ఢిల్లీ యూనివర్సిటీ సంచలన నిర్ణయం: పీజీ సిలబస్ నుంచి ‘ఢిల్లీ సుల్తానేట్’ చరిత్ర తొలగింపు
ఢిల్లీ యూనివర్సిటీ (DU) చరిత్ర విభాగం పీజీ (PG) సిలబస్‌లో సంచలన మరియు అత్యంత అవసరమైన మార్పులు చేసింది. దశాబ్దాలుగా భారతీయ విద్యార్థుల మెదళ్లలో చొప్పించిన వక్రీకృత చరిత్రకు చెక్ పెడుతూ, సెమిస్టర్ III హిస్టరీ సిలబస్ నుండి ‘ఢిల్లీ సుల్తానేట్’కు సంబంధించిన పేపర్‌ను పూర్తిగా తొలగించింది. ఆగస్టు 7, 2026న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ద్వారా “ది ఢిల్లీ సుల్తానేట్: స్ట్రక్చర్స్ ఆఫ్ అథారిటీ ఇన్ మిడీవల్ నార్త్ ఇండియా (13-14వ శతాబ్దం)” అనే పేపర్‌ను డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ (DSE) జాబితా నుండి పక్కకు పెట్టింది. ఇది మన విద్యావ్యవస్థలో పేరుకుపోయిన వలసవాద, వామపక్ష భావజాల అవశేషాలను ప్రక్షాళన చేయడంలో ఒక చారిత్రక అడుగు అని చెప్పవచ్చు.
అసలు ఈ పేపర్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే.. ఢిల్లీ సుల్తానేట్ కాలం భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ కాలం కేవలం “అధికార నిర్మాణాలు” (Structures of Authority) లేదా గొప్ప పరిపాలనా విధానాల గురించి కాదు, ఇస్లామిక్ ఆక్రమణదారులు సాగించిన క్రూరమైన దాడుల గురించి. అమాయక పౌరులు, మహిళలు, చిన్నపిల్లలు అని చూడకుండా చేసిన ఊచకోతలు, సామూహిక హత్యలు, బానిసత్వం, దారుణమైన శిక్షలు ఈ కాలంలోనే జరిగాయి. ఇంతటి నెత్తురోడిన కాలాన్ని ఒక గొప్ప పరిపాలనా యుగంగా కీర్తిస్తూ విద్యార్థులకు బోధించడం భారతీయ సంస్కృతిని, నిజమైన చరిత్రను అవమానించడమే అవుతుంది. ఈ చారిత్రక వాస్తవాలను దాచిపెట్టి ఆక్రమణదారులను ఆకాశానికెత్తే ఈ అబద్ధపు చరిత్రకు వర్సిటీ ముగింపు పలికింది.
ఈ ఇస్లామిక్ ఆక్రమణదారుల దురాగతాలు కేవలం ప్రాణనష్టానికే పరిమితం కాలేదు, భారతీయ సనాతన ధర్మంపై, మన అద్భుతమైన ఆలయాలపై వారు చేసిన విధ్వంసం వర్ణనాతీతం. గుజరాత్‌లోని పవిత్ర సోమనాథ్ ఆలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథుని గుడి, దక్షిణ భారతదేశంలోని శ్రీరంగం వంటి ఎన్నో వైష్ణవ క్షేత్రాలను, దక్కన్ ప్రాంతంలోని వేలాది హిందూ దేవాలయాలను వారు నేలమట్టం చేశారు, దోచుకున్నారు. ఈ విధ్వంసకారులను “గొప్ప పాలకుల” ముసుగులో మన పాఠ్యాంశాల్లో దశాబ్దాలుగా కూర్చోబెట్టారు. ఈ విధ్వంసాన్ని కప్పిపుచ్చే సిలబస్‌ను తొలగించడం ద్వారా వర్సిటీ ఒక జాతీయవాద, వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించింది.
ఢిల్లీ సుల్తానేట్తో పాటు, 2019-20 విద్యా సంవత్సరం నుండి కొనసాగుతున్న “హిస్టరీ ఆఫ్ నార్త్ ఇండియా, సి. 1400-1550”, అలాగే ప్రాచీన కాలానికి సంబంధించిన “జెండర్ అండ్ ఉమెన్ ఇన్ ఎర్లీ ఇండియా”, “పొలిటికల్ ప్రాసెసెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ పాలిటీస్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ లిటరేచర్” వంటి వక్రీకృత పేపర్లను కూడా తొలగించారు. ఈ నిర్ణయం ఏదో రాత్రికి రాత్రే తీసుకున్నది కాదు. డిపార్ట్మెంట్ కమిటీ ఆఫ్ కోర్సెస్ ద్వారా ప్రతిపాదించబడి, ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ, అకడమిక్ కౌన్సిల్, మరియు చివరగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే ఈ మార్పు జరిగింది. హిస్టరీ డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన 38 DSE పేపర్లలో కేవలం 16 మాత్రమే మూడవ సెమిస్టర్ సిలబస్‌లో ఉంచారు. ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్టుగా విద్యార్థులు మనల్ని దోచుకున్న వారి చరిత్రను చదవాల్సిన కర్మ ఇకపై పట్టదు.
ఏ దేశమైనా తన గతాన్ని, అందులోని వాస్తవాలను ఉన్నదున్నట్లుగా తెలుసుకున్నప్పుడే గర్వంగా ముందుకు సాగగలదు. మన దేశాన్ని దోచుకున్న, మన సంస్కృతిని నాశనం చేసిన ఆక్రమణదారుల చరిత్రను విద్యార్థులు గొప్పగా చదువుకునే దుస్థితి ఇకపై ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రక్షాళన జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం కేవలం ఒక సిలబస్ మార్పు మాత్రమే కాదు, ఇది భారతీయ నాగరికతా వైభవాన్ని పునరుద్ధరించే దిశగా, వలసవాద బానిసత్వపు ఆలోచనల నుండి రాబోయే తరాలకు విముక్తి కల్పించే దిశగా పడిన ఒక బలమైన అడుగు.


