కేజ్రీవాల్ ప్యాటర్న్ కాపీ: అభిజీత్ దిప్కే, నేహా బోరాలపై ‘ఇంక్’ దాడుల వెనుక అసలు కుట్ర ఇదే!
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల ముసుగులో జరుగుతున్న ‘ఇంక్’ దాడులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. JNU స్కాలర్ నేహా బోరా, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేలపై కేవలం కొద్ది రోజుల వ్యవధిలో జరిగిన వరుస దాడులను నిశితంగా గమనిస్తే.. ఇదంతా కేవలం సానుభూతి కోసం పన్నిన ఒక వ్యూహాత్మక డ్రామా అని విమర్శకులు భావిస్తున్నారు. ఉమర్ ఖలీద్ లాంటి వారిపై దేశద్రోహ ఆరోపణలు ఉన్నప్పటికీ, అతనికి మద్దతు తెలిపే నేహా బోరా లాంటి వారు ఆడుతున్న ఈ నాటకాల వెనుక స్పష్టమైన రాజకీయ కోణం దాగి ఉంది.
జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడానికి వీరు ఈ పాత పద్ధతులను ఎంచుకున్నారు. నేహా బోరా లాంటి వారు ఝార్ఖండ్ వెళ్లి నిరసనలు చేస్తే ఆ కార్యక్రమం చాలా పేలవంగా ఉంటుంది, పైగా ఆమె అక్కడికి వెళ్లి మళ్ళీ ‘విషం చిమ్ముతుందేమో’ అని జనాలు భావించే అవకాశం ఉంది. అందుకే అందరి దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి వీరు పాత ప్యాటర్న్‌ను ఎంచుకున్నారు. దీని గుట్టు విప్పుతూ విశ్లేషకులు ఇలా అంటున్నారు:
“ఈ ఒకటే ప్యాటర్న్ లో అరవింద్ కేజ్రీవాల్ కి క్లిక్ అయినట్టుగా దాన్నే మళ్లీ అభిజీత్ దిప్కేదగ్గర కూడా క్లిక్ చేశారు. అలా క్లిక్ చేయడం వెనుక వ్యూహం ఏంటంటే.. అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేయడం, మీడియా ఫోకస్ తన మీద పడేలా చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం.”
ఈ దాడుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులపై నిందలు వేయడమే. దాడి జరగగానే చూస్తున్న జనాలందరి దృష్టి ఒక్కసారిగా ఆకర్షించబడుతుంది. “ఎవరు దాడి చేశారు?” అనే ప్రశ్న రాగానే, ఆటోమేటిక్ గా జనాల ఆలోచనలు బీజేపీకి వ్యతిరేకంగా మారాలి, ఆ నిందలన్నీ వారిపైనే పడేలా చేసి సింపతీ కొట్టేయాలన్నదే ఈ డ్రామా వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. ఢిల్లీలో ఒక మహిళ ద్వారా, ఝార్ఖండ్‌లో ఒక పురుషుడి ద్వారా ఇంక్ పోయించి ఈ నాటకాన్ని సోషల్ మీడియాలో రక్తికట్టించారు.
అయితే, ఈ సానుభూతి వ్యూహంలో ఉన్న లొసుగులను జనాలు ఈజీగా పసిగట్టేస్తున్నారు. నిజంగా నేహా బోరాను, ఆమె మద్దతును తీవ్రంగా వ్యతిరేకించేవాళ్లు అక్కడ ఉంటే, వారి ప్రతిఘటన వేరే స్థాయిలో ఉంటుంది. ఈ ఇంక్ డ్రామాపై వస్తున్న ప్రధాన విమర్శను గమనిస్తే:
“నిజంగా అక్కడ ఆమెను వ్యతిరేకించే వాళ్ళు అయితే చెప్పుతో కొడతారు. మంచినీళ్లైనా పోస్తారు. కానీ ఒకటే ప్యాటర్న్‌లో ఇంక్ మాత్రమే ఎందుకు ఎంచుకుంటారు? ఆ ఇంకు పోసిన వాళ్ళందరూ వీళ్ళకు సంబంధించిన క్యాండిడేట్లే అనేది అందరికీ తెలిసిన విషయం.”
ఈ దాడి వెనుక ఉన్న అసలు గుట్టు ఆ దాడి జరిగిన టైమింగ్‌లోనే స్పష్టంగా తెలిసిపోతోంది. నేహా బోరా అక్కడికి వెళ్లి రెండు, మూడు రోజులు ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ఎప్పుడో కాకుండా, కచ్చితంగా మీడియా ఫోకస్ ఉన్న సమయంలోనే పక్కా స్కెచ్‌తో ఈ దాడి జరిగింది. కొత్తగా తన మీద ఎటాక్ జరగాలి, మీడియా ఫోకస్ తన మీదే ఉండాలి, సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరగాలి అని ప్లాన్ చేసుకున్న వ్యూహమిది. కానీ, మీడియా అటెన్షన్ కోసం వారు ఎంచుకున్న ఈ పేలవమైన ప్యాటర్న్‌ను ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు.


