హిందూ ఆడబిడ్డలకు రక్షణ ఏదీ? అహ్మదాబాద్లో మతోన్మాది కిరాతకం!
అహ్మదాబాద్లో గుండెల్ని పిండేసే దారుణ ఘటన చోటుచేసుకుంది. సమీర్ ఖాన్ అనే మతోన్మాది వేధింపులకు బలైన 16 ఏళ్ల మైనర్ హిందూ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించాలంటూ, తనతో రిలేషన్షిప్లో ఉండాలంటూ ఆ కీచకుడు కొద్ది రోజులుగా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నాడు. వాడి రాక్షసత్వం భరించలేక, తమ బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి మారినా.. ఆ దుర్మార్గుడు అక్కడికి కూడా చేరుకుని సైకోలా వెంటబడటంతో, దిక్కుతోచని ఆ పసిప్రాణం ఉరితాడుకు వేలాడింది.
హిందూ ఆడబిడ్డల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. వ్యూహాత్మకంగా బుట్టలో వేసుకోవడానికి పన్నుతున్న వలల్లో పడనందుకు, ఏకంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి కల్పించడం వెనుక ఉన్నది పక్కా కుట్ర అని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. చట్టం, పోలీసులంటే ఏమాత్రం భయం లేకుండా, ఇల్లు మారినా సరే పసిగట్టి మరీ ఓ ప్రాణాన్ని బలితీసుకున్న ఆ దుర్మార్గుడి తెగింపు చూస్తుంటే.. ఇలాంటి వారికి వ్యవస్థ పట్ల ఏమాత్రం లెక్కలేదన్నది స్పష్టమవుతోంది.
ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. హిందూ బాలికల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఉన్మాదులను ఉరితీయాలంటూ బజరంగ్ దళ్ కార్యకర్తలు భారీ ఆందోళనకు దిగారు. వీధులెక్కి నిరసనలు తెలుపుతూ పోలీసు స్టేషన్ను ముట్టడించడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. హిందూ సంఘాల ఒత్తిడితో ఎట్టకేలకు నిందితుడు సమీర్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి మృగాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఏ హిందూ ఆడబిడ్డకూ ఈ గతి పట్టదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


