పచ్చి నిజం చెప్పనా…❓❓
స్వయానా దేవాదాయా శాఖ కమీషనర్ పర్మిషన్ ఇచ్చాడు..#అన్నవరం లో #బ్రహ్మకుమారీస్ సభకు ఇంకా హిందూ దేవాలయాల పరిరక్షణ అంటూ గప్పాలు కొట్టుకోవడం వేస్ట్ పని..
కంచే చేను ను మేస్తున్నట్టు ..గత 20 ఏళ్లుగా జరుగుతున్న ఈ తంతు లో పెద్ద పాత్ర దేవాదాయశాఖ వారిది…
ఆపడానికి వెళ్లిన వారి నోట మాట రాలేదట..
మేము అక్కడికెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం మీరెవరు ఆపడానికి అని నిలదీసిన వీరికి అన్నవరందేవస్థానం కొండ మీద 300 ఏసీ గదులు రెండు పెద్దఎద్ద హాల్స్ ఉరికే ఎవరిస్తారు.. ఎలా ఇస్తారు..
పైసలు మోహన కొడితే దేవాదాయా లేదు ధర్మాదాయ లేదు…
బలహీనమైన ఈ వ్యవస్థ మూలంగానే అన్యమతం ఆక్రమం గా వ్యాపించింది.
వివరాల్లోకి వెళితే….
ఆగమశాస్త్ర నియమాలతో నిత్యం వేద పారాయణలతో వైదిక పూజా ప్రక్రియలతో ఆరాధించే సత్యన్నారాయణ స్వామి పుణ్యక్షేత్రమైన అన్నవరం కొండపై, హిందువులు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఏమాత్రం హిందూ ఆచార వ్యవహారాలతో సంబంధం లేని పాటించని అవైదిక వ్యవహారాలు అనసరించే బ్రహ్మకుమారీ సమాజం వారు సభలు నిర్వహించడానికి కొండపై పర్మిషన్ ఇచ్చారు.
అయితే ఇలా ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని తక్షణమే కాన్సిల్ చెయ్యాలి అని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు . హిందువుల యొక్క ధనం మరియు దేవాదాయ నిధులను దుర్వినియోగం అయ్యేలా వారికి ఉచితంగా స్థలం మరియు సగం అద్దెకు వసతిగృహాలు ఇవ్వడాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తు నిరసనలకు దిగారు.అయినా దేవస్థానం ఈవో స్పందించకపోవడం తో చలో అన్నవరం విశ్వ హైందవ పరిషత్ పిలుపు నిచ్చింది. దీనితో విషయం ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లింది వెంటనే స్పందించిన అధికారులు బ్రమ్మకుమారిస్ కార్యక్రమం ని నిలుపుదల చేశారు.
ఇక్కడి తో ఈ సమస్య ఆగినట్టే అనుకుంటే పొరపాటే.. ఇప్పుడే కాదు భవిష్యత్తు లో కూడా ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు విజ్ఞప్తి చేశారు .
దేవదాయశాఖ నియమ నిబంధనల ప్రకారం కొండపైకి గాని, ఆలయ ప్రాంగణంలోకి గాని అన్యమతస్థుల ఫొటోలు గాని, ప్రకటనలు గాని చేయరాదు. వారి వద్ద ఉన్న పుస్తకములలో వీటికి విరుద్ధముగా యేసు క్రీస్తు ఫోటో లు మజీద్ ఫోటోలు అన్యమత ప్రస్తావన బుక్స్ ఉన్నవిఅని
వీటి పై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.
ఈ రోజున అందరూ నిలదీసే సరికి సభ ఆపేశారు…
అడిగేవారు లేకపోతే పుణ్యక్షేత్రాల్లో సజావుగా జరిగిపోయే సభలను ఇలా సామాన్యులు ఆపుతూ పోవాల్సిందేనా…దేవాదాయ శాఖ కి ఏమి పట్టదా…❓
ఈ రోజున హిందుత్వం తన అస్తిత్వం కోల్పోవడం లో పెద్ద పాత్ర పోషిస్తుంది దేవాదాయ శాఖనే అని నేను అంటే….
మీరేమంటారు…❓❓
…