శేషాచలం కొండలపై దర్గా.. హిందూ ఆలయాలపై ప్రతాపం చూపించే అధికారులకు ఇవి కనిపించవా?
హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పవిత్ర శేషాచలం కొండలపై అన్యమతస్థులు కన్నేశారు. ‘దేవుని గడప’గా పిలుచుకునే కడప నుండి తిరుమలగిరులకు వెళ్లే అత్యంత పవిత్రమైన ఈ అటవీ ప్రాంతంలో రాత్రికి రాత్రే “హజ్రత్ సయ్యద్ షా వలీ దర్గా” పుట్టుకురావడం హిందూ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మక్కాలోనో, జెరూసలేంలోనో మనం గుడి కట్టగలమా? కనీసం పూజ చేసుకోగలమా? మరి హిందువుల పవిత్ర స్థలాల్లో, దేవుని మాన్యాల్లో మాత్రమే ఈ అక్రమ నిర్మాణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ముమ్మాటికీ హిందువుల మనోభావాలపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడి, పక్కా ప్రణాళికతో సాగుతున్న కబ్జా పర్వమే అని హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

కడప నుండి తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై, కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనుమలోపల్లె వద్ద ఏకంగా రోడ్డు పక్కనే ఒక ఆర్చ్ ఏర్పాటు చేసి బహిరంగంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. అక్కడి రైల్వే బ్రిడ్జి కింద గుండా వెళితే ఈ దర్గా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నిబంధనలు అత్యంత కఠినంగా ఉండే ఈ దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ లోపల అక్రమంగా సిమెంట్ రోడ్లు, నీటి వసతి లాంటి మౌలిక సదుపాయాలు చాలా పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో ఒక చిన్న ఇటుక పెట్టాలన్నా వణికిపోయే వ్యవస్థ, ఇంత భారీ స్థాయిలో పక్కా నిర్మాణాలు జరుగుతుంటే కళ్లు మూసుకోవడం వెనుక స్థానికంగా ఉన్న కొందరి కుట్రలు, మద్దతు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక్కడే మన అధికారుల సెక్యులరిజం ముసుగు, హిందూ వ్యతిరేక పక్షపాత బుద్ధి బట్టబయలవుతోంది. ఇదే అటవీ ప్రాంతం పరిధిలోని పవిత్ర జ్యోతి క్షేత్రంలో ఉన్న ప్రసిద్ధ కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని ‘అటవీ భూమి’ అనే సాకుతో అధికారులు ఎంత కర్కశంగా కూల్చివేశారో హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదు. హిందూ ఆశ్రమాలు, గుడుల మీద ప్రతాపం చూపించే అటవీ శాఖ అధికారులు, ఎలాంటి అనుమతులు లేని ఈ దర్గా కడుతుంటే మాత్రం గుడ్డివాళ్ళలా ఎందుకు మిన్నకుండిపోయారు? చట్టాలు, నిబంధనలు కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తాయా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీ బుజ్జగింపుల కోసం అధికారులే స్వయంగా ఈ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న తీరు హిందూ ధర్మానికి పట్టిన చీడను స్పష్టం చేస్తోంది.
ఈ మతపరమైన అక్రమ చొరబాట్లను హిందూ సమాజం ఇక ఏమాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు. హిందువుల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉన్న ప్రస్తుత తరుణంలో, ధర్మ పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణమే అటవీ శాఖ అనుమతులు లేకుండా వెలసిన ఆ దర్గాను తొలగించి, శేషాచలం కొండల పవిత్రతను కాపాడాలి. లేనిపక్షంలో, అక్రమ నిర్మాణాలకు వంతపాడుతున్న అధికారుల బాగోతాన్ని బయటపెడుతూ పెద్ద ఎత్తున ధర్మ పోరాటానికి హైందవ సమాజం సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


