2020 ఢిల్లీ అల్లర్ల పార్ట్-2..! మరోసారి కేజ్రీవాల్, అభిజీత్‌ల భారీ కుట్ర బట్టబయలు !
సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరగనున్న నిరసన వెనుక ఉన్నది కేవలం ఆందోళన కాదు, అదొక పక్కా స్కెచ్‌తో కూడిన కుట్ర. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక ‘బ్రిక్స్’ (BRICS) సదస్సు జరగనుంది. ప్రపంచ అగ్రదేశాల అధినేతలు మన దేశానికి వస్తున్న తరుణంలో, దానికి సరిగ్గా వారం ముందు ఈ నిరసనకు పిలుపునివ్వడం వెనుక దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో మసకబార్చే భారీ అజెండా దాగి ఉందన్నది స్పష్టంగా అర్థమవుతున్న విషయం.
గతంలో పార్లమెంటు వైపు మార్చ్ చేసి దేశ రాజధానిలో అరాచకానికి, అస్థిరతకు యత్నించిన శక్తులే ఇప్పుడు మళ్లీ కొత్త ముసుగులో తెరపైకి వచ్చాయి. పేరుకు దాన్ని ఒక పార్టీ అని చెప్పుకుంటూ కపట నాటకాలు ఆడే ఈ ‘కాక్రోచ్’ లాంటి విచ్ఛిన్నకర శక్తుల అసలు లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారం ఏమాత్రం కాదు. దేశాభివృద్ధిని చూసి ఓర్వలేని ఈ దేశద్రోహ శక్తులు, అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని దోషిగా నిలబెట్టేందుకు, దేశ అంతర్గత భద్రతను సవాల్ చేసేందుకు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి.
ఈ కుట్రల టైమింగ్ చూస్తుంటే 2020 ఫిబ్రవరి నాటి సంఘటనలు గుర్తుకురాక మానవు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సరిగ్గా అదే సమయానికి, సీఏఏ (CAA) వ్యతిరేక ఆందోళనల ముసుగులో ఢిల్లీలో అల్లర్లు సృష్టించారు. ప్రపంచ మీడియా దృష్టి అంతా భారత్‌పై ఉన్నప్పుడు, పథకం ప్రకారం హింసను ప్రేరేపించి గ్లోబల్ మీడియాలో దేశంపై విషం చిమ్మారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సు నేపథ్యంలోనూ సరిగ్గా అదే పాత ‘టూల్‌కిట్’ (Toolkit) వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఆనాడు 2020 అల్లర్ల సమయంలో ఆప్ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరోక్షంగా అందించిన మద్దతు, వారి పాత్రను దేశం ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు సరిగ్గా అదే బాటలో ఆయన శిష్యుడు అభిజీత్ డిప్కే రంగంలోకి దిగి ఈ కొత్త టూల్‌కిట్ కుట్రను అమలు చేస్తున్నాడు. అప్పట్లో గురువు ఆడిన అరాచక నాటకాన్ని, ఇప్పుడు శిష్యుడు సెప్టెంబర్ 5 నిరసన పేరుతో యథాతథంగా దింపుతున్నాడు. పేర్లు మారినా, ముఖాలు మారినా.. దేశ ప్రతిష్టను దిగజార్చాలనే వీరి అసలు నైజం, విచ్ఛిన్నకర అజెండా మాత్రం ఏమాత్రం మారలేదనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.
భారతదేశం ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదుగుతుంటే, ఆ సానుకూల దృక్పథాన్ని దెబ్బతీయడమే ఈ శక్తుల ఏకైక పని. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్ సాధించబోయే దౌత్యపరమైన విజయాలను పక్కదారి పట్టించి, ‘భారత్‌లో అశాంతి ఉందనే’ తప్పుడు సంకేతాలను విదేశాలకు పంపడానికే ఈ సెప్టెంబర్ 5 ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. విదేశీ నెట్‌వర్క్‌ల కనుసన్నల్లో నడిచే ఈ ముఠాలకు దేశ గౌరవం కన్నా తమ స్వార్థ రాజకీయ అజెండానే ముఖ్యం.
ఇలాంటి దేశద్రోహ, అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైంది. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. దేశభక్తులు, సగటు పౌరులు ఈ టూల్‌కిట్ గ్యాంగుల అసలు రంగును గుర్తించి వారి కుట్రలను బలంగా తిప్పికొట్టాలి. అడ్డంకులను అధిగమించి ఈ బ్రిక్స్ సదస్సు విజయవంతం కావడం ద్వారానే.. ఈ విచ్ఛిన్నకర శక్తులకు, వారికి మద్దతు ఇస్తున్న వారికి సరైన గుణపాఠం చెప్పగలం.


