పాశ్చాత్య విషం.. మన పైలట్‌పై విదేశీ కుట్ర!


శవాలపై పేలాలు ఏరుకునే నీచ సంస్కృతి వీరిది! ఖబర్దార్!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి ఇంకా ఏడాది కూడా తిరగలేదు. 250 మంది భారతీయుల కుటుంబాల కన్నీళ్లు ఇంకా ఆరలేదు. అప్పుడే, ఆ పుండు మీద కారం చల్లడానికి ఇటలీకి చెందిన ఓ చెత్త పత్రిక (Corriere della Sera) సిద్ధమైంది.

ఏం కూసింది ఆ పత్రిక? మన పైలట్, కెప్టెన్ సుమీత్ సభర్వాల్ “కావాలనే విమానాన్ని కూల్చేశాడు” అట! స్విచ్‌లు ఆఫేశాడట! సిగ్గుండాలి! ఒక భారతీయ పైలట్ ఆత్మగౌరవాన్ని, చనిపోయిన వ్యక్తి పరువును బజారుకీడ్చడానికి మీకు ఎంత ధైర్యం? ఇది కేవలం ఒక రిపోర్ట్ కాదు.. ఇది పాశ్చాత్య దేశాల “కార్పొరేట్ మాఫియా” ఆడుతున్న వికృత క్రీడ.

1. ఇది ముమ్మాటికీ “బోయింగ్”ను కాపాడే కుట్ర!

నిజం నగ్నంగా ఉంది, కాస్త కళ్లు తెరిచి చూడండి.
విమానం కూలింది సాంకేతిక లోపం (Technical Failure) వల్ల అని తేలితే.. ఆ విమాన తయారీ సంస్థ (Boeing వంటివి) ప్రపంచవ్యాప్తంగా పరువు కోల్పోతుంది. బిలియన్ల డాలర్లు నష్టపరిహారం కట్టాలి. వాళ్ళ షేర్లు కుప్పకూలుతాయి. అదే.. “పైలట్ పిచ్చోడు, ఆత్మహత్య చేసుకున్నాడు” అని ముద్ర వేస్తే? ఆ కంపెనీకి ఒక్క రూపాయి నష్టం ఉండదు! పైగా ఇన్సూరెన్స్ డబ్బులు మిగులుతాయి.

అందుకే.. చనిపోయిన మన పైలట్‌ను బలిపశువును  చేస్తున్నారు. చేతకాని మీ యంత్రాల తప్పును, మా దక్షుడైన పైలట్ మీద రుద్దుతారా?

2. తెల్లవాడి అహంకారం ఇంకా చావలేదు!

ఇదేం కొత్త కాదు. గతంలో బోయింగ్ 737 MAX విమానాలు కూలినప్పుడు కూడా, మొదట ఇండోనేషియా, ఇథియోపియా పైలట్లదే తప్పు అని మొరిగారు. “Third World Pilots” (పేద దేశాల పైలట్లు) కు విమానాలు నడపడం రాదని ఎగతాళి చేశారు.చివరకు ఏమైంది? అది పైలట్ల తప్పు కాదు, మీ కంపెనీ దాచిపెట్టిన సాఫ్ట్‌వేర్ లోపం అని తేలలేదా? అప్పుడు తోక ముడిచిన మీరు, ఇప్పుడు మళ్ళీ మా భారతీయ పైలట్‌పై బురద జల్లడానికి వస్తారా?

3. చనిపోయినవాడు వచ్చి సాక్ష్యం చెప్పలేడు కదా!

కెప్టెన్ సుమీత్ సభర్వాల్ దారిలో పోయే దానయ్య కాదు. ఆయన ఒక లెజెండ్. వేల గంటలు గాలిలో గడిపిన అనుభవజ్ఞుడు. ఆయనకు భార్య, బిడ్డలు ఉన్నారు. 250 మందిని చంపుకోవడానికి ఆయనేమైనా ఉగ్రవాదా?
ఆ స్విచ్‌లు ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల “ట్రిప్” (Trip) అయి ఉండకూడదా? సెన్సార్లు ఫెయిల్ అయి ఉండకూడదా? మీ చెత్త విమానాల్లో లోపాలు ఉండవని గ్యారెంటీ రాసిస్తారా?

4. మన మీడియాకి ఒక హెచ్చరిక!

దురదృష్టవశాత్తు, మన దేశంలోని కొంతమంది “మేధావులు” కూడా ఆ ఇటలీ పత్రిక రాతలను వేదవాక్కులా ప్రచారం చేస్తున్నారు.ఆపండి ఈ వెకిలి రాతలు! మనకు DGCA (Directorate General of Civil Aviation) ఉంది. మన దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. వాళ్లు చెప్పేదాకా, విదేశీ పత్రికల కాళ్ళ దగ్గర కూర్చుని వార్తలు రాయకండి. అది మన సార్వభౌమాధికారాన్ని  అవమానించడమే.

మా పైలట్ మాకు హీరోనే!

విమానంలో ఆఖరి క్షణం వరకు పోరాడి ప్రాణాలు విడిచిన కెప్టెన్ సుమీత్ మాకు హీరో. పాశ్చాత్య మీడియా ఎన్ని కట్టుకథలు అల్లినా, భారతీయులుగా మేము మా పైలట్‌కే అండగా ఉంటాం.

మీ కార్పొరేట్ రాజకీయాల కోసం, మా దేశపు బిడ్డను దోషిగా నిలబెడితే.. భారత్ చూస్తూ ఊరుకోదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *