ప్రజాస్వామ్యంపై దాడి! యూట్యూబర్లు, విలేకరులను టార్గెట్ చేస్తున్న బొద్దింకల పార్టీ!
జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న “బొద్దింకల పార్టీ” (Cockroach Janata Party) చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. భావప్రకటనా స్వేచ్ఛ గురించి మొసలి కన్నీరు కార్చే ఈ అర్బన్ నక్సల్స్ ముఠా, వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న మీడియాను చూసి వణికిపోతోంది. దేశ అభివృద్ధికి, జాతీయవాదానికి అండగా నిలుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే, అరాచక శక్తులతో చేతులు కలిపి క్షేత్రస్థాయిలో పనిచేసే యూట్యూబర్లు, మీడియా విలేకరులపై వీరు దాడులకు తెగబడుతున్నారు. నిరసనల ముసుగులో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను, కెమెరామెన్లను టార్గెట్ చేయడం వీరి పిరికితనానికి, ఫాసిస్ట్ మనస్తత్వానికి నిదర్శనం.
ఇక జర్నలిస్టులను విమర్శించే నైతిక హక్కు ఈ అరాచకవాదులకు ఏమాత్రం లేదు. మీరు గుర్తుంచుకోవాల్సిన వాస్తవం ఏమిటంటే.. మీ కుట్రలను బట్టబయలు చేస్తున్నది వేలాది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లు మీ అసలు రంగును సమాజం ముందు ఎండగడుతున్నారు! జర్నలిస్టులు ఎటువంటి తప్పు చేయలేదు; దేశవిచ్ఛిన్నకర శక్తులను, అర్బన్ నక్సల్స్ తో చేతులు కలిపిన మీ చీకటి ఒప్పందాలను నిర్భయంగా ప్రశ్నించడమే జర్నలిస్టులు చేసిన పని. విదేశీ ఎజెండాతో దేశంలో అశాంతిని సృష్టించాలనుకునే మీ ఆటలు సాగనివ్వకుండా వేలాది గొంతులు మిమ్మల్ని నిలదీస్తుంటే, ఆ భయంతోనే కక్షకట్టి వారిని టార్గెట్ చేస్తున్నారు. జాతీయవాదాన్ని వినిపించే జర్నలిస్టులను “గోదీ మీడియా” అని ముద్రవేసి, దేశ వ్యతిరేక శక్తులకు వత్తాసు పలికే వారిని సమర్థించుకోవడం ఈ బొద్దింకల పార్టీ కుటిల బుద్ధికి అద్దం పడుతోంది.

దేశంలో నిజమైన మీడియా ఎంతో స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా పనిచేస్తోంది. ఉద్యమకారుల ముసుగులో ఉన్న అర్బన్ నక్సల్స్ తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి హింసాత్మక మార్గాలను ఎంచుకుంటున్నారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఫీల్డ్‌లో ప్రాణాలకు తెగించి నిజాయితీగా పనిచేసే విలేకరులకు, డిజిటల్ యూట్యూబ్ జర్నలిస్టులకు యావత్ దేశంతో పాటు, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసే బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. బొద్దింకల పార్టీ నాయకులు, వారి వెనుకున్న ఆ అదృశ్య శక్తులు వెంటనే జర్నలిస్టులపై దాడులు ఆపాలి. లేకపోతే ఈ దేశ ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు.


