సిలబస్ కు నోచుకోని అసలైన చరిత్ర: మొగలులను వణికించిన అస్సాం సింహం ‘లచిత్ బరాఫుకాన్’
మన చరిత్రలో గొప్పగా చెప్పుకోవాల్సిన కొన్ని విషయాల్ని పాఠశాలల్లో సిలబస్ గా చేర్చడానికి వెనకడుగు ఎక్కడ పడుతుంది….? మన చరిత్ర వీరుల్లోనా… పాలకుల ఆలోచనల్లోనా… ఇప్పుడు నేనో గొప్ప హీరోని పరిచయం చేయబోతున్నాను… సినిమాల ప్రభావం ఏమో హీరో అనగానే నటించే వాళ్లే గుర్తొస్తారు కానీ అఖండ భారతావనిని ఆక్రమించిన మొగలుల భారీ నుండి తన అతి చిన్న సామ్రాజ్యాన్ని 17 సార్లు కాపాడిన వీరుడిని హీరో అంటే ఎవ్వరూ accept చేయరు.. నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత మీరు ఒప్పుకున్నా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఒప్పుకుంటుందన్న నమ్మకం మాత్రం లేదు.మ్ ఈ పర్సన్ కి చరిత్రలో మంచి పేరున్నా … పుస్తకాల్లో మాత్రం ఎక్కడా పేరు లేదు… ఒక రాణా సంగ్రామ్ సింగ్ రాణా ప్రతాప్ సింగ్ ఛత్రపతి శివాజీ లు చరిత్రలో ఎంతటి వీరులో అంతటి గొప్ప యోదుడు ఇతడు.. కానీ చరిత్రలో ఎక్కడా ఆయన ప్రస్తావన ..

ఇక్కడ నాదో డౌట్…. ఏంటి ఏదో చెప్తుందనుకుంటే మమ్మల్నే డౌట్ లు అడుగుతోందేంటి ఈవిడ అని అనుకుంటున్నారా… ఇప్పటికి ప్రతీరోజు తట్టి లేపుతున్న నాదో సందేహం…..కాదు సమస్య… మనకు స్వాతంత్యం వచ్చిన తరువాత భారతదేశం లోని విద్య వ్యవస్థ లోని సిలబస్ ని నిర్ణయించింది ఎవరై ఉంటారా అని… ప్రధానం గా ఈ ఈ అంశాలు పాఠ్యఅంశాలుగా ఉంచాలని డిసైడ్ చేసింది ఎవ్వరా అని… స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైనే అవుతున్నా ఎన్నో రంగాల్లో ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేస్తూ ఇదిగో ఇదీ అభివృద్ధి ఇదీ ఎదుగుదల అని చెప్పుకోస్తున్న పిల్లల పాఠ్యఅంశాల్లో మార్పులు ఇంకా ఎందుకు తీసుకుని రావడం లేదు అనేదే నా డౌట్.. అప్పటికే మొగలులు వెళ్ళిపోయి వందల ఏళ్ల అవుతున్నా…. అప్పుడప్పుడే ఆంగ్లేయులు కూడా తట్టబుట్టా సర్దుకుని పలాయనం చిత్తగిస్తున్నా… ఈ దేశాన్ని విధ్వంసం చేసీ …హిందువులను ఊచకోత కోసీ బలవంతం గా మతమార్పిడి చేసి…హిందూ మహిళలను బలాత్కారం చేసిన మొగలులకు వారి పాలనకు ఇంకా దాసోహం చేస్తుంది ఎవరా అన్నదే ఇప్పటికీ నా మనసుని…..కాదు కాదు ప్రతీ హిందువు మనసుని కలిచి వేస్తున్న ధర్మసందేహం…
ఇంకోసారి అనిపిస్తుంది… అసలు మొగలులతో యుద్ధం చేసి ఓడించిన మన ధర్మవీరుల పట్ల వీరికి ఎందుకంత చులకన …. చులకనభావమా లేక భయమా…? చరిత్రలోని చరిత్ర ఒక్కో పేజీ తిరేగేస్తుంటే వణుకు పుట్టిందా లేక తడిచిపోయిందా.. విషయం ఏదైనా సిలబస్ లో ఎక్కడా వారి ఆనవాళ్లు కూడా కనపడకుండా నేర్పుని ప్రదర్శించారు…. విద్యార్థులకు నరనరాల్లో దేశభక్తి ఎక్కడ ఇంకిపోతుందేమో అని ఎంతో జాగ్రత్త పడ్డారనిపిస్తుంది అప్పటి నాయకులు…. కాదంటారా…..? అయితే చెప్పండి పోరాడి గెలిచిన మన వీరుల గాధలేవి ….? వీర మరణం పొందిన యోధుల చరిత్ర ఏది …? పచ్చిగా మాట్లాడుకోవలంటే ఇప్పుడు ఈ ఇరవైయ్యవ దశకం లో యూట్యూబ్ లు వెబ్ సైట్ లు వచ్చాకే వీరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి తప్పితే అంతకు ముందు ఎవరికి ఎక్కడ వినిపించిన దాఖల్లాలేమైన ఉన్నాయా…? సిస్టమ్ ని తప్పు బట్టడం లేదు.. ఆ మాటకొస్తే నేర్పించే గురువుల్ని కూడా కాదు…ఎటొచ్చి చేర్చిన పాఠ్యఅంశాలను మాత్రమే….
ఎడ్యుకేషన్ కమిటీ ఎంత మందితో ఏర్పడింది…ఎవరెవరిని తీసుకున్నారు…? ఇప్పుడు మీరు వెంటనే తడబడకుండా ఎక్కడా తడుముకోకుండా కొంత మంది లిస్ట్ చెప్తారని నాకు తెలుసు… మరి వీరంతా నిర్ణయాన్న్ని అమలు చేసే వారా.. లేక నిర్ణయాలు జారీ చేసేవారా అని నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను…అప్పుడు మీ దగ్గర సమాధానం ఉంటుందా ….ఉంటే ఏమై ఉంటుందో నేను ఉహించగలను.. ఇక్కడ ఎవ్వరి మీద ఎమ్ కోపం లేదు.. ఎటొచ్చి ఇపుడు పిల్లల్లో దేశ భక్తి ఎందుకు లేదు అన్నదే దేశ సమస్యగా చూస్తున్నాను అంతే… సరే ఇప్పటికీ మారని అప్పటి పరిస్థితులని పక్కకి పెట్టి ఇప్పుడు ఆ యోధుడిని పరిచయం చేయలనుకుంటున్నాను.. పూర్తిగా విని మీరే ఆలోచించండి…ఎందుకు ఇతడు చరిత్రలో భాగం కాలేకపోయాడా అని…. My dear సీనియర్ సిటిజన్స్ అండ్ యంగ్ స్టూడెంట్స్… మొగలుల చరిత్ర చదివి చదివీ అక్బర్ బాబర్ ఔరంగా జేబుని కంఠత గుర్తు పెట్టుకున్నాం గా మనం…ఇగ ఇప్పుడు అదే ఔరంగా జేబుతోనే మొదలు పెడదాం.. ఎందుకంటే గుడ్డిగా గుర్తుండి పోయిన పేరుని గట్టిగా తుడిచెయ్యాల్సిన బాధ్యత కూడా మనదే…

అఖండ భారత దేశం మొగలుల సామ్రాజ్యమ్ లో భాగమై చివరి మొగల్ చక్రవర్తి గా పేరు గాంచిన ఔరంగా జేబు పరిపాలన కాలం లో అస్సం లోని బ్రహ్మపుత్ర నదీ తీరాన ఉన్న సరై ఘాట్ వద్ద జరిగిన 1671 యుద్ధం తో లాషిత్ భారా పుకాన్ అనే ఓ అసాధారణ సైన్యాధ్యక్షుడు ట్రయిబల్ యొక్క శక్తి ఏంటి…నార్త్ eastern పాలకుల యొక్క శక్తి సామర్ధ్యాలు ఏంటి అని మొగల్ సామ్రాజ్యానికి పరిచయం చేసిన ఒక గొప్ప యోధుడు. వాస్తవంగా భారత దేశం మొత్తం ఆక్రమణకు గురైన తర్వాత ప్రధానంగా ఈశాన్య ప్రాంతంవైపు ఔరంగా జేబు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.. బెంగాల్ లో ఉన్న మీర్ జుమ్లా ని ఆదేశిస్తూ బెంగాల్ అనంతరం మనం అసోంని.. ముఖ్యమ్ గా మనం గౌహతి ని అదీనం లోకి తీసుకుని పూర్తిగా ఈశాన్య భారతాన్ని మొత్తమ్ ఆధీనంలోకి తెచ్చుకుందాం అనుకున్నాడు..దీనితో మీర్ జుమ్లా గౌహతి పైన దండ యాత్రకు ఆదేశాలు తెచ్చుకున్నాడు. ఆనాడు అస్సాం ను పాలిస్తున్న పాలకులు రాజవంశీయులు అహోమ్ రాజ వంశీయులు.. అహోమ్ రాజవంశానికి చెందిన చక్ర ధవాజ్ సింగ పాలకుడిగా ఉన్నప్పుడు..ఈ మీర్ జుమ్లా తో ఒప్పందం చేసుకుని గౌహతి ప్రాతం లో కొంత మేరకు మొగలులకు చిక్కించుకున్నారు…
కానీ దీనితో సంతృప్తి చెందని ఔరంగజేబు తన ఆస్థానం నుండి ఆదేశాలను జారీ చేస్తూ చక్ర దివాజ్ సింగ గారి అంటే అహోమ్ రాజు మన యుక్క సార్వభౌమధికారాన్ని అంగీకరించడమే కాకుండా చెంల్లించాల్సిన పన్నులన్నీ చెల్లించాలని కోరడం చేత.. స్వాభిమానం సహజ సిద్ధంగా కలిగి ఉన్న అహోమ్ పాలకులు దానిని తిరస్కరించి యుద్ధానికి సిద్ధమయ్యారు.. ఆ క్రమం లో అహోమ్ సైన్యానికి అధ్యక్షుడి గా ఉన్న లషిత్ భారా పుకాన్ …ఈ భారా పూకాన్ అనేది ఒక టైటిల్ కమాండ్రిన్ చీఫ్ కి ఇచ్చే బిరుదు లాంటిది అంటారు…అతడు ఒక పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసి మొగలుల్ని తిప్పికొట్టాడు.. … మనం ఒకసారి కనక పరిశీలిస్తే మొగల్ సామ్రాజ్యనికి నాయకత్వం వహించిన వాడు ఆనాడు అంబార్ రాజా పుత్రుడు రాంసింగ్ ఆయనకు సహాయం గా ఉన్న రషీద్ ఖాన్.. అదే విధంగా మొగల్ సైన్యం సంఖ్య చూస్తే పదాతి దళం 30 వేలు గ్యావత్రీ18 వేలు అర్చరీ 15 వేలు 40 షిప్ ప్లీడ్స్.. అంటే అన్ని వేలల్లో సమకూర్చుకుని యుద్ధానికి మోహరిస్తే కొంత కాలం వరకు తన తెలివి తేటలు టాకిటిక్స్ తో ఈ లాషిత్ వారిని తిప్పి కొడుతూ వస్తు.. ఇంకో పక్కన ప్రాకారాలను పటిష్టం చేస్తూ వచ్చి తర్వాత మొగలాయుల మీద యుద్ధం ప్రకటించారు..

అది 1671 లో … ఇంత గొప్ప మొగల్ సైన్యాన్ని కలిగి ఉండి గొప్ప సైనిక యోధుడిగా పేరు గాంచిన రాంసింగ్ తో సహా అందరిని ఓడించాడు. మొగలులు అన్ని రాజ్యాల మీద దండెత్తి ఆక్రమిస్తూ చాలా చిన్న రాజ్యం అయిన అహోమ్ రాజరిక వ్యవస్థ మీద కన్ను వేసి ఏకంగా 17 సార్లు దండెత్తారంటే మాములు విషయం కాదు….. అడే విధంగా 17 సార్లు ఓటమిపాలయ్యారు అన్నది చరిత్రలో నిలిచిపోయిన విషయం.. అలా వీరిని ఓడించి వెనుదిరిగేలా చేసిన ఘనుడు లషిత్ భారా పుకాన్.. చరిత్ర పరిశీలిస్తే ఈయన మోటో ఒక్కటే కనిపిస్తోంది నేషన్ ఫస్ట్ ఫామిలీ నెక్స్ట్… ఔరంగజేబు లాంటి యొక్క శక్తివంతమైన సైన్యానికి వ్యతిరేకంగా అస్సామీ దళాలకు లశిత్ బరా పుకాన్ నాయకత్వం వహించి విపరీతమైన అసమానతలను ఎదుర్కొన్నప్పటికీ, తన యొక్క వ్యూహాత్మక మేధావి తనం మరియు అచంచలమైన సంకల్పం అస్సాంను స్వాధీనం చేసుకునేందుకు ఔరంగజేబు చేసిన ప్రయత్నాలను అడ్డుకోవడంతో నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది.
నవంబర్ 15 న జన జాతీయ గౌరవ దినోత్సవం లో భాగంగా బిర్సా ముండా జన్మదినాన్ని ఎలా జరుపుకుంటున్నామో అలాగే ఇలాంటి వీరులకు కూడా ఒక రోజులో చోటిస్తే రేపటి తరానికి మరిచిపోయిన అసలైన భారత దేశ చరిత్రని…చరిత్రగా అందించిన వారమవుతాము… నేషన్ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్స్ట్ : లచిత్ భారా పుకాన్ చరిత్రలో స్థానం దక్కని యోధుడు అతడు చరిత్ర గుర్తిస్తే దేశం గుర్తిస్తే అతడు మరోసారి ఇంకోసారి మనకొక ప్రాతః స్మరణీయుడు అవుతాడు ప్రపంచాన్ని ఏలే శక్తి మన వీరులకు ఉంది అన్నది మన పిడికిట దాగిన చైతన్యమే చెబుతున్నది అందుకు ఈ వీరుడి గాధ ఓ తార్కాణం. స్మరణీయం. అచంచల విశ్వాసంతో మన ధీరుల కథ ను మరోసారి మననం చేసుకుంటే .. దేశానికో ప్రగతి.. .. నేషన్ ఫస్ట్.. జాతీయతకు సమగ్రతకు ఇదే ఆనవాలు.. ఆరభం కూడా.. ఫ్యామిలీ నెక్స్ట్ .. అవును ! దేశం తరువాత ఏదయినా మట్టి మాట్లాడుతున్నది చరిత్ర పుటలు మాట్లాడుతున్నవి పాఠ్య పుస్తకాలు కూడా ! మాట్లాడాల్సిన రోజు దగ్గర్లోనే ఉంది..ప్రభుత్వాలు కల్పించుకుని అసలు చరిత్రకారుల్ని వెలికితీస్తే …! ఆ రోజు దగ్గర్లోనే ఉందని ఆశిద్దాం. సమీప భవిష్యత్తులో వీరుల గాధలు పాఠ్యాంశాలు అవుతాయి. భారతీయ చైతన్యం మరింత పెల్లుబిగే రోజు రావాలని ఆశిద్దాం… రెపటి విద్యార్థులంతా పాఠ్య పుస్తకాలు తీరగేస్తూ సగర్వంగా చెప్పుకోవాలి మేరా భారత్ మహాన్ అని



