి చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బ సౌండ్ కి అప్పటివరకు ఆకాశంలో విహరిస్తున్న మన లీడర్ గారి సిగ్నల్స్ ఒక్కసారిగా కట్ అయిపోయాయి, ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అసలు పార్టీకి ‘బొద్దింకల పార్టీ’ అని పేరు పెట్టుకున్నప్పుడే డిప్కే ఒక కనీస లాజిక్ మిస్ అయ్యాడు. సమాజంలో ఎక్కడైనా బొద్దింక కనిపిస్తే పబ్లిక్ చీపురుతోనో, చెప్పుతోనో, లేదంటే చేత్తోనో గట్టిగా వాయిస్తారన్న సంగతి ఈ సోషల్ మీడియా వీరుడికి ఎవరో ఒకరు ముందే చెప్పాల్సింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగి డిప్కే గారి బుర్రలోని బొద్దింకలన్నీ ఒకేసారి ఎగిరిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
వర్చువల్ ప్రపంచంలో కూర్చుని ‘మేము లేజీ అండ్ అన్‌ఎంప్లాయిడ్ బొద్దింకలం’ అంటూ బిల్డప్‌లు ఇవ్వడం వేరు, రియల్ వరల్డ్‌లో పబ్లిక్ మధ్య తిరగడం వేరు అని ఈ దెబ్బతో రుజువైంది. దెబ్బ పడిన మిల్లీ సెకండ్ లో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి నెటిజన్లు థియేటర్లలో నవ్వుకున్నట్టు నవ్వుకుంటున్నారు, “అభిజీత్ గారికి స్పాట్ లోనే ఉచిత ఫేషియల్ మసాజ్ దొరికింది” అంటూ సెటైర్లతో చెడుగుడు ఆడుకుంటున్నారు. అక్కడ పోలీసులు దాడి చేసిన వాళ్లని అరెస్ట్ చేసినా, “మేము తగ్గేదే లే” అని డిప్కే తర్వాత ట్విట్టర్ లో కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా.. లైవ్‌లో పడిన ఆ చెంపదెబ్బ సౌండ్ మాత్రం ఇంటర్నెట్లో గట్టిగానే వినిపిస్తోంది. ఓవరాక్షన్ కి పబ్లిక్ ఇచ్చే రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ దెబ్బతోనైనా మన లీడర్ గారు తన సోషల్ మీడియా కలల ప్రపంచం నుంచి బయటకు వచ్చి కాస్త రూట్ మారుస్తారేమో చూడా

I am Sirisha N, an independent journalist and proud right-winger. With a Post Graduation from the AP College of Journalism, I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.
