హిందూ పిల్లలతో బలవంతంగా ‘కల్మా’ చదివిస్తున్న ముస్లిం ఉపాధ్యాయులు!
స్కూల్స్ లో జరుగుతున్న ఈ కుట్రపై భగ్గుమంటున్న జనం!
పాఠశాలలు అంటే సరస్వతీ నిలయాలు. రేపటి పౌరులను తీర్చిదిద్దే నవ నిర్మాణ కేంద్రాలు. కానీ, తెలంగాణలోని కొన్ని విద్యాసంస్థల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే… ఇవి బడులా? లేక పసిమొగ్గల బ్రెయిన్ వాష్ చేసే మత మార్పిడి కేంద్రాలా? అనే భయంకరమైన సందేహం కలుగుతోంది. హిందూ విద్యార్థులే లక్ష్యంగా, విద్యాబోధన ముసుగులో జరుగుతున్న ఈ ‘ఎడ్యుకేషనల్ జిహాద్’ (Educational Jihad) ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
శాంతినికేతన్లో ‘ఖమేనీ’కి సంతాపం ఎందుకు?
నిన్న మొన్నటి వరకు పాతబస్తీ దూద్‌బౌలిలోని శాంతినికేతన్ స్కూల్ లో జరిగిన ఘటన విద్యావ్యవస్థకే తలవంపులు తెచ్చింది. ఇరాన్ మత ఛాందసవాద నేత ఖమేనీ మృతికి ఆ పాఠశాలలో సంతాప సభ నిర్వహించడం వెనుక ఉన్న కుట్ర ఏమిటి? భారతీయ సంస్కృతికి, మన విద్యావ్యవస్థకు, ఒక విదేశీ ఇస్లామిక్ నేతకు సంబంధం ఏమిటి? స్కూల్ పిల్లల లేత మనసుల్లో విదేశీ మత ఛాందసవాద బీజాలు నాటడానికే ఈ తంతు జరిగిందా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.

నిజామాబాద్‌లో భాషా రుద్దుడు…
ఆ ఘటన మరవక ముందే, నిజామాబాద్‌లో మరో కుట్ర వెలుగుచూసింది. అక్కడ హిందూ విద్యార్థులకు ఉర్దూ, అరబిక్ భాషలను పరోక్షంగా రుద్దుతున్నారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మాతృభాష తెలుగును, మన సంస్కృతికి ప్రతీకైన సంస్కృతాన్ని పక్కనపెట్టి… అరబిక్ ఎందుకు నేర్పుతున్నారు? ఇది కేవలం ఒక భాష పట్ల ప్రేమతో జరుగుతున్నది కాదు, హిందూ విద్యార్థులను వారి మూలాల నుంచి దూరం చేసే ఒక వ్యూహాత్మక అదృశ్య వల.

సక్సెస్ స్కూల్’ లో ‘కల్మా’ హోంవర్క్!
తాజాగా నేడు భాగ్యనగరంలోని సక్సెస్ స్కూల్ లో వెలుగుచూసిన ఘటన విద్యావ్యవస్థ ముసుగులో జరుగుతున్న దారుణాలకు పరాకాష్ట. హిందూ విద్యార్థులకు ఇస్లామిక్ ప్రార్థన అయిన ‘కల్మా’ చదవమని, దానిని ఇంటి దగ్గర హోంవర్క్‌గా రాసుకురమ్మని చెప్పడం ఏ రకమైన సెక్యులరిజం? విద్యాహక్కు చట్టం దీనికే పర్మిషన్ ఇస్తోందా? ఒక మతానికి చెందిన ఆచారాన్ని, ప్రార్థనను ఉద్దేశపూర్వకంగా వేరే మతానికి చెందిన విద్యార్థులపై రుద్దడం అంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక స్వేచ్ఛను ఉల్లంఘించడమే.

ఇది యాదృచ్ఛికం కాదు… పక్కా స్కెచ్!
ఇవన్నీ ఎక్కడో పొరపాటున జరిగిన విడివిడి ఘటనలు కావు. ఒక పద్ధతి ప్రకారం పసి పిల్లల బ్రెయిన్ వాష్ చేయడానికి జరుగుతున్న వ్యవస్థీకృత కుట్ర. హిందూ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని, వారిలో తమ మతం పట్ల న్యూనతా భావం పెంచి, పరాయి మత సిద్ధాంతాలను చిన్నప్పటి నుంచే నూరిపోసే ఈ ‘జిహాద్’ను అరికట్టకపోతే భవిష్యత్తు అంధకారమే.
విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా? లేక చూసీ చూడనట్లు వదిలేస్తున్నారా?
అసలు ప్రైవేట్ స్కూళ్లలో కరిక్యులమ్ ను మానిటర్ చేసే యంత్రాంగం ఉందా?
తల్లిదండ్రులారా.. మేల్కొనండి!
మీ పిల్లలు ఉదయం స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్లాక, అక్కడ ఏం నేర్చుకుంటున్నారో? వారి డైరీల్లో ఎలాంటి హోంవర్క్స్ ఇస్తున్నారో ప్రతిరోజూ చెక్ చేయండి. కేవలం ర్యాంకుల కోసం ఆరాటపడితే, రేపు మీ పిల్లలు తమ అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది.
వ్యవస్థలు స్పందించే దాకా ప్రశ్నిస్తూనే ఉందాం!


