Spirituality Archives - Journalist Sirisha

పూరీ జగన్నాథుని అద్భుత లీల: రథయాత్రకు ముందు స్వామివారు ఎందుకు అనారోగ్యానికి గురవుతారో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర గురించి మనం ఎన్నో అద్భుతాలు వింటుంటాం. కానీ రథయాత్రకు ముందు జరిగే ఒక వింతైన ఘట్టం గురించి తెలిస్తే మాత్రం ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సకల చరాచర సృష్టిని కాపాడే ఆ భగవంతుడు అనారోగ్యం బారిన పడటం, ఆయనకు మందులు ఇచ్చి విశ్రాంతి కల్పించడం పూరీ ఆలయంలో మాత్రమే కనిపించే ఒక అపురూపమైన దృశ్యం. దేవుడికి జబ్బు చేయడం ఏమిటి అనే సందేహం రావచ్చు, కానీ ఇక్కడే పూరీ జగన్నాథుని తత్వంలోని అసలైన అందం దాగి ఉంది. పూరీలో జగన్నాథుడిని కేవలం దూరంగా ఉండి కోరికలు తీర్చే దేవుడిలా కాకుండా, మన ఇంట్లో ఒక ఆత్మీయ కుటుంబ సభ్యుడిలా భావిస్తారు. ఆయన నిద్రలేస్తాడు, స్నానం చేస్తాడు, భోజనం చేస్తాడు, అనారోగ్యానికి గురవుతాడు, మళ్లీ కోలుకుంటాడు కూడా.

ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారికి ఎంతో వైభవంగా ‘స్నాన యాత్ర’ నిర్వహిస్తారు. ఆలయం ఉత్తర ద్వారం వద్ద ఉన్న ‘సునా కూవా’ అనబడే బంగారు బావి నుండి 108 కుండల పవిత్ర జలాలను తోడి, గర్భగుడి వెలుపల స్నాన మండపంలో స్వామివారికి మహోన్నతమైన అభిషేకం చేస్తారు. ఆ తర్వాత స్వామివారిని గజ వేషంలో (ఏనుగు రూపంలో) అలంకరిస్తారు. అయితే, ఇంతటి భారీ స్నానం తర్వాత స్వామివారికి జ్వరం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆయనకు 15 రోజుల పాటు విశ్రాంతి కల్పిస్తారు. ఈ కాలాన్ని ‘అణసర’ అంటారు. మన ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే ఇల్లంతా ఎలా నిశ్శబ్దంగా మారుతుందో, ఎప్పటికప్పుడు వాళ్ళు తిన్నారా లేదా అని మనం ఎలా ఆప్యాయంగా చూసుకుంటామో, అదే విధంగా దేవుడికి కూడా ఇక్కడ సేవకులు అత్యంత ప్రేమతో సపర్యలు చేస్తారు. ఈ సమయంలో గర్భగుడి తలుపులు మూసివేస్తారు, గంటల మోతలు వినిపించవు. స్వామివారు కనిపించని ఈ 15 రోజుల్లో భక్తుల విరహం అంతా ఇంతా కాదు. ఆ వెలితిని తీర్చుకోవడానికి పూరీకి సమీపంలో ఉన్న బ్రహ్మగిరిలోని ‘అలర్‌నాథ్’ ఆలయానికి భక్తులు ప్రత్యామ్నాయ దర్శనం కోసం పోటెత్తుతారు. దేవుడికే అనారోగ్యం చేస్తే భక్తులు ఆయన కోలుకునే వరకు ఓపికగా ఎదురుచూడటం పూరీలో మాత్రమే కనిపిస్తుంది.

ఆ 15 రోజుల విశ్రాంతి తర్వాత స్వామివారు పూర్తిగా కోలుకుని, నూతనోత్సాహంతో మళ్లీ భక్తులకు దర్శనమిస్తారు. దీనినే ‘నవయౌవన దర్శనం’ లేదా ‘నేత్రోత్సవం’ అంటారు. ఆ తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి రథాలపై కొలువై వీధుల్లోకి వస్తారు. గుడిలోకి ప్రవేశించలేని సామాన్యుల కోసం, తనను చూడటానికి రాలేని వారి కోసం దేవుడే స్వయంగా వీధుల్లోకి వచ్చి దర్శనమిచ్చే అద్భుతమైన ఘట్టమే ఈ మహా రథయాత్ర. ఈ సమయంలో వీధే గర్భగుడి అవుతుంది, రథమే కదిలే దేవాలయమవుతుంది. ఇక జగన్నాథుని రూపం చూస్తే చేతులు, పాదాలు స్పష్టంగా ఉండవు, కళ్లు గుండ్రంగా రెప్పవాల్చకుండా ఉంటాయి. దీనివెనుక ఒక గొప్ప ఆంతర్యం ఉంది. దేవుడికి చేతులు లేవు కనుక భక్తులే ఆయన చేతులై ఆ రథాన్ని లాగుతారు, దేవుడికి పాదాలు లేవు కనుక భక్తులే ఆయన పాదాలై ఆయనను ముందుకు నడిపిస్తారు. దేవుడు మనుషులను మోయడం కాదు, మనుషులే దేవుడిని మోసే అద్భుతం ఇది. భగవంతుడు తన సేవలో మానవుల భాగస్వామ్యానికి ఇంతగా పెద్దపీట వేసిన రూపం బహుశా మరొకటి లేదు.

పూరీ ఆలయంలోని వంటగదిని ‘రోషఘర’ అంటారు. ఇక్కడ మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి అత్యంత సంప్రదాయబద్ధంగా వంట చేస్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అది ‘మహాప్రసాదం’గా మారుతుంది. దేవుడు స్వయంగా తిని, తన కుటుంబమైన భక్తులందరికీ ఆ ఆహారాన్ని పంచుతున్నాడనే గొప్ప భావన ఇక్కడ కనిపిస్తుంది. భోజనం దేవుడికి, భక్తుడికి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే, భారతదేశంలోని చాలా ఆలయాల్లో దేవుని మూర్తులు రాయి లేదా లోహంతో ఉంటాయి. కానీ జగన్నాథుని మూర్తులు చెక్కతో (దారువుతో) తయారు చేస్తారు. చెక్క కాలక్రమేణా మార్పు చెందుతుంది కాబట్టి, ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి (అధిక మాసం వచ్చినప్పుడు) స్వామివారి మూర్తులను కొత్తగా తయారు చేస్తారు. దీనినే ‘నవకళేబరం’ అంటారు. ఆ సమయంలో పాత మూర్తిలో ఉన్న ‘బ్రహ్మ పదార్థం’ అనే అదృశ్యమైన దైవిక శక్తిని తీసి కొత్త మూర్తిలోకి మారుస్తారు. దేహం నశ్వరమైనది, ఆత్మ శాశ్వతమైనది అని భగవద్గీతలో చెప్పిన తత్వాన్ని పూరీ జగన్నాథుడు ఆచరణాత్మకంగా చూపిస్తాడు. పాత మూర్తులను ఆలయ ప్రాంగణంలోనే ఒక కుటుంబ సభ్యుడిని సాగనంపినట్లుగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఖననం చేస్తారు.

రథయాత్ర నాడు గజపతి మహారాజు స్వయంగా బంగారు చీపురు పట్టి రథాన్ని ఊడ్చే ‘ఛెరా పహరా’ అనే ఘట్టం, దేవుడి ముందు ఎంతటి రాజైనా సేవకుడే అని చాటిచెబుతుంది. ఇదంతా చూస్తే జగన్నాథుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు.. ఆయన రాజు, బిడ్డ, అతిథి, రోగి, కుటుంబ సభ్యుడు అని అర్థమవుతుంది. దైవం అంటే మనకు దూరంగా ఎక్కడో ఉండేది కాదు, మన జీవితంలోనే ఒక భాగం అని ఈ ఆలయ సంప్రదాయాలు మనకు నేర్పుతాయి. దేవుడికి జబ్బు చేయడం అనేది మూఢనమ్మకం కాదు, అది భగవంతుడికి మానవుడికి మధ్య ఉన్న అత్యంత మధురమైన, భావోద్వేగ భరితమైన బంధానికి నిలువెత్తు ప్రతీక

The post పూరీ జగన్నాథుని అద్భుత లీల: రథయాత్రకు ముందు స్వామివారు ఎందుకు అనారోగ్యానికి గురవుతారో తెలుసా? appeared first on Journalist Sirisha.

ఫ్యాక్ట్ చెక్ బై జర్నలిస్ట్ శిరీష! ‘ఇండిపెండెంట్ జర్నలిజం’ ముసుగులో తులసి చందు ఫేక్ న్యూస్ ప్రచారం?
జర్నలిస్ట్ శిరీష రిపోర్టింగ్ | Kadpathr.in

స్వతంత్ర జర్నలిజం ముసుగులో అజెండా రాజకీయాలా? నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తానని చెప్పుకుంటూ.. వాస్తవాలను వక్రీకరించి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయడం ఎంతవరకు సమంజసం? అయోధ్య రామాలయం సాకుగా చూపి, సగం నిజాలతో నరేటివ్ సెట్ చేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బురదజల్లే ప్రయత్నం చేశారు యూట్యూబర్ తులసి చందు. ‘రాముడి కంటే రావణ్ ముఖ్యమా?’ అంటూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేలా ఆమె చేసిన వీడియోలో దాచిపెట్టిన నిజాలేంటి? ఆమె ఆరోపణల వెనుక ఉన్న ఫేక్ న్యూస్ బండారం ఏంటి? పూర్తి ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్ మీకోసం:

హుండీ దొంగతనాన్ని దాచేశారు.. ఎవరూ పట్టించుకోవట్లేదు?

వాస్తవం: అయోధ్యలో చోరీ జరిగింది నిజమే. కానీ, దీన్ని అధికారులు దాచిపెట్టలేదు. బ్యాంకులో డిపాజిట్ అవుతున్న మొత్తానికి, లెక్కలకు తేడా ఉండడాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులే స్వయంగా గుర్తించారు. కౌంటింగ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి దొంగలను పట్టుకుంది వారే. ట్రస్ట్ ఫిర్యాదుతో యూపీ ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది.

తాజా అప్‌డేట్: ఈ స్కామ్‌లో విచారణ జరిపిన సిట్.. క్లర్క్ అవినాష్ శుక్లాను ప్రైమ్ అక్యూజ్డ్‌గా తేల్చింది. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి రూ. 80 లక్షలకు పైగా రికవరీ చేశారు.

Ayodhya Ram Mandir Premises. Source: Kailash Mansarovar Yatra

. భూకుంభకోణం: 2 కోట్ల భూమిని 10 నిమిషాల్లో 18.5 కోట్లకు కొన్నారా?

వాస్తవం: వీడియోలో 2 కోట్ల భూమిని కేవలం 10 నిమిషాల వ్యవధిలో ట్రస్ట్ 18.5 కోట్లకు కొని రాముడిని నిలువునా దోచేసింది అని తులసి చందు ఆరోపించారు. కానీ దీని వెనుక ఉన్న అసలు వాస్తవాన్ని దాచేశారు. ఆ భూమికి సంబంధించిన అసలు కొనుగోలు ఒప్పందం (Agreement to sell) పదేళ్ల క్రితమే (2011 సమయంలో) జరిగింది. ఆ పాత అగ్రిమెంట్ ప్రకారమే 2021లో మొదటి రిజిస్ట్రేషన్ పాత ధరకే (2 కోట్లకు) జరిగింది.

కానీ ట్రస్ట్ ఆ భూమిని కొనుగోలు చేసే నాటికి (2021) అయోధ్యలో రామ మందిర నిర్మాణం నేపథ్యంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అప్పటి కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారమే ట్రస్ట్ ఆ భూమిని 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ట్రస్ట్ 2021లోనే ఆధారాలతో సహా స్పష్టం చేసింది. పాత అగ్రిమెంట్ విషయాన్ని కప్పిపుచ్చి, కేవలం 10 నిమిషాల్లో రేటు పెరిగిందని చెప్పడం పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమే.

1250 కిలోల బంగారం, వెండి మాయమయ్యాయా?

వాస్తవం: సంతోష్ దూబే చేసిన ఈ ఆరోపణలను ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది. భక్తులు ఇచ్చిన 2,926 వస్తువులు (బంగారం, వెండి ఇటుకలు, ఆభరణాలు) స్వతంత్ర చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ప్రతి ఏటా ఆడిట్ చేయబడుతున్నాయని, అవన్నీ భద్రంగా ఉన్నాయని ట్రస్ట్ ట్రెజరర్ గోవింద దేవగిరి స్పష్టం చేశారు. పారదర్శకత కోసం వాటిని బహిరంగ ప్రదర్శనకు కూడా ఉంచారు.

చంపత్ రాయ్ రాజీనామా పై వీడియోలో తప్పుడు సమాచారం

వాస్తవం: చంపత్ రాయ్ రాజీనామా పెండింగ్‌లో ఉందని, జూలై 11న నిర్ణయం తీసుకుంటారని వీడియోలో తులసి చందు పేర్కొన్నారు. కానీ ఇది పూర్తిగా పాత వార్త. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే.

తాజా అప్‌డేట్: దొంగతనం వెలుగుచూసిన తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా చేసిన రాజీనామాలను జూలై 6న జరిగిన ప్రత్యేక సమావేశంలో ట్రస్ట్ అధికారికంగా ఆమోదించింది. వారి స్థానంలో కృష్ణ మోహన్‌ను ఇంటీరియమ్ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఆలయ ట్రస్ట్‌లో ప్రక్షాళన ఇప్పటికే పూర్తయింది.

నేషనల్ మీడియా సైలెంట్ గా ఉందా?

వాస్తవం: దొంగతనం జరిగిన నాటి నుంచి ఇండియా టుడే, WION, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ మీడియా సంస్థలు దీనిపై కంటిన్యూస్ ఇన్వెస్టిగేటివ్ కవరేజ్ ఇస్తూనే ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి జాతీయ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు గుప్పించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగలేదనడం పచ్చి అబద్ధం.

రాముడి కంటే ‘రావణ్’ ముఖ్యమా? (పవన్ కళ్యాణ్‌ పై విమర్శ)

వాస్తవం: ఇక్కడ రెండు వేర్వేరు రాష్ట్రాల, వేర్వేరు అంశాలను ముడిపెట్టే ప్రయత్నం జరిగింది. యూట్యూబర్ రావణ్‌పై ఉపా (UAPA) కేసు నమోదు కావడం, అతన్ని అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతలకు సంబంధించిన అంశం. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు చూస్తున్నారు. అయోధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరియు కేంద్రం పరిధిలోని అంశం. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే సిట్ వేసి యాక్షన్ మోడ్‌లో ఉంది. యూపీలో జరుగుతున్న దర్యాప్తును పక్కనపెట్టి, ఏపీ మంత్రిని ప్రశ్నించడంలో కేవలం పొలిటికల్ అజెండా, బురదజల్లే ఉద్దేశాలే తప్ప ఏమాత్రం లాజిక్ లేదు.

సొంత రాష్ట్రంలో గుడులపై దాడులు జరిగితే సైలెంటా?

వాస్తవం: యూట్యూబర్ తులసి చందు నివసిస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇటీవల తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి. ఈ దాడుల వెనుక ఉన్న నిజానిజాలు తేల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సిట్ (SIT) వేసి దర్యాప్తుకు ఆదేశించింది. సొంత రాష్ట్రంలో, కళ్లెదుటే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, వాటిపై ఇక్కడ సిట్ విచారణలు జరుగుతున్నా.. వాటిని ఏనాడూ ప్రశ్నించని ఈ ‘ఇండిపెండెంట్ జర్నలిస్ట్’.. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఇష్యూని పట్టుకుని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం దేనికి సంకేతం? తెలంగాణలో గుడులపై దాడులు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? తనకు కావాల్సిన పొలిటికల్ అజెండాను మాత్రమే భుజానికెత్తుకుని, లోకల్ ఇష్యూస్‌ను గాలికొదిలేయడం ఎలాంటి జర్నలిజం?

అయోధ్య ఆలయంలో కింది స్థాయి సిబ్బంది కొందరు అవినీతికి పాల్పడింది వాస్తవం. అయితే ఆ దొంగలను పట్టుకుంది, సిట్ వేసి అరెస్టులు చేయించింది ట్రస్ట్ మరియు ప్రభుత్వమే. భూముల వ్యవహారంలోనూ పాత అగ్రిమెంట్ల ప్రకారం జరిగిన లావాదేవీలను స్కామ్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. పూర్తి వాస్తవాలను, లేటెస్ట్ అప్‌డేట్స్ ను కావాలనే దాచిపెట్టి.. సగం నిజాలతో యాంటీ-గవర్నమెంట్ నరేటివ్‌ను సెట్ చేస్తూ, జర్నలిజం పేరుతో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం శోచనీయం.

The post ఫ్యాక్ట్ చెక్ బై జర్నలిస్ట్ శిరీష! ‘ఇండిపెండెంట్ జర్నలిజం’ ముసుగులో తులసి చందు ఫేక్ న్యూస్ ప్రచారం? appeared first on Journalist Sirisha.

శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ‘తనోట్ మాత’ – 3000 పాక్ బాంబులను నిర్వీర్యం చేసిన అద్భుత చరిత్ర!
మృత్యువు ఆకాశం నుండి నిప్పుల వానలా కురుస్తోంది. చెవులు పగిలిపోయేలా ఫిరంగుల మోత. కళ్లు మూసి తెరిచేలోపు వందలాది బాంబులు ఇసుక తిన్నెలపై పడి పేలుతూ, దట్టమైన పొగతో ఎడారిని కప్పేస్తున్నాయి. ఆ భీకర దాడికి మనుషులు, వాహనాలు, ఆఖరికి ఇసుక కూడా కాలి బూడిదవుతోంది. కానీ, ఆ రణరంగం నడిబొడ్డున ఉన్న ఒక చిన్న గుడి మాత్రం చెక్కుచెదరలేదు. శత్రువులు ఆ గుడిని లక్ష్యంగా చేసుకుని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3000కు పైగా భారీ ఆర్టిలరీ బాంబులను ప్రయోగించారు. అందులో దాదాపు 450 బాంబులు నేరుగా ఆ గుడి ప్రాంగణంలోనే పడ్డాయి.

అయినా, అందులో ఒక్కటంటే ఒక్క బాంబు కూడా పేలలేదు!

సైన్స్ తలవంచిన చోట, శత్రువుల వ్యూహాలు మట్టికరిచిన చోట, అభేద్యమైన రక్షణ కవచంగా నిలిచిన ఆ అద్భుతమే రాజస్థాన్ సరిహద్దుల్లోని ‘తనోట్ మాత ఆలయం’ (Tanot Mata Temple). కేవలం ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా, పాకిస్థాన్ గుండెల్లో నిద్రపోయే సింహంలా, భారత సైన్యానికి నిలువెత్తు ధైర్యంగా నిలిచిన ఆ రణచండి చరిత్రను లోతుగా తెలుసుకుందాం.

థార్ ఎడారిలో వెలిసిన దైవశక్తి: పుట్టు పూర్వోత్తరాలు

రాజస్థాన్ లోని జైసల్మేర్ నగరానికి సుమారు 120 కిలోమీటర్ల దూరంలో, భారత్-పాక్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది తనోట్ గ్రామం. పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌లో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ‘హింగ్లాజ్ మాత’ (Hinglaj Mata) అవతారమే ఈ తనోట్ మాత అని భక్తుల నమ్మకం.

క్రీస్తుశకం 8వ శతాబ్దంలో భాటి రాజ్‌పుత్ వంశానికి చెందిన రాజు ‘తను రావు’ ఈ ఆలయాన్ని నిర్మించి, ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించాడు.

నాటి నుండి ఆ ఎడారి ప్రాంత ప్రజలకు, రాజ్‌పుత్‌లకు ఆమె ఆరాధ్య దైవంగా మారింది.

ఎడారిలో వీచే భయంకరమైన వేడి గాలులు, నీటి ఎద్దడి, ప్రకృతి వైపరీత్యాల నుండి అమ్మవారే తమను కాపాడుతోందని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. కానీ, ఆ విశ్వాసం దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని అప్పట్లో ఎవరూ ఊహించలేదు.

1965 ఇండో-పాక్ యుద్ధం: మృత్యువు తాండవించిన వేళ

1965… భారతదేశం అప్పుడప్పుడే కుదురుకుంటున్న సమయం. సరిగ్గా అదే అదనుగా భావించిన పాకిస్థాన్ అకస్మాత్తుగా దాడికి దిగింది. నవంబర్ నెలలో రాజస్థాన్ సరిహద్దుల గుండా భారత భూభాగంలోకి చొచ్చుకురావాలని పాక్ సైన్యం పథకం పన్నింది.

పాకిస్థాన్ ఆర్మీకి చెందిన భారీ బలగాలు కిషన్‌గఢ్, సాదేవాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. వారి తదుపరి లక్ష్యం తనోట్ గ్రామం. ఆ గ్రామాన్ని కూడా చేజిక్కించుకుంటే జైసల్మేర్‌లోకి సులభంగా ప్రవేశించవచ్చని వారి వ్యూహం. ఆ సమయంలో తనోట్ వద్ద ఉన్నది కేవలం ‘రాజస్థాన్ ఆర్మడ్ కాన్‌స్టేబులరీ’ (RAC), మరియు 13 గ్రెనేడియర్స్ కు చెందిన కొంతమంది భారత జవాన్లు మాత్రమే. శత్రు బలగాలతో పోలిస్తే మన సైనికుల సంఖ్య చాలా తక్కువ.

నిప్పుల వాన… నిర్వీర్యమైన బాంబులు

నవంబర్ 17. పాకిస్థాన్ సైన్యం తనోట్ పై భయంకరమైన దాడి ప్రారంభించింది. ఆకాశం నుండి బాంబుల వర్షం కురుస్తోంది. భారత సైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోరాడుతున్నారు. శత్రువుల దాడికి తట్టుకోలేక చాలా మంది జవాన్లు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తనోట్ మాత ఆలయంలో తలదాచుకున్నారు.

ఇది గమనించిన పాక్ సైన్యం నేరుగా ఆలయంపైనే ఆర్టిలరీ ఫైరింగ్ ప్రారంభించింది. నవంబర్ 17 నుండి 19 వరకు రెండు రోజుల పాటు ఏకధాటిగా గుడిని లక్ష్యంగా చేసుకుని బాంబులు కురిపించింది. ఆ దెబ్బకు గుడి నామరూపాలు లేకుండా పోతుందని అందరూ అనుకున్నారు.

కానీ, అక్కడే ప్రకృతి నియమాలకు విరుద్ధమైన మహాద్భుతం జరిగింది. పాకిస్థాన్ ప్రయోగించిన 3000 బాంబుల్లో కనీసం 450 బాంబులు నేరుగా ఆలయం ఆవరణలో పడ్డాయి. కానీ గుడి గోడకు ఒక్క చిన్న పగులు కూడా రాలేదు. ప్రాంగణంలో పడిన ఏ ఒక్క బాంబూ పేలలేదు! గుడి ఆవరణలో ఇసుకలో కూరుకుపోయిన ఆ బాంబులను చూసి భారత సైనికులే నివ్వెరపోయారు.

అభయమిచ్చిన రణచండి

ఆ రోజు రాత్రి భారత సైనికుల కలలోకి తనోట్ మాత వచ్చిందని చెబుతారు. “మీరు నా ఆలయ ప్రాంగణంలో ఉన్నంత కాలం శత్రువుల తూటా గానీ, బాంబు గానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు ధైర్యంగా పోరాడండి” అని అమ్మవారు అభయమిచ్చిందని ఆనాటి సైనికులు గర్వంగా చెబుతారు.

ఆ మాటలతో భారత జవాన్లలో అంతులేని ఆత్మవిశ్వాసం రగిలింది. మరుసటి రోజు ఉదయం రెట్టించిన ఉత్సాహంతో, “జై తనోట్ మాతా” అని నినదిస్తూ పాక్ సైన్యంపై సింహాల్లా విరుచుకుపడ్డారు. శత్రువులు వెనక్కి తిరిగి చూసుకోకుండా పారిపోయేలా తరిమికొట్టారు. పేలని బాంబులను చూసి పాక్ సైన్యానికి సైతం భయంతో వణుకు పుట్టింది.

1971 లాంగేవాలా యుద్ధం: పాక్ ట్యాంకులకు సమాధి

అమ్మవారి మహిమ కేవలం ఒక యుద్ధానికే పరిమితం కాలేదు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ మళ్లీ పశ్చిమ సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది. ఈసారి తనోట్‌కు సమీపంలో ఉన్న ‘లాంగేవాలా’ పోస్ట్‌పై భారీ దాడికి ప్లాన్ చేసింది.

డిసెంబర్ 4 రాత్రి. వందలాది పాకిస్థాన్ యుద్ధ ట్యాంకులు, వేలాది మంది సైనికులు లాంగేవాలా వైపు కవాతు చేస్తున్నారు. అక్కడ భారత సైన్యం తరపున ఉన్నది పంజాబ్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ కులదీప్ సింగ్ చంద్‌పురి మరియు కేవలం 120 మంది సైనికులు మాత్రమే. (ఈ అద్భుత పోరాటమే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బోర్డర్’ కు స్ఫూర్తి).

ధైర్యానికి దైవబలం తోడైతే…

శత్రువుల సంఖ్య వేలల్లో ఉంది. మన సైనికులు కేవలం వందల్లో. రాత్రి సమయంలో భారత వైమానిక దళం రంగంలోకి దిగే అవకాశం లేదు. తెల్లవారే వరకు ఆ 120 మంది సైనికులే ఆ భారీ సైన్యాన్ని నిలువరించాలి. ఆ భయంకరమైన రాత్రిలో మేజర్ కులదీప్ సింగ్ తనోట్ మాతను స్మరించుకుని పోరాటం ప్రారంభించారు.

ఒకవైపు సైనికుల వీరోచిత పోరాటం, మరోవైపు దైవబలం. శత్రువుల ట్యాంకులు ఇసుకలో కూరుకుపోయాయి. వారి వ్యూహాలు బెడిసికొట్టాయి. రాత్రంతా జరిగిన ఆ భీకర యుద్ధంలో మన 120 మంది సైనికులు పాకిస్థాన్ సైన్యాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా అడ్డుకున్నారు. ఉదయం కాగానే భారతీయ హంటర్ విమానాలు రంగంలోకి దిగి పాక్ ట్యాంకులను ఇసుకలో సమాధి చేశాయి. ఈ యుద్ధంలో కూడా పాకిస్థాన్ గుడిపై దాడి చేయడానికి ప్రయత్నించినా, ఏ ఒక్క బాంబూ పేలకపోవడం గమనార్హం.

సైనికులే అర్చకులు: BSF భక్తి ప్రపత్తులు

1965 మరియు 1971 యుద్ధాల తర్వాత, తనోట్ మాత ఆలయానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ అద్భుతాలను కళ్లారా చూసిన భారత సరిహద్దు భద్రతా దళం (Border Security Force – BSF) ఆలయ బాధ్యతలను పూర్తిగా తమ భుజస్కంధాలపై వేసుకుంది.

యూనిఫాంలో ఉన్న పూజారులు: భారతదేశంలో ఆర్మీ జవాన్లే స్వయంగా పూజారులుగా ఉండి నిర్వహించే ఏకైక ఆలయం ఇదే. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూర్తి సైనిక క్రమశిక్షణతో అమ్మవారికి హారతులు ఇస్తారు.

మ్యూజియం: 1965 యుద్ధంలో పాకిస్థాన్ వేసినా పేలకుండా ఉండిపోయిన బాంబులను నేటికీ భక్తుల సందర్శనార్థం ఆలయ ప్రాంగణంలోని ఒక చిన్న మ్యూజియంలో భద్రపరిచారు. ఆ బాంబులను చూస్తే ఈనాటికీ ప్రతి భారతీయుడికి గూస్ బంప్స్ వస్తాయి.

విజయ స్తంభం: పాకిస్థాన్‌పై సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా భారత సైన్యం ఆలయానికి సమీపంలో ఒక విజయ స్తంభాన్ని (Victory Pillar) నిర్మించింది. ప్రతి ఏడాది డిసెంబర్ 16న ఇక్కడ సైన్యం ఘనంగా ‘విజయ్ దివస్’ జరుపుకుంటుంది.

రుమాలు కడితే కోరికలు తీరుతాయి: భక్తులు తమ కోరికలు తీరాలని ఆలయ ఆవరణలో ఉన్న వలలకు కర్చీఫ్‌లు (రుమాళ్లు) కడతారు. కోరిక తీరిన తర్వాత మళ్లీ వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

ఎడారిలో ఆరని జ్యోతి

తనోట్ మాత ఆలయం కేవలం ఒక ఇటుకలు, సిమెంట్ తో కట్టిన కట్టడం కాదు. అది భారతీయ సైనికుల అచంచలమైన విశ్వాసానికి సజీవ సాక్ష్యం. మృత్యువు ముఖాముఖి ఎదురైనప్పుడు, ప్రాణాలు గాలిలో కలుస్తాయనిపించినప్పుడు, ఒక అదృశ్య శక్తి తమ వెన్నంటి ఉందన్న ధైర్యమే సైనికులతో ఆ అసాధారణ పోరాటాన్ని చేయించింది.

దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ప్రతి BSF జవాను, పెట్రోలింగ్‌కు వెళ్లేముందు తనోట్ మాత ముందు తలవంచి, ఆ గుడిలోని ఇసుకను నుదుటిన తిలకంగా దిద్దుకున్న తర్వాతే తన తుపాకీని చేతపడతాడు. శత్రు దేశం ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వేల బాంబులు కురిపించినా… రాజస్థాన్ ఎడారిలో కొలువైన ఆ రణచండి కనుసన్నల్లో ఉన్నంత వరకు, భారతదేశ సరిహద్దులు సురక్షితంగానే ఉంటాయి.

ఒక్కసారి ఆ గుడి ప్రాంగణంలో నిలబడి, శత్రువుల పేలని బాంబులను చూస్తూ, దూరం నుండి వినిపించే BSF జవాన్ల కవాతు శబ్దం వింటే… ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి!

The post శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ‘తనోట్ మాత’ – 3000 పాక్ బాంబులను నిర్వీర్యం చేసిన అద్భుత చరిత్ర! appeared first on Journalist Sirisha.

హిందూ వ్యతిరేకుల నోరు మూయించే కామాఖ్య శక్తిపీఠం చరిత్ర! ఆధునికవాదులు దాస్తున్న నిజాలివే
భారతీయ సనాతన ధర్మంపై, మన అద్భుతమైన సంప్రదాయాలపై పనిగట్టుకుని కొందరు “ఆధునికవాదులు”, అర్బన్ నక్సల్స్ బురదజల్లుతున్న రోజులివి. హిందూ ధర్మంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదని, వారిని అణిచివేస్తున్నారని ఏడుస్తూ విదేశీ ఫండింగ్ తో నడిచే కొన్ని ఎన్జీవోలు (NGOs) చేసే విష ప్రచారానికి చెంపపెట్టు లాంటి ఒక సజీవ సాక్ష్యం అస్సాంలోని గువాహటిలో ఉన్న “కామాఖ్య దేవి ఆలయం”.

హిందూ సంప్రదాయంలో ‘నెలసరి’ని (రుతుక్రమాన్ని) అపవిత్రంగా భావిస్తారని గొంతు చించుకునే కుహనా మేధావులకు, సాక్షాత్తూ ఆ దేవినే రుతుమతిగా ఆరాధించే గొప్పతనం మన సనాతన ధర్మానికే సొంతం అన్న విషయం బహుశా తెలియకపోవచ్చు.

గుడి తలుపులు మూసివేసే ఆ మూడు రోజులు…

ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే “అంబుబాచి మేళా” సమయంలో కామాఖ్య ఆలయం తలుపులు మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయంలో ఎలాంటి పూజలు జరగవు, గుడిలోకి పూజారులకు సైతం ప్రవేశం ఉండదు. దీనికి కారణం… ఆ మూడు రోజులూ సృష్టికి మూలమైన దేవి రుతుక్రమంలో ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

విగ్రహం ఉండదు.. కేవలం ‘యోని’ ఆరాధన!

కామాఖ్య దేవాలయం గర్భగుడిలో మీరు ఆశించే సాధారణ దేవుని విగ్రహాలు ఉండవు. మెట్లు దిగి భూగర్భంలో ఉన్న సహజ సిద్ధమైన గుహలోకి వెళితే, అక్కడ ఒక యోని ఆకారంలో ఉన్న సహజసిద్ధమైన శిల మాత్రమే కనిపిస్తుంది. ఆ శిల కింద నుండి ఒక నీటి ఊట నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

పురాణాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు, సృష్టికి మూలమైన ఆమె ‘యోని’ భాగం ఈ నీలాచల్ పర్వతం మీద పడింది. అందుకే ఈ భూమి మీద ఉన్న 51 శక్తిపీఠాలలో ఇది అత్యంత పురాతనమైనది, శక్తివంతమైనది.

ఇక్కడ అమ్మవారికి రూపం లేదు. ఆ శిల, ఆ నీటి ఊట, ఈ పవిత్ర భూమి.. ఇవన్నీ ఆ దేవి స్వరూపాలే! త్రిపుర సుందరి, కమల తదితర దశ మహావిద్యలను ఒకే ప్రాంగణంలో ఆరాధించే ఏకైక క్షేత్రం ఇది. తంత్ర సాధకులకు, శాక్తేయ సంప్రదాయానికి ఇదే మూల కేంద్రం.

ప్రకృతితో మమేకమైన మన సంప్రదాయం

ప్రతి ఏటా జూన్ మూడవ వారంలో ఆ భూగర్భ ఊట నుండి వచ్చే నీరు ఎరుపు రంగులోకి మారుతుంది. ఆశ్చర్యకరంగా బ్రహ్మపుత్రా నది నీరు కూడా ఆ గుడి సమీపంలో ఎర్రగా మారుతుంది. అమ్మవారు రుతుక్రమంలో ఉండటం వల్లే భూమి రజస్వల అవుతోందని భక్తుల నమ్మకం.

ఇక్కడ మనం గర్వపడాల్సిన విషయం ఏమిటంటే… ఈ మూడు రోజులు అస్సాం గ్రామీణ రైతులు భూమిని దున్నడం, వ్యవసాయ పనులు పూర్తిగా ఆపేస్తారు. సృష్టికి మూలమైన దేవి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, భూతల్లిని యంత్రాలతో ఇబ్బంది పెట్టకూడదన్నది వారి ఉద్దేశం. సృష్టితో, ప్రకృతితో ఇంతలా మమేకమైన ఇలాంటి సంప్రదాయం ప్రపంచంలో మరెక్కడైనా ఉందా?

చరిత్రలో దాగి ఉన్న అద్భుత గాథలు

ఈ ఆలయం చరిత్ర కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, ఎన్నో చారిత్రక పరిణామాలకు సజీవ సాక్ష్యం.

నరకాసురుడి గర్వభంగం: అమ్మవారిని వివాహం చేసుకోవాలని నరకాసురుడు ప్రయత్నించి, ఒకే రాత్రిలో పర్వతం కింది నుండి పైకి రాతి మెట్లు కట్టే ప్రయత్నం చేస్తే, అమ్మవారు ఒక కోడి కూతను సృష్టించి వాడిని బురిడీ కొట్టించిన కథ ఇక్కడ ప్రసిద్ధి. నేటికీ ఆ సగం కట్టిన మెట్లు మనకు కనిపిస్తాయి.

కోచ్ రాజవంశానికి శాపం: 16వ శతాబ్దంలో విదేశీ దండయాత్రల వల్ల ధ్వంసమైన ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన కోచ్ (Koch) వంశ రాజులు, అమ్మవారి నాట్యాన్ని రహస్యంగా చూడాలని ప్రయత్నించి తీవ్రమైన శాపానికి గురయ్యారు. ఆ శాపం వల్ల నేటికీ ఆ రాజవంశానికి చెందిన వారు కామాఖ్య ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడరు!

ఆధునికవాదులకు ఒక ప్రశ్న!

మూడు రోజుల తర్వాత గుడి తలుపులు తెరిచినప్పుడు, అమ్మవారి శిలపై కప్పిన ఎర్రటి వస్త్రాన్ని (అంగవస్త్రం), సింధూరం కలిసిన పవిత్ర జలాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రసాదంగా దీనిని భావిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ప్రసాదం కోసం వేచి చూస్తారు.

సృష్టి, సంతానోత్పత్తికి కారణమైన రుతుక్రమం అపవిత్రం ఎలా అవుతుంది? అది సృష్టికి మూలాధారం అని వేల ఏళ్ల క్రితమే గుర్తించి, ఆ ప్రక్రియను అత్యంత పవిత్రంగా పూజించిన సనాతన ధర్మం గొప్పదా? లేక పాశ్చాత్య భావజాలంతో మన సంస్కృతిని కించపరిచే నకిలీ మేధావులు గొప్పవాళ్లా?

మహిళను కేవలం ఒక భోగ వస్తువుగా చూసే పాశ్చాత్య సమాజాలకు, స్త్రీని సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణిగా పూజించే సనాతన ధర్మానికి ఉన్న వ్యత్యాసం ఇదే! ఈ అద్భుతమైన వైదిక విజ్ఞానాన్ని ప్రతి హిందువు తెలుసుకోవాలి, గర్వంగా పది మందికి చెప్పాలి.

The post హిందూ వ్యతిరేకుల నోరు మూయించే కామాఖ్య శక్తిపీఠం చరిత్ర! ఆధునికవాదులు దాస్తున్న నిజాలివే appeared first on Journalist Sirisha.

రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ఎందుకు శివుడిని పూజించాడు?
సెక్యులర్ చరిత్రకారులు దాచిన రామేశ్వరం అసలు కథ!

– జర్నలిస్ట్ శిరీష

రామాయణం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శ్రీరాముడి ధర్మ నిరతి, రావణాసురుడి రాక్షసత్వం. కానీ, రావణ వధ తర్వాత జరిగిన ఒక అత్యంత కీలకమైన, మహత్తరమైన ఘట్టాన్ని మాత్రం నేటి మేధావులు, వామపక్ష చరిత్రకారులు ఎన్నడూ ప్రస్తావించరు. ధర్మాన్ని రక్షించడానికి, సీతమ్మను దక్కించుకోవడానికి రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు ఎటువంటి విజయోత్సవాలు చేసుకోలేదు. పైగా ఒక అదృశ్య భారంతో తీవ్రంగా కుంగిపోయాడు. ఎందుకంటే, ఆ వధ వెనుక ఒక మహా దోషం దాగి ఉంది. అదే ‘బ్రహ్మహత్యా దోషం’. రామేశ్వరం అనే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ఆవిర్భావానికి కారణమైన ఈ మహాద్భుత ఘట్టం గురించి ప్రతి హిందువూ గర్వంగా తెలుసుకోవాలి.

రావణుడి అసలు స్వరూపం – బ్రహ్మహత్యా దోషం

రావణుడు సీతాపహరణం చేసిన మహాపాపి, లోకాలను పీడించిన రాక్షసుడు అన్నది జగమెరిగిన సత్యం. అయితే, అదే సమయంలో అతడు గొప్ప శివభక్తుడు, మహా పండితుడు, నాలుగు వేదాలు ఔపోసన పట్టిన బ్రాహ్మణుడు. ఒక పండితుడిని, వేద మంత్రాలు తెలిసిన బ్రాహ్మణుడిని చంపడం వల్ల, ఆ చంపిన కారణం ఎంత ధర్మబద్ధమైనది అయినప్పటికీ బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుంది.

ధర్మావతారుడైన శ్రీరాముడు సైతం ఆ కర్మ సిద్ధాంతానికి అతీతుడు కాడు. ఆధునిక కాలంలో సెక్యులర్ వ్యవస్థ తెచ్చిన చట్టాలు కొందరికి చుట్టాలుగా మారవచ్చు, నేరస్థులు తప్పించుకోవచ్చు. కానీ సనాతన ధర్మంలో ఎవరైనా సరే తాము చేసిన కర్మకు పూర్తి బాధ్యత వహించాల్సిందే. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడికి కూడా ఆ కర్మ నియమం వర్తిస్తుందని ఈ ఘట్టం నిరూపిస్తోంది. ఒక దోషం అంటినప్పుడు దాని తాలూకు ఆధ్యాత్మిక పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో సనాతన ధర్మం స్పష్టంగా చెబుతోంది.

ప్రాయశ్చిత్తానికి ఏకైక మార్గం – మహాశివుడి ఆరాధన

యుద్ధం ముగిసిన తర్వాత దక్షిణ భారత సముద్ర తీరంలో ఉన్నప్పుడు, ఈ బ్రహ్మహత్యా దోషం పోవాలంటే ఒకటే మార్గమని మహర్షులు శ్రీరాముడికి సూచించారు. అదే మహాశివుడి ఆరాధన! ఆ సమయంలో జరిగిన ఆ ఆరాధనే మన సనాతన ధర్మంలోని అత్యంత శక్తివంతమైన, భావోద్వేగభరితమైన ఘట్టాలలో ఒకటి.

తాను చేసిన ఒక మహాకార్యానికి, ధర్మ సంస్థాపనకు సైతం దోషం అంటినప్పుడు, దానిని ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సాక్షాత్తూ ఆ భగవంతుడే తలవంచిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ఇది కేవలం ఒక గుడి కథ కాదు. అత్యున్నత స్థానంలో ఉన్నవారు, అధికారం చేతిలో ఉన్నవారు కూడా తమ చర్యలకు, కర్మలకు ఎలా జవాబుదారీగా ఉండాలో తెలిపే అద్భుతమైన ఉదాహరణ ఇది.

రామేశ్వర క్షేత్ర ఆవిర్భావం

అలా శ్రీరాముడు తన దోష నివారణ కోసం, కర్మ ఫల ప్రక్షాళన కోసం స్వయంగా సైకత లింగాన్ని (ఇసుకతో చేసిన శివలింగం) ప్రతిష్ఠించి పరమశివుడిని పూజించిన పవిత్ర స్థలమే నేటి ‘రామేశ్వరం’. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, చార్ ధామ్ యాత్రా స్థలాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. 22 పుణ్య తీర్థాలతో, అడుగడుగునా రామాయణ ఘట్టాలను గుర్తుచేసే ఈ ఆలయం సనాతన ధర్మ శాశ్వతత్వానికి ప్రతీక.

ఇక్కడి రామలింగేశ్వరుడిని పూజించడం ద్వారా రాముడు “శివకేశవుల మధ్య అభేదాన్ని” లోకానికి చాటిచెప్పాడు. రాముడికి ఈశ్వరుడు (శివుడు) దేవుడు కాబట్టి అతడు రామేశ్వరుడు అయ్యాడు.

నేటి సెక్యులర్ సమాజంలో, వామపక్ష భావజాలం నిండిన పాఠ్యపుస్తకాలలో ఇలాంటి లోతైన ధార్మిక సత్యాలను ఉద్దేశపూర్వకంగానే మరుగున పడేస్తున్నారు. రామేశ్వరం కేవలం ఒక పర్యాటక కేంద్రం కాదు, అది ధర్మ సంస్థాపనకు, కర్మ సిద్ధాంతానికి, మరియు ప్రాయశ్చిత్తానికి ప్రతీక. శ్రీరాముడు కేవలం ధర్మాన్ని రక్షించడమే కాదు, ధర్మ సూక్ష్మాలను ఆచరించి చూపించిన ఆదర్శమూర్తి. ఈ అసలు చరిత్రను తెలుసుకున్నప్పుడే సనాతన ధర్మం గొప్పదనం ఏమిటో, మన సంస్కృతి మూలాలు ఎంత లోతైనవో నేటి తరానికి అర్థమవుతుంది.

The post రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ఎందుకు శివుడిని పూజించాడు? appeared first on Journalist Sirisha.

దేవుళ్లు ఎందుకు మన భారతదేశంలోనే జన్మిస్తారు?
దేవుళ్లు ఎందుకు మన భారతదేశంలోనే జన్మిస్తారు? పాశ్చాత్య మాయలో పడిన వారికి మన పురాణాలు ఇస్తున్న చెంపపెట్టు లాంటి సమాధానం!

“అసలు దేవుళ్లు అందరూ భారతదేశంలోనే ఎందుకు పుడతారు?” – సనాతన ధర్మాన్ని, మన విశ్వాసాలను కించపరచాలని చూసే కొందరు మేధావులు, పాశ్చాత్య భావజాలంతో ప్రభావితమైన యువత తరచుగా అడిగే వ్యంగ్యమైన ప్రశ్న ఇది. “హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్స్ అంతా అమెరికా మీదే దాడి చేసినట్లు, భూమండలం అంతటినీ సృష్టించిన దేవుడికి అమెరికా, చైనా, ఐరోపా దేశాలు కనిపించలేదా? కేవలం ఇండియాలోనే ఎందుకు అవతారాలు ఎత్తాడు?” అని వారు ప్రశ్నిస్తుంటారు.

దీనికి సమాధానంగా మనలో చాలామంది “భారతదేశం పుణ్యభూమి కాబట్టి” అనో, లేదా “ఇక్కడ గొప్ప గొప్ప ఋషులు, గురుకుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి” అనో సర్దిచెప్పుకుంటారు. కానీ ప్రతి నాగరికతా తమ భూమిని పవిత్రమైనదిగానే భావిస్తుంది కదా? క్రైస్తవులకు జెరూసలెం, ముస్లింలకు మక్కా పవిత్రమైనట్లే, మనకు భారతదేశం పవిత్రం అని సరిపెట్టుకుంటే అందులో పూర్తి వాస్తవం లేదు. అయితే, ఈ ప్రశ్నకు మన పురాణాలలో స్పష్టమైన, శాస్త్రీయమైన సమాధానం ఉంది. దశాబ్దాలుగా మన విద్యావ్యవస్థ ద్వారా ఈ నిజాలను మనకు దూరం చేశారు. అసలు మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో తెలిస్తే, ప్రతి భారతీయుడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది.

తొమ్మిది లోకాలు – ఎనిమిది భోగ భూములు మన పురాణాల ప్రకారం పరమాత్మ ఈ సృష్టిలో కేవలం ఒక ప్రపంచాన్ని మాత్రమే నిర్మించలేదు, తొమ్మిది లోకాలను సృష్టించాడు. వీటిలో ఎనిమిది లోకాలు అద్భుతమైన స్వర్గధామాలు (ప్యారడైజ్). అక్కడ ప్రజలు పదివేల సంవత్సరాలు జీవిస్తారు. వారికి ముసలితనం, రోగం, బాధ, మరణం అనేవే ఉండవు. అంతా సుఖమే. కానీ విచిత్రం ఏమిటంటే.. ఆ ఎనిమిది లోకాలలో ‘పాప పుణ్యాలు’ అనబడే కర్మ సిద్ధాంతం పనిచేయదు. అక్కడ మంచి, చెడు అనేవి ఉండవు. వారు ఎన్ని వేల ఏళ్లు బతికినా వారు చేసే ఏ పనికీ అర్థం ఉండదు. కష్టపడకుండా, సాధించకుండా ఉచితంగా వచ్చిన ఏ సంపద అయినా, పతకం అయినా ఎలా శూన్యంగా అనిపిస్తుందో.. ఆ ఎనిమిది లోకాలలో జీవితం కూడా కేవలం అనుభవించడానికి మాత్రమే పరిమితం, అక్కడ ఆత్మ ఉద్ధరణకు అవకాశం లేదు.

కర్మభూమి.. మన భరతఖండం ఆ తొమ్మిది లోకాలలో ఎనిమిది భోగభూములు కాగా, కర్మ సిద్ధాంతం పనిచేసే ఏకైక భూభాగం తొమ్మిదోది. అదే మన ‘భారతవర్షం’. పురాణాలు దీని గురించి చాలా భౌగోళిక స్పష్టతను ఇచ్చాయి. హిమాలయాలకు దక్షిణంగా, సముద్రాల చేత చుట్టుముట్టబడి ఉన్న భూభాగమే ఈ భారతవర్షం. అంటే ఈ కర్మభూమి ఐరోపానో, చైనానో, అమెరికానో కాదు.. కచ్చితంగా మన భారతదేశమే!

ఇక్కడ జీవితం పూలపాన్పు కాదు. ఇక్కడ కష్టాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చేసే ప్రతి పనికీ ఒక ఫలితం ఉంటుంది. శాశ్వతమైన జనన మరణ చక్రం నుంచి విముక్తినిచ్చే ‘మోక్షాన్ని’ సాధించుకునే అవకాశం కేవలం ఈ భూమి మీద పుట్టిన వారికి మాత్రమే ఉంది.

దేవతలు సైతం అసూయపడే అదృష్టం మనది ఈ భూమి విశిష్టత ఎంతటిదంటే… ఆ ఎనిమిది లోకాలలో వేల ఏళ్లు ఎలాంటి కష్టాలు లేకుండా బతుకుతున్న దేవతలు సైతం “మనం ఆ భారతవర్షంలో ఎప్పుడు పుడతామా?” అని ఎదురుచూస్తుంటారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే, దేవతలకైనా తమ పుణ్యం తీరిపోయాక మళ్లీ జన్మలెత్తక తప్పదు. కానీ ఈ కర్మభూమిలో పుట్టిన ఒక సాధారణ మానవుడు, కేవలం 70-80 ఏళ్ల జీవితకాలంలో నిస్వార్థ భక్తితో పరమాత్మను ఆరాధించి శాశ్వత మోక్షాన్ని పొందగలడు. ఆ అవకాశం దేవతలకు కూడా లేదు.

అందుకే మన గ్రంథాలు ఒక హెచ్చరిక కూడా చేశాయి – “భారతవర్షంలో మానవుడిగా జన్మించి కూడా, మోక్షం కోసం ప్రయత్నించని వాడు, చేతిలో ఉన్న అమృతాన్ని పారబోసి విషాన్ని తాగిన మూర్ఖుడితో సమానం” అని.

మరి దేవుడు ఇక్కడే ఎందుకు అవతరిస్తాడు? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత… ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని స్పష్టంగా చెప్పాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు తాను అవతరిస్తానని మాట ఇచ్చాడు. ధర్మం ఎక్కడైతే వేళ్లూనుకుని ఉంటుందో, అక్కడే కదా దానికి ముప్పు వాటిల్లేది? వేదాలు, గురుకుల వ్యవస్థ, ఆలయ సంప్రదాయాలు, గురు శిష్య పరంపర… ఇవన్నీ ఈ భూమిపైనే స్థాపించబడ్డాయి. పాశ్చాత్య దేశాలలో వారికి వారి సంస్కృతులు ఉండొచ్చు కానీ, మోక్షానికి దారిచూపే ధార్మిక వ్యవస్థ పునాదులు ఉన్నది కేవలం భరతభూమి పైనే. అందుకే ఈ ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు దానిని రక్షించడానికి దేవుడు ఇక్కడే అవతరిస్తాడు.

ఆయన తలచుకుంటే ఎక్కడినుంచో కూర్చుని రాక్షసులను అంతం చేయగలడు. కానీ భగవంతుడికి తన భక్తులంటే ప్రాణం. ఇన్ని కష్టాల మధ్య కూడా ధర్మాన్ని నమ్ముకుని బతుకుతున్న తన భక్తులకు స్వయంగా కనిపించాలని, వారితో నడవాలని, వారి ప్రేమను అందుకోవాలని ఆ పరమాత్మ స్వయంగా మనిషి రూపంలో ఈ గడ్డ మీదకు దిగివస్తాడు. మన దేశంలో అణువణువునా కొలువై ఉన్న ప్రతి ఆలయంలోని మూర్తి, భగవంతుడికి మన మీద ఉన్న ఆ ప్రేమకే నిదర్శనం.

కాబట్టి, ఇన్నేళ్ల పాటు వలసవాద ఆలోచనలతో మన బ్రెయిన్ వాష్ చేసిన నకిలీ మేధావుల మాటలు పక్కనపెట్టి, మన గ్రంథాలు చెబుతున్న ఈ అద్భుతమైన సత్యాన్ని ప్రతి ఒక్కరూ గర్వంగా పదిమందికీ చెప్పాలి. భారతదేశం కేవలం ఒక భౌగోళిక భూభాగం కాదు, అది మోక్షానికి ఏకైక మార్గం!

The post దేవుళ్లు ఎందుకు మన భారతదేశంలోనే జన్మిస్తారు? appeared first on Journalist Sirisha.

అయోధ్య రామ మందిరంపై “సెక్యులర్” రాబందుల వాలకం! విరాళాల వివాదం వెనుక దాగున్న అసలు కుట్ర ఇదే!
ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ పోరాటం… ఎంతో మంది కరసేవకుల బలిదానాలు… దశాబ్దాల న్యాయపోరాటం తర్వాత సాకారమైన కోట్లాది హిందువుల స్వప్నం అయోధ్య శ్రీ రామ మందిరం. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తమ రక్తాన్ని చెమటగా మార్చి, భక్తిశ్రద్ధలతో కానుకలు సమర్పించారు. కానీ, ఇప్పుడు ఆ పవిత్రమైన విరాళాల చుట్టూ ఒక పనికిమాలిన రాజకీయ వివాదాన్ని సృష్టించి, హిందువుల విశ్వాసంపై బురదజల్లేందుకు కొన్ని “సెక్యులర్” శక్తులు, హిందూ వ్యతిరేక ముఠాలు రంగంలోకి దిగాయి.

అసలు ఈ కుంభకోణం వెనుక ఉన్న నిఖార్సైన నిజాలు ఏమిటి? ప్రతిపక్షాలు ఆడుతున్న దరిద్రపు రాజకీయం ఏమిటి? కళ్లు తెరిపించే వాస్తవాలు ఇవిగో!

1. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే కుట్ర – ట్రస్ట్ స్వయంప్రతిపత్తి అనే నిజం మరుగున!

ఈ వ్యవహారంలో లెఫ్ట్-లిబరల్ ఎకోసిస్టమ్ మరియు అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు ఉద్దేశపూర్వకంగా దాస్తున్న అతిపెద్ద సత్యం ఒకటుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేది నూటికి నూరు శాతం స్వయంప్రతిపత్తి (Autonomous) కలిగిన సంస్థ. దీని విరాళాలు, ఆర్థిక వ్యవహారాలు, అకౌంట్స్ నిర్వహణతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏమాత్రం సంబంధం లేదు!

ప్రభుత్వ బాధ్యత కేవలం ఆలయానికి, భక్తులకు భద్రత కల్పించడం మాత్రమే. కానీ, హిందూ ద్వేషంతో రగిలిపోయే కొన్ని రాజకీయ పక్షాలు, ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి అంటగట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఒక ప్రైవేట్ స్వయంప్రతిపత్తి సంస్థలో జరిగే నిర్వహణ లోపాలకు, ప్రభుత్వాన్ని నిందించడం వారి కుట్రలో భాగమే!

2. అఖిలేష్ యాదవ్‌కు రామ మందిరంపై ఎందుకంత ప్రేమ?

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ అంశంపై న్యాయ విచారణ కోరుతూ గగ్గోలు పెడుతున్నారు. కరసేవకులపై నిర్దాక్షిణ్యంగా తూటాలు పేల్చిన చరిత్ర ఉన్న పార్టీకి, ఇప్పుడు అకస్మాత్తుగా రాముడి విరాళాలపై ఎనలేని ప్రేమ పుట్టుకురావడం హాస్యాస్పదం. వారికి రామ మందిరం పవిత్రతపై భక్తి లేదు, కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీసి, ఆ బురదలో రాజకీయ ప్రయోజనాలు వెతుక్కోవాలనే కక్కుర్తి మాత్రమే కనిపిస్తోంది. ఇది గుడిని కాపాడే ప్రయత్నం కాదు, హిందూ విశ్వాసాన్ని కించపరిచే అజెండా!

3. ఆరోపణల్లో వాస్తవం ఉందా? ట్రస్ట్ ఎందుకు మౌనంగా ఉంది?

రాజకీయాలను పక్కన పెడితే, జర్నలిస్టులుగా మనం సూటిగా అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మాజీ అకౌంట్స్-ఇన్-ఛార్జ్ మహిపాల్ సింగ్ చేసిన ఆరోపణలను మనం తేలికగా కొట్టిపారేయలేము.

విరాళాల నగదు హుండీల నుంచి రికార్డుల్లోకి ఎక్కేసరికి ఎందుకు తగ్గుతోంది?

భక్తులు ఇచ్చిన బంగారం, వెండి ఆభరణాల లెక్కలు ఎందుకు పక్కాగా లేవు?

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కౌంటింగ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage) నెలల తరబడి ఎలా మాయమైంది?

రూ. 5 కోట్ల నుంచి మొదలైన ఈ ఆరోపణలు, ఇప్పుడు రూ. 200 కోట్లకు చేరుకున్నాయి అంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేసిన వ్యక్తిని రక్షించాల్సింది పోయి, విధుల నుంచి తొలగించి నోరు మూయించే ప్రయత్నం చేయడం ట్రస్ట్ పారదర్శకతపై తీవ్రమైన అనుమానాలకు తావిస్తోంది.

4. సమాధానం చెప్పాల్సింది రాజకీయనాయకులకు కాదు, హిందువులకు!

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న ప్రతి పైసా ఏ రాజకీయ నాయకుడి జేబులోంచి రాలేదు. అది సగటు హిందువు చెమట చుక్క. ఆ నిధులకు ధర్మకర్తలుగా మాత్రమే మీరు ఉన్నారు. ఈ విరాళాల లెక్కల్లో ఏ చిన్న లోపం జరిగినా, అది దేవుడికి చేసిన ద్రోహం మాత్రమే కాదు, హిందూ వ్యతిరేక శక్తులకు, వామపక్ష మేధావులకు మీ చేతులారా మీరే ఆయుధాలు అందించినట్లు అవుతుంది.

ఈ వివాదంలో హిందూ సమాజం రెండు విషయాలపై అత్యంత స్పష్టంగా ఉంది. ఒకటి: హిందూ వ్యతిరేక శక్తులు, ప్రతిపక్షాలు ఈ సాకుతో రామ మందిరాన్ని, సనాతన ధర్మాన్ని కించపరచాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రెండు: ట్రస్ట్ నిర్వాహకులు వెంటనే బహిరంగ విచారణ జరిపించి, ఈ కుంభకోణంలో ఎంతటి వారున్నా సరే వారిని కటకటాల వెనక్కి నెట్టాలి. భక్తుల సొమ్ముకు పైసా పైసా లెక్క చెప్పాల్సిందే! ధర్మ సంస్థల్లో అవినీతికి చోటు లేదు, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలకు అంతకంటే చోటు లేదు!

The post అయోధ్య రామ మందిరంపై “సెక్యులర్” రాబందుల వాలకం! విరాళాల వివాదం వెనుక దాగున్న అసలు కుట్ర ఇదే! appeared first on Journalist Sirisha.

హిందూ ధర్మంపై రమణానంద మహర్షి విష ప్రయోగం.. శృతి మించుతున్న అహంకారం!
ఆధ్యాత్మిక ముసుగులో, సిద్ధ గురువు అనే అహంకారంతో సనాతన ధర్మంపై కొందరు చేస్తున్న దాడి హిందూ సమాజం రక్తాన్ని మరిగిస్తోంది. పీఠాధిపతులు, ప్రవచనకర్తలపై నోరు పారేసుకోవడమే పనిగా పెట్టుకున్న గూడూరు వెంకటరమణయ్య అలియాస్ రమణానంద మహర్షి అసలు రంగు మరోసారి బయటపడింది. షిరిడీ సాక్షిగా ఆయన చేసిన అత్యంత దారుణమైన చర్య ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో పెను సంచలనంగా మారింది. ‘వైదిక హవనం’ అనే పవిత్రమైన పేరుతో ఆయన నిర్వహించిన క్రతువులో పఠించిన మంత్రాలు వింటే ఏ హిందువుకైనా ఆగ్రహం కట్టలు తెంచుకోవడం ఖాయం. ఒక వైదిక హోమంలో “ముస్లిం పదార్థ వాచకః, అల్లా మాలిక్ సుభాషితః, ఖురాన్ జ్ఞాన ప్రబోధకః, సూచిస్తహార ఇమాం బృష స్వాహా” అంటూ అన్యమత గ్రంథాలను, పదాలను జోడించి ఆయన స్వాహాకారాలు సమర్పించడం ఆయన పైశాచికత్వానికి పరాకాష్ట. సాయిబాబాను సర్వమత సమ్మేళనంగా ఆరాధించడం భక్తుల వ్యక్తిగత విశ్వాసం కావచ్చు, కానీ సాక్షాత్తు వేద మంత్రాలతో దేవతలకు హవిస్సులు అర్పించే అతి పవిత్రమైన యజ్ఞగుండంలో ఖురాన్, అల్లా పేర్లతో మంత్రాలు చదవడం ద్వారా ఆయన హిందూ ధర్మానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఒకప్పుడు సనాతన ధర్మానికి, సాయిబాబాకు సంబంధం లేదని వాదించిన ఈ మహానుభావుడే.. ఈరోజు అదే వైదిక హోమం పేరుతో ఈ రకమైన మలినమైన శ్లోకాలను చదవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం.

వేదాల్లోనే అరవై వేల తప్పులు పట్టానని ప్రగల్భాలు పలికే ఈ ‘స్వయం ప్రకటిత’ మహర్షి అజ్ఞానం ఎలాంటిదో ఆయన రాసిన ఈ నాలుగు లైన్ల శ్లోకమే స్పష్టం చేస్తోంది. యతి, ప్రాస, ఛందస్సు, అర్థం, పరమార్థం ఏవీ లేకుండా ఇష్టం వచ్చినట్లు రాసిన పదాలను మంత్రాలుగా చదువుతున్న ఆయనకు కనీస సంస్కృత పరిజ్ఞానం లేదన్నది సుస్పష్టం. అసలు ఆయన అజ్ఞానం కేవలం హోమాలకే పరిమితం కాలేదు. పితృ తర్పణాల పేరుతో ఆయన చేసిన వ్యవహారం చూస్తే శాస్త్రం తెలిసిన ఏ పండితుడైనా నివ్వెరపోవాల్సిందే. తర్పణాలు వదిలేటప్పుడు జంధ్యాన్ని అపసవ్యంగా వేసుకోవాలి, ఉత్తరీయాన్ని నడుముకు కట్టాలి, ఆభరణాలు తీసివేయాలి అనే కనీస ధర్మ సూక్ష్మాలు కూడా ఈ సిద్ధ గురువుకు తెలియవు. అంతకంటే దారుణం.. తాను బతికి ఉండగానే తన పూర్వీకులకు తన కూతురి చేత సంకల్పం చెప్పించడం, వంశ వృక్షంలో నానమ్మ, ముత్తమ్మ వరుసలను సైతం తప్పుగా కలపడం. తాత భార్య స్థానంలో అవ్వ వాళ్ళ అమ్మను తెచ్చిపెట్టిన ఇతని అజ్ఞానాన్ని చూసి హిందూ సమాజం తీవ్రంగా అసహ్యించుకుంటోంది.

తన అజ్ఞానాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే శిష్యుల చేత బూతులు తిట్టిస్తూ, ఇతర పీఠాధిపతులపై దాడికి దిగే ఈ మహర్షి అహంకారానికి ఎట్టకేలకు న్యాయస్థానం బ్రేకులు వేసింది. దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇతరులను కించపరిచేలా ఉన్న ఆ వీడియోలన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు, యూట్యూబ్ కు, స్వయంగా రమణానంద మహర్షికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర మతాలను కించపరచాల్సిన పనిలేదు, అలాగని హిందూ సనాతన ధర్మం యొక్క మూలాలను దెబ్బతీసే ఇలాంటి పైశాచిక, అజ్ఞానపూరిత చర్యలను సహించే ప్రసక్తే లేదు. పవిత్రమైన వైదిక క్రతువుల పేరుతో హిందువుల మనోభావాలను దారుణంగా గాయపరిచిన రమణానంద మహర్షి తక్షణమే యావత్ హిందూ జాతికి బేషరతుగా క్షమాపణలు చెప్పితీరాల్సిందే. లేనిపక్షంలో ఆయన చేస్తున్న ఈ ధర్మ విరుద్ధ చర్యలపై హిందూ సమాజం కన్నెర్ర చేయడం ఖాయం.

The post హిందూ ధర్మంపై రమణానంద మహర్షి విష ప్రయోగం.. శృతి మించుతున్న అహంకారం! appeared first on Journalist Sirisha.