ఫ్యాక్ట్ చెక్ బై జర్నలిస్ట్ శిరీష! ‘ఇండిపెండెంట్ జర్నలిజం’ ముసుగులో తులసి చందు ఫేక్ న్యూస్ ప్రచారం?
జర్నలిస్ట్ శిరీష రిపోర్టింగ్ | Kadpathr.in
స్వతంత్ర జర్నలిజం ముసుగులో అజెండా రాజకీయాలా? నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తానని చెప్పుకుంటూ.. వాస్తవాలను వక్రీకరించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఎంతవరకు సమంజసం? అయోధ్య రామాలయం సాకుగా చూపి, సగం నిజాలతో నరేటివ్ సెట్ చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు యూట్యూబర్ తులసి చందు. ‘రాముడి కంటే రావణ్ ముఖ్యమా?’ అంటూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఆమె చేసిన వీడియోలో దాచిపెట్టిన నిజాలేంటి? ఆమె ఆరోపణల వెనుక ఉన్న ఫేక్ న్యూస్ బండారం ఏంటి? పూర్తి ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్ మీకోసం:
హుండీ దొంగతనాన్ని దాచేశారు.. ఎవరూ పట్టించుకోవట్లేదు?
- వాస్తవం: అయోధ్యలో చోరీ జరిగింది నిజమే. కానీ, దీన్ని అధికారులు దాచిపెట్టలేదు. బ్యాంకులో డిపాజిట్ అవుతున్న మొత్తానికి, లెక్కలకు తేడా ఉండడాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులే స్వయంగా గుర్తించారు. కౌంటింగ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగలను పట్టుకుంది వారే. ట్రస్ట్ ఫిర్యాదుతో యూపీ ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది.
- తాజా అప్డేట్: ఈ స్కామ్‌లో విచారణ జరిపిన సిట్.. క్లర్క్ అవినాష్ శుక్లాను ప్రైమ్ అక్యూజ్డ్గా తేల్చింది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి రూ. 80 లక్షలకు పైగా రికవరీ చేశారు.

Ayodhya Ram Mandir Premises. Source: Kailash Mansarovar Yatra
. భూకుంభకోణం: 2 కోట్ల భూమిని 10 నిమిషాల్లో 18.5 కోట్లకు కొన్నారా?
- వాస్తవం: వీడియోలో 2 కోట్ల భూమిని కేవలం 10 నిమిషాల వ్యవధిలో ట్రస్ట్ 18.5 కోట్లకు కొని రాముడిని నిలువునా దోచేసింది అని తులసి చందు ఆరోపించారు. కానీ దీని వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని దాచేశారు. ఆ భూమికి సంబంధించిన అసలు కొనుగోలు ఒప్పందం (Agreement to sell) పదేళ్ల క్రితమే (2011 సమయంలో) జరిగింది. ఆ పాత అగ్రిమెంట్ ప్రకారమే 2021లో మొదటి రిజిస్ట్రేషన్ పాత ధరకే (2 కోట్లకు) జరిగింది.
- కానీ ట్రస్ట్ ఆ భూమిని కొనుగోలు చేసే నాటికి (2021) అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పటి కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారమే ట్రస్ట్ ఆ భూమిని 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ట్రస్ట్ 2021లోనే ఆధారాలతో సహా స్పష్టం చేసింది. పాత అగ్రిమెంట్ విషయాన్ని కప్పిపుచ్చి, కేవలం 10 నిమిషాల్లో రేటు పెరిగిందని చెప్పడం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే.

1250 కిలోల బంగారం, వెండి మాయమయ్యాయా?
- వాస్తవం: సంతోష్ దూబే చేసిన ఈ ఆరోపణలను ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది. భక్తులు ఇచ్చిన 2,926 వస్తువులు (బంగారం, వెండి ఇటుకలు, ఆభరణాలు) స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ప్రతి ఏటా ఆడిట్ చేయబడుతున్నాయని, అవన్నీ భద్రంగా ఉన్నాయని ట్రస్ట్ ట్రెజరర్ గోవింద దేవగిరి స్పష్టం చేశారు. పారదర్శకత కోసం వాటిని బహిరంగ ప్రదర్శనకు కూడా ఉంచారు.
చంపత్ రాయ్ రాజీనామా పై వీడియోలో తప్పుడు సమాచారం
- వాస్తవం: చంపత్ రాయ్ రాజీనామా పెండింగ్‌లో ఉందని, జూలై 11న నిర్ణయం తీసుకుంటారని వీడియోలో తులసి చందు పేర్కొన్నారు. కానీ ఇది పూర్తిగా పాత వార్త. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే.
- తాజా అప్డేట్: దొంగతనం వెలుగుచూసిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా చేసిన రాజీనామాలను జూలై 6న జరిగిన ప్రత్యేక సమావేశంలో ట్రస్ట్ అధికారికంగా ఆమోదించింది. వారి స్థానంలో కృష్ణ మోహన్‌ను ఇంటీరియమ్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఆలయ ట్రస్ట్‌లో ప్రక్షాళన ఇప్పటికే పూర్తయింది.

నేషనల్ మీడియా సైలెంట్ గా ఉందా?
- వాస్తవం: దొంగతనం జరిగిన నాటి నుంచి ఇండియా టుడే, WION, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ మీడియా సంస్థలు దీనిపై కంటిన్యూస్ ఇన్వెస్టిగేటివ్ కవరేజ్ ఇస్తూనే ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి జాతీయ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు గుప్పించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగలేదనడం పచ్చి అబద్ధం.
రాముడి కంటే ‘రావణ్’ ముఖ్యమా? (పవన్ కళ్యాణ్ పై విమర్శ)
- వాస్తవం: ఇక్కడ రెండు వేర్వేరు రాష్ట్రాల, వేర్వేరు అంశాలను ముడిపెట్టే ప్రయత్నం జరిగింది. యూట్యూబర్ రావణ్‌పై ఉపా (UAPA) కేసు నమోదు కావడం, అతన్ని అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతలకు సంబంధించిన అంశం. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరియు కేంద్రం పరిధిలోని అంశం. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే సిట్ వేసి యాక్షన్ మోడ్‌లో ఉంది. యూపీలో జరుగుతున్న దర్యాప్తును పక్కనపెట్టి, ఏపీ మంత్రిని ప్రశ్నించడంలో కేవలం పొలిటికల్ అజెండా, బురదజల్లే ఉద్దేశాలే తప్ప ఏమాత్రం లాజిక్ లేదు.

సొంత రాష్ట్రంలో గుడులపై దాడులు జరిగితే సైలెంటా?

- వాస్తవం: యూట్యూబర్ తులసి చందు నివసిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇటీవల తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి. ఈ దాడుల వెనుక ఉన్న నిజానిజాలు తేల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సిట్ (SIT) వేసి దర్యాప్తుకు ఆదేశించింది. సొంత రాష్ట్రంలో, కళ్లెదుటే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, వాటిపై ఇక్కడ సిట్ విచారణలు జరుగుతున్నా.. వాటిని ఏనాడూ ప్రశ్నించని ఈ ‘ఇండిపెండెంట్ జర్నలిస్ట్’.. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఇష్యూని పట్టుకుని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం దేనికి సంకేతం? తెలంగాణలో గుడులపై దాడులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? తనకు కావాల్సిన పొలిటికల్ అజెండాను మాత్రమే భుజానికెత్తుకుని, లోకల్ ఇష్యూస్‌ను గాలికొదిలేయడం ఎలాంటి జర్నలిజం?
అయోధ్య ఆలయంలో కింది స్థాయి సిబ్బంది కొందరు అవినీతికి పాల్పడింది వాస్తవం. అయితే ఆ దొంగలను పట్టుకుంది, సిట్ వేసి అరెస్టులు చేయించింది ట్రస్ట్ మరియు ప్రభుత్వమే. భూముల వ్యవహారంలోనూ పాత అగ్రిమెంట్ల ప్రకారం జరిగిన లావాదేవీలను స్కామ్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. పూర్తి వాస్తవాలను, లేటెస్ట్ అప్డేట్స్ ను కావాలనే దాచిపెట్టి.. సగం నిజాలతో యాంటీ-గవర్నమెంట్ నరేటివ్‌ను సెట్ చేస్తూ, జర్నలిజం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం శోచనీయం.


