రాత్రికి రాత్రే దేశం చేజారితే..? భారతీయులు తెలుసుకోవాల్సిన స్పెయిన్ ‘స్యూటా’ వాస్తవాలు!
భారత్ లో బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ఉన్న కలకత్తా నగరంలో కి కొన్ని వేల మంది అకస్మాత్తుగా ప్రవేశించి నగరాన్ని స్వాధీనం లోకి తీసుకుని సామాన్యుల ఇళ్ళల్లోకి దౌర్జన్యం గా ప్రవేశిస్తే ఆ సామాన్యుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి?
స్పెయిన్కు చెందిన ఉత్తర ఆఫ్రికా ఎన్క్లేవ్ స్యూటా (Ceuta)లో
కొన్ని గంటల్లోనే వేలాది మంది మొరాకో నుంచి సముద్రం దాటి, ఫెన్స్లు ఎక్కి, గేట్లు బద్దలు కొట్టి స్యూటాలోకి ప్రవేశించారు. సరిహద్దు పూర్తిగా కూలిపోయింది.
స్పానిష్ సివిల్ గార్డ్ అధికారులు ‘భయంకరమైన అరాచక పరిస్థితులు’ ఉన్నాయని చెప్పారు. సైన్యం, అదనపు పోలీసు బలగాలు పంపాల్సి వచ్చింది. అయినా మొదటి రోజు రాత్రి నగరం పూర్తిగా అల్లకల్లోలంలో మునిగిపోయింది.
స్యూటా టౌన్ జనాభా సుమారు 83,000. ఒకే రోజులో దాని సగం లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా ప్రవేశించడం అంటే నగరం యొక్క ప్రాథమిక సేవలు, భద్రత, సామాజిక సమతుల్యత పూర్తిగా కూలిపోయాయి.
వేలాది మంది అక్రమ వలస దారులు ముఖ్యంగా మంచి వయస్సు లో ఉన్న యువకులు వీధుల్లో, పార్కుల్లో, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వారు తమ ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశ ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు వీడియోలు, రిపోర్టులు పంచుకుంటున్నారు.
ఈ వేల మంది అక్రమ వలసదారులు షాపులు దోచుకుంటారనే భయంతో ముందుగానే షాపులు మూసేశారు. స్థానికులు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. స్థానిక ప్రజల రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
ఇది కేవలం “మానవీయ సంక్షోభం” కాదు — ఇది సార్వభౌమత్వం, చట్టపాలన, పౌరుల భద్రతపై ప్రత్యక్ష దాడి.
ఎందుకు ఇలా జరుగుతోంది?
నియంత్రణ లేని ఉదార వలస విధానాలు. స్పెయిన్లో ఇటీవల జరిగిన పెద్ద అమ్నెస్టీ ప్రోగ్రామ్ అంటే అక్రమంగా వచ్చిన వారిని క్షమించి అక్కడే ఉండేటట్లుగా అనుమతించడం మరియు, సముద్రం ద్వారా అక్రమంగా వచ్చిన వారిని తక్షణం తిప్పి పంపకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు, బలహీన సరిహద్దు నిర్వహణ — ఇవన్నీ …
“దేశంలో లోకి ఏదోలాగా ఒక్కసారి ప్రవేశిస్తే తర్వాత క్షమాభిక్ష దొరికి అక్కడే శాశ్వతంగా ఉండిపోవచ్చు(అమ్నెస్టీ) వస్తుంది” అనే భావనను కలిగించాయి.
ఫలితం? వేల మంది సముద్ర మార్గం గూండా దౌర్జన్యం గా సరిహద్దు దాటి ప్రవేశించడం తో స్థానిక ప్రజలు తమ ఇళ్లలో ఉండటం కూడా అసురక్షితంగా భావిస్తున్నారు.
సార్వభౌమ దేశం అంటే తన సరిహద్దులను నియంత్రించుకునే హక్కు. ఆ హక్కు కోల్పోతే, దేశం లోపల నివసించే పౌరుల భద్రత, సంస్కృతి, వనరులు, సామాజిక సమతుల్యత — అన్నీ ప్రమాదంలో పడతాయి. స్యూటా ఘటన ఇది కేవలం “సిద్ధాంతం” కాదని, ప్రత్యక్ష అనుభవం అని చూపించింది.
స్యూటా ఘటన ఒక హెచ్చరిక. దేశాలు తమ సరిహద్దులను గట్టిగా నియంత్రించుకోవాలి. లేకపోతే, స్యూటాలో చూసినట్లు, శాంతిగా జీవిస్తున్న పౌరులు తమ ఇళ్లనే అసురక్షితంగా భావించాల్సి వస్తుంది.
ఇది ఎక్కడో జరిగింది అని అనుకోకండి.
ఇది మన గుమ్మం ముందే సంవత్సరాలు గా ఉంది.
సరిహద్దులు లేని దేశాలు ఉండాలనే వామపక్ష
ఉదారవాద భావజాలం నిజంగా ఆచరణలోకి వస్తే
ఆయా దేశాల్లో ఉండే స్థానిక ప్రజల బతుకులు
రాత్రి కి రాత్రి ఎలా ఛిద్రమౌతాయో పై సంఘటనలు
కళ్ళ ఎదురుగా ఉన్నాయి.
చిన్న చీమ కూడా లోనికి ప్రవేశించలేని విధంగా
తమ స్వంత ఇళ్లకు 12 అడుగుల ప్రహారీ గోడలు కట్టుకుని,
24/7 హై లెవెల్ రక్షణ వ్యవస్థ ఏర్పాట్లు చేసుకుని బతికే
వామపక్ష భావజాల పెట్టుబడి దారులు అయిన
జార్జ్ సోరోస్ వంటి వాళ్ళు ఇటువంటి అక్రమ వలసలు
జరగాలని కోరుకుంటున్నారు. దాని కోసం భారీగా
నిధులు ఖర్చు చేస్తూ, అన్ని వ్యవస్థ లలో ఉన్న తమ
భావజాల వ్యక్తులు ద్వారా అన్ని దేశాల్లో అక్రమ వలసల సమస్యలు సృష్టిస్తున్నారు.
అక్రమ బంగ్లాదేశీయులను భారత్ లోనే ఉండనివ్వాలి అనే ఉదార వాదుల మాటలు విశ్వసిస్తే భవిష్యత్ లో భారత్ పౌరులకు కూడా ‘స్యూటా’ పౌరుల పరిస్థితి ఏర్పడవచ్చు.
తస్మాత్ జాగ్రత్త…
…..చాడా శాస్త్రి….


