KTR Archives - Journalist Sirisha

తమ తప్పులు మరచి నీతులు చెబుతున్న కేటీఆర్: నాటి పేపర్ లీకేజీలు, ఇంటర్ విద్యార్థుల బలిదానాలు గుర్తులేవా?
గత ప్రభుత్వ హయాంలో జరిగిన వరుస పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణ వైఫల్యాలను పూర్తిగా విస్మరించి, ప్రస్తుత పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు’ అన్న చందంగా ఆయన తీరు ఉందని పలువురు మండిపడుతున్నారు. తెలంగాణ చరిత్రలోనే సంచలనాత్మకమైన 2023 మార్చి నాటి టీఎస్‌పీఎస్సీ (TSPSC) కుంభకోణంలో సుమారు 15 పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం వేలాది మంది నిరుద్యోగులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. దీనికి తోడు విద్యుత్ శాఖ (TSPDCL/TSNPDCL) అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష, అలాగే టెన్త్ పబ్లిక్ పరీక్షల సమయంలో హిందీ, తెలుగు ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా బయటకు రావడం అప్పట్లో విద్యావ్యవస్థ డొల్లతను బట్టబయలు చేశాయి. ఈ చేదు నిజాలను కేటీఆర్ అంత సులభంగా ఎలా మర్చిపోయారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

వీటితో పాటు 2019 ఏప్రిల్ లో వెల్లడించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన తీవ్ర మూల్యాంకన తప్పిదాలు రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన విషయం విధితమే. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల కారణంగా సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తప్పుగా ఫలితాలు రావడంతో దాదాపు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న అనామిక లాంటి విద్యార్థిని, తీరా రీ-వెరిఫికేషన్‌లో పాస్ అయినట్లు తేలడం నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. తమ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థుల పాలిట ప్రాణసంకటంగా మారిన ఇన్ని వైఫల్యాలను పూర్తిగా పక్కనపెట్టి, ఇప్పుడు కేటీఆర్ కొత్తగా నీతులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

The post తమ తప్పులు మరచి నీతులు చెబుతున్న కేటీఆర్: నాటి పేపర్ లీకేజీలు, ఇంటర్ విద్యార్థుల బలిదానాలు గుర్తులేవా? appeared first on Journalist Sirisha.

సిరిసిల్లలో బద్దలవుతున్న కేటీఆర్ కంచుకోట..? పగబట్టిన రేవంత్, ఎటాక్ మోడ్‌లో బండి.. 2028లో సంచలనం తప్పదా?
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం అనగానే రాష్ట్ర రాజకీయాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు కల్వకుంట్ల తారక రామారావు. వరుసగా ఐదుసార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, సిరిసిల్లను తన కంచుకోటగా మార్చుకున్నారు కేటీఆర్. అయితే, దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావడంతో స్థానిక రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారుతోంది. ఇన్నాళ్లూ ఒకే నాయకుడు ఉండటం, ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి మందగించిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మార్పు కోసం జనాలు ఎదురుచూస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేటీఆర్ చుట్టూ ఇప్పుడు ఎన్నడూ లేనంతగా రాజకీయ ఉచ్చు బిగుస్తోందని, రాబోయే 2028 ఎన్నికల్లో ఆ కంచుకోట బద్దలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో కేటీఆర్ కు ఎదురుకాబోతున్న అతిపెద్ద సవాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి అప్పటి అధికార పార్టీగా బీఆర్ఎస్ పన్నిన వ్యూహాలు, ప్రయోగించిన అస్త్రాలు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆనాటి అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు రేవంత్ రెడ్డి సిరిసిల్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఎలాగైనా సరే కేటీఆర్ ను ఆయన సొంత గడ్డపైనే ఓడించి తీరాలనే కసితో కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. దీనికోసం సిరిసిల్లలో క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, సరైన సమయం చూసి ఒక బలమైన నాయకుడిని కేటీఆర్ పై బరిలోకి దింపేందుకు పక్కా మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

దీనికి తోడు స్థానిక ఎంపీ, భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ తో నడుస్తున్న ఆధిపత్య పోరు కేటీఆర్ కు మరో పెద్ద తలనొప్పిగా మారింది. బండి సంజయ్ ను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఎదుర్కోలేక.. ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పదే పదే విమర్శలు చేయడం, సోషల్ మీడియా వేదికగా వారిపై ఫేక్ నెరేటివ్స్ రన్ చేయడం లాంటివి కేటీఆర్ కు ప్రతికూలంగా మారుతున్నాయని లోకల్ టాక్. రాజకీయ పోరాటాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం పట్ల సామాన్య ప్రజల్లోనూ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో ప్రజల సానుభూతిని బండి సంజయ్ వైపు మళ్లేలా చేస్తూ, కేటీఆర్ పై మరింత వ్యతిరేకతను పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిణామం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉంది.

ఇక కేటీఆర్ వ్యవహార శైలి కూడా ఆయన పునాదులకే ఎసరు తెస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపే పనిలో బిజీగా ఉన్న కేటీఆర్.. అదే సమయంలో తన సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న అపవాదు మూటగట్టుకుంటున్నారు. వరుసగా ఇన్ని విజయాలు అందించిన నాయకుడు ఇప్పుడు స్థానిక సమస్యల పరిష్కారానికి, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం జనాల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. రాష్ట్రమంతా తిరుగుతూ సొంత ఇలాకాను పట్టించుకోకపోతే అసలుకే మోసం వస్తుందని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో గతంలో జరిగిన ‘నేరెళ్ల’ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాలు ఎన్నికల నాటికి మళ్లీ తెరపైకి వచ్చి ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేటీఆర్ కు స్థానికంగా ఎంత అనుచరగణం ఉన్నప్పటికీ, యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ మళ్లీ బరిలోకి దిగితే పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారతాయి. అటు కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి, ఇటు బీజేపీ నుంచి రాణి రుద్రమ బరిలో ఉంటే సిరిసిల్లలో ముక్కోణపు పోరు తథ్యం. ఒకవైపు రేవంత్ రెడ్డి రివెంజ్ ప్లాన్, మరోవైపు బండి సంజయ్ కౌంటర్ ఎటాక్, వీటికి తోడు స్థానికంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత.. ఇవన్నీ ఇలాగే కొనసాగితే 2028లో కేటీఆర్ వరుస విజయాలకు బ్రేక్ పడి ఆయన ఓటమి చవిచూడటం ఖాయమని విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే, నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా, అంతిమంగా ఓటరు నాడి ఎలా ఉందో, వారి హృదయాల్లో ఏముందో ఎన్నికల ఫలితాలే స్పష్టం చేయనున్నాయి.

The post సిరిసిల్లలో బద్దలవుతున్న కేటీఆర్ కంచుకోట..? పగబట్టిన రేవంత్, ఎటాక్ మోడ్‌లో బండి.. 2028లో సంచలనం తప్పదా? appeared first on Journalist Sirisha.

బండి సంజయ్ పై తప్పుడు ప్రచారాలకు చెక్.!. బేతి మహేందర్ రెడ్డిపై జనసేన వేటు!
హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లక్ష్యంగా జరుగుతున్న కుట్రలు, సోషల్ మీడియా దుష్ప్రచారాలకు బ్రేక్ పడింది. గత కొంతకాలంగా వ్యక్తిగత కక్షతో కేంద్ర మంత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బేతి మహేందర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు గాను మహేందర్ రెడ్డిని పార్టీ నుంచి కొంతకాలం పాటు దూరంగా ఉంచుతున్నట్లు తెలంగాణ జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.

అసలేం జరిగింది?
గతంలో కార్పొరేటర్ టికెట్ దక్కలేదనే అక్కసుతో బేతి మహేందర్ రెడ్డి.. బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పలు యూట్యూబ్ ఛానళ్లలో ఇష్టానుసారం మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న బండి సంజయ్ అల్లుడిని టార్గెట్ చేస్తూ ‘ఐ-న్యూస్’ (I News) తో పాటు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్ల వేదికగా ఒక ఫేక్ న్యూస్ ను వ్యూహాత్మకంగా సర్క్యులేట్ చేశారు. అయితే, ఆ వార్త పూర్తిగా అవాస్తవమని తేలడం, అడ్డంగా దొరికిపోతామనే భయంతో సదరు ఛానళ్లు వెంటనే ఆ వీడియోలను తొలగించాయి.

వెలుగులోకి కుట్ర కోణం..
ఈ ఫేక్ న్యూస్ ప్రచారం వెనుక పెద్ద కుట్ర కోణమే దాగి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు వ్యవహారశైలి తరహాలోనే.. ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ (BRS) వర్గాలు ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, ఆ తర్వాత డిలీట్ చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో బేతి మహేందర్ రెడ్డి కూడా వారితో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ, జర్నలిస్ట్ తిరుపతి మాట్లాడిన ఒక ఆడియో కాల్ రికార్డ్ బయటకు రావడం ఈ కుట్రను మరింత బట్టబయలు చేసింది.

మిత్రధర్మం పాటించిన జనసేన..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏలో (NDA) కీలక మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ.. తెలంగాణలోనూ అదే బాధ్యతను, క్రమశిక్షణను ప్రదర్శించింది. “వ్యక్తిగత విభేదాలను పార్టీకి ముడిపెడితే ఉపేక్షించేది లేదు” అంటూ తెలంగాణ రాష్ట్ర జనసేన ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. మహేందర్ రెడ్డిపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో, నిజానిజాలు తేలేవరకు ఆయనను పార్టీకి దూరంగా ఉంచుతున్నట్లు సస్పెన్షన్ వేటు వేశారు. ఒక కేంద్ర మంత్రిపై ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతూ, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వ్యక్తిపై జనసేన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల బీజేపీ శ్రేణులు, బండి సంజయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేసేవారికి చట్టపరంగా కూడా శిక్ష తప్పదనే హెచ్చరికలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

The post బండి సంజయ్ పై తప్పుడు ప్రచారాలకు చెక్.!. బేతి మహేందర్ రెడ్డిపై జనసేన వేటు! appeared first on Journalist Sirisha.

మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా?
బండి సంజయ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న క్యాడర్ – వణుకుతున్న ప్రత్యర్థులు!

–గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రం శిరీష జర్నలిస్ట్..

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ వ్యూహకర్త నితిన్ నబి రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయడం వెనుక అతిపెద్ద రాజకీయ ఆంతర్యం దాగి ఉంది. కేవలం నాయకులను కలవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికల రణరంగానికి సమాయత్తం చేయడమే ఢిల్లీ పెద్దల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

యోధులున్నారు.. కానీ సమన్వయమేదీ?

తెలంగాణలో బీజేపీకి ఉన్న బలమైన నాయకత్వం మరే పార్టీకి లేదు. ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లాంటి నాయకులతో పార్టీ క్యాడర్ ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల అగ్రెసివ్ యోధులు.

అయితే, ఇంతటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ పార్టీలో ‘ఈగో వార్స్’ నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అసలైన, ఏకైక రాజకీయ శత్రువుగా బీజేపీనే పరిగణిస్తున్నాయి. కమల దళం బలపడితే తమ ఉనికి గల్లంతవుతుందనే భయం ఆ రెండు పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జతెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం అంత సులువు కాదు. ఆరు దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే నిర్దాక్షిణ్యంగా ఫామ్ హౌస్‌కు పరిమితం చేసిన చరిత్ర తెలంగాణ ఓటర్లది. అలాంటి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసాధ్యమైన హామీలు ఇప్పుడు ఆ పార్టీకే ఉరితాడుగా మారుతున్నాయి.

100 రోజుల్లో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, ఇప్పుడు ప్రజలకు మొండిచేయి చూపుతోంది:

హైడ్రా పేరుతో విధ్వంసం: అక్రమాల కూల్చివేతల పేరుతో సామాన్యులను, పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల కన్నీటి ఉసురు పోసుకుంటోంది.

రైతాంగానికి ద్రోహం: గిట్టుబాటు ధరల ఊసే లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రెండు లక్షల రుణమాఫీ’ సగంలోనే ఆగిపోయి రైతులను రోడ్డున పడేసింది.

మహిళలు, వృద్ధులకు దగా: పెన్షన్లు పెంచుతామని ఆశపెట్టి ఇప్పుడు నిధులు లేవని దాటవేస్తున్నారు.

కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం: ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఈ హామీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కనీసం గుర్తుకూడా లేదు.

విద్యార్థినులకు స్కూటీలు: ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

బడుగు, బలహీన వర్గాలకు మోసం: బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి విస్మరించారు. దళిత బంధుకు అదనంగా మరో ఐదు లక్షలు కలిపి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఆశపెట్టి దళితుల ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఆ వర్గాలన్నీ రగిలిపోతున్నాయి.

తెలంగాణ సాధన కోసం సకల జనులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కూడా ఇదే తరహాలో అన్ని వర్గాలూ ఏకమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కుటుంబ రాజకీయాలతో చతికిలబడ్డ బీఆర్ఎస్

మరోవైపు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. కేటీఆర్, హరీష్ రావు, అప్పుడప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సభలు పెడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, జనాలు ఆ కుటుంబ పాలనను, వారి మాటలను నమ్మే స్థితిలో లేరు. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తూ, తెలంగాణకు అసలైన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల ముందు నిలబడుతోంది.

గల్లీ నుంచి సిటీ వరకు.. చాప కింద నీరులా కాషాయ దళం

క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ ఊహించని స్థాయిలో బలపడింది. బూత్ స్థాయి కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించడం పార్టీ విస్తరణకు నిదర్శనం. నిజామాబాద్ లాంటి చోట్ల అధికార పార్టీల కుటిల రాజకీయాల వల్లే మేయర్ పీఠాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, వారి పోరాట పటిమను తక్కువ అంచనా వేయలేం. తెలంగాణ వ్యాప్తంగా కాషాయ రంగు చాప కింద నీరులా కాదు, ఏకంగా ఒక సునామీలా విస్తరిస్తోంది.

జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్లు.. బండి సంజయ్ మాస్ వార్నింగ్

అధికారంలోకి రావాలంటే పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడం కీలకం. ఇప్పుడు బీజేపీ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ (GHMC), గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలే. నితిన్ నబి సమక్షంలో నిన్న జరిగిన సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

“వరంగల్ కార్పొరేషన్ వర్సెస్ హైదరాబాద్ కార్పొరేషన్.. ఎవరికి ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా..!” అంటూ ఆయన విసిరిన సవాల్ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. “మనకు గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది.. వాళ్లకు శిక్షణ ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దుతాం” అని బండి సంజయ్ చేసిన ప్రకటన బీజేపీ భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది.

ప్రధాని సభలో బండికే బ్రహ్మరథం.. సీఎం అభ్యర్థి ఆయనేనా?

నాయకుడికి జనాదరణ ఉంటే క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ స్పష్టం చేసింది. మోడీ సభకు బండి సంజయ్ రాగానే క్యాడర్ చూపించిన జోష్, ఇచ్చిన స్వాగతం చూస్తే.. తెలంగాణ భవిష్యత్ సీఎం ఆయనే అన్నంతగా వాతావరణం మార్మోగిపోయింది.

అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి ఇస్తేనే..!

అధికార రాజకీయాల్లో ఎత్తుగడలు సాధారణమే. కానీ బీజేపీకి ఉన్న అతిపెద్ద బలం దాని కార్యకర్తలు. ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వ సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న నిస్వార్థ సైనికులు వారు. “మా తాత చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తుందని, మా నాన్న చెప్పారు వస్తుందని.. కానీ ఈసారి కచ్చితంగా రామరాజ్యం వస్తుంది” అనే ప్రగాఢ విశ్వాసంతో వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

కానీ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోని కొందరు నాయకుల ఈగో వార్స్, తప్పుడు రిపోర్టుల వల్లే అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే.. బండి సంజయ్‌ను ఆరోజు తప్పించడం వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, ఆ ఒక్క తప్పు వల్లే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సామాన్యులు చెప్పే నిజం!

కార్యకర్తల మనోభావాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తుల మధ్య ఈగోలను పక్కనబెట్టి, క్యాడర్‌కు గౌరవం దక్కాలంటే.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ కుమార్‌కు రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలి. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని పొలిటికల్ అనలిస్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరి ఢిల్లీ పెద్దలు గ్రౌండ్ రియాలిటీని గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తారా? బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి!

The post మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా? appeared first on Journalist Sirisha.

నాప్తోల్ పాలిటిక్స్: కేసీఆర్ ఒరిజినల్ కారు ముందు కవిత గారి ‘డూప్లికేట్ సేన’ ఆగుతుందా?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ‘నాప్తోల్ పాలిటిక్స్’. టీవీల్లో ఉదయం ఒక ఆఫర్, సాయంత్రం ఒక ఆఫర్ ప్రకటించినట్లు.. ఇప్పుడు గల్లీకో కొత్త పార్టీ పుట్టుకొస్తోంది. దశాబ్దానికి పైగా తెలంగాణ రాజకీయాలను శాసించిన, ఇంకా శాసిస్తున్న ఒరిజినల్ బ్రాండ్ బీఆర్ఎస్ మీద అలిగి, సొంత కూతురు కల్వకుంట్ల కవిత గారు ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో కొత్త దుకాణం తెరవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా, అంతకంటే ఎక్కువ కామెడీగా మారింది.

పాత వస్తువుకి కొత్త స్టిక్కర్

ఒకప్పుడు కారు పార్టీలో కీలకంగా వ్యవహరించి, పదవులు అనుభవించి, ఇప్పుడు ఆ కారు టైర్ల కిందే మేకులు చల్లుతాను అనడం కవిత గారి పొలిటికల్ కామెడీ టైమింగ్ కి నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తుంటే, తాను మాత్రం మళ్ళీ లోకల్ పాలిటిక్స్ అంటూ పాత టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పేరును పోలి ఉండేలా ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని షార్ట్ కట్ లో నామకరణం చేయడం చూసి జనాలు పగలబడి నవ్వుకుంటున్నారు. నాప్తోల్ లో పాత బ్రాండ్ కు కొత్త స్టిక్కర్ వేసి అమ్మినట్టుంది ఈ కొత్త పార్టీ వ్యవహారం అని రాజకీయ విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు.

ఆనాడు వైఎస్సార్టీపీ.. ఈనాడు సేన..

గతంలో వైఎస్ షర్మిల గారు కూడా సరిగ్గా ఇలాగే ‘వైఎస్సార్టీపీ’ అనే నాప్తోల్ బంపర్ ఆఫర్ లాంటి పార్టీని తెలంగాణలో లాంచ్ చేశారు. ఊరంతా పాదయాత్రలు చేసి, గొంతు చించుకుని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. చివరికి ఏమైంది? స్టాక్ క్లియరెన్స్ సేల్ అయిపోయినట్టు ఆ పార్టీ బోర్డును తీసుకువెళ్లి పక్క రాష్ట్రంలో పడేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత గారు స్థాపించిన ఈ కొత్త పార్టీ పరిస్థితి కూడా రేపు పొద్దున అలాగే కాబోతోందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.

ఒరిజినల్ ముందు డూప్లికేట్ పప్పులు ఉడుకుతాయా?

నాప్తోల్ లో ఎన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ వచ్చినా, కేసీఆర్ గారు నిర్మించిన ఒరిజినల్ బ్రాండ్ రేంజ్ వేరు. బీఆర్ఎస్ అనే మహా వృక్షం కింద ఎదిగి, ఇప్పుడు ఆ చెట్టు కొమ్మలే నరుకుతాను అంటే అది కేవలం మీమ్స్ కి, సోషల్ మీడియా ట్రోల్స్ కి పనికొస్తుంది తప్ప ఓట్ల మైలేజ్ కి ఏమాత్రం పనికిరాదు. ఒరిజినల్ రెసిపీ కేసీఆర్ గారి దగ్గర పెట్టుకుని, కవిత గారు బయటకొచ్చి డూప్లికేట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడితే జనాలు ఎందుకు వెళ్తారు?

మొత్తం మీద, బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ని కదపడం ఇలాంటి డూప్లికేట్ పార్టీల వల్ల అయ్యే పని కాదని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. సొంత పార్టీ మీద అలిగి కొత్త పార్టీ పెడితే, అది రాజకీయ వ్యూహం అనిపించుకోదు.. కేవలం నాప్తోల్ మెగా సేల్ మాత్రమే అవుతుందని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు.

The post నాప్తోల్ పాలిటిక్స్: కేసీఆర్ ఒరిజినల్ కారు ముందు కవిత గారి ‘డూప్లికేట్ సేన’ ఆగుతుందా? appeared first on Journalist Sirisha.

బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సిద్ధమైన కేసీఆర్ – కీలక జిల్లాల నేతలతో వ్యూహాత్మక సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 5:

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న బహుజన రాజకీయ సమితి (బీఆర్ఎస్) తన 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న రజతోత్సవ మహాసభను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల ప్రముఖ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశం బీఆర్ఎస్ రాబోయే రాజకీయ ప్రణాళికకు, కార్యకర్తల సమీకరణకు, రాకపోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ముఖ్యమైన వ్యూహాత్మక ముందడుగుగా భావించబడుతోంది. సమావేశంలో పాల్గొన్న నేతలు రజతోత్సవ సభ విజయవంతానికి తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించగా, జిల్లా వారీగా ప్రజా స్పందన, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ముచ్చటించారు.

సమావేశానికి హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో పార్టీకి ఉన్న మద్దతు, స్థానికంగా పార్టీ కార్యక్రమాల ప్రభావం, కార్యకర్తల చొరవ వంటి అంశాలపై విపులంగా వివరించారు. ఆయన మాట్లాడుతూ,

“రజతోత్సవ సభ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది బీఆర్ఎస్ రాజకీయ పునరుత్థానానికి మైలురాయిగా నిలవాలి. పార్టీ ఆవిర్భావ లక్ష్యాలను, సాధించిన విజయాలను ప్రజలతో పునరుద్ఘాటించే వేదికగా దీనిని తీర్చిదిద్దాలి,” అని అన్నారు.

కేసీఆర్ తన ప్రసంగంలో, గత రెండు దశాబ్దాల బీఆర్ఎస్ పయనాన్ని తలుచుకుంటూ, ఉద్యమ కాలం నుండి అధికారంలోకి వచ్చిన ప్రయాణాన్ని సమీక్షించారు.

“తెలంగాణ సాధనతో ప్రారంభమైన మా యాత్ర, అభివృద్ధి, స్వాభిమానం, సంక్షేమం అనే మూడూ స్తంభాలపై ముందుకు సాగింది. రాబోయే రోజుల్లో ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ, పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ సభను నిర్వహిస్తున్నాం,” అని ఆయన స్పష్టం చేశారు.

రజతోత్సవ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని, బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సభ ద్వారా పార్టీ, తమ రాజకీయ దిశను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలన్నదే ముఖ్య ఉద్దేశం.

పార్టీ కార్యకర్తలకు ఇది నూతన ఉత్సాహాన్ని అందించనుందని, తిరిగి ప్రజల మద్దతు పొందే ప్రయత్నానికి ఇది ప్రారంభ మైలురాయి కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో సమావేశాలు, సమీక్షలు, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కార్యాచరణ ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి.

మహాసభ ద్వారా పార్టీకి ప్రాణం పోసేలా, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేలా సమిష్టిగా ముందుకు సాగాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మహాసభ అనంతరం బీఆర్ఎస్ మరింత ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకు వెళ్లే అవకాశముందని, మళ్లీ ప్రబలమైన ప్రత్యామ్నాయంగా నిలవగలదని పర్యవేక్షకులు భావిస్తున్నారు.

The post బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సిద్ధమైన కేసీఆర్ – కీలక జిల్లాల నేతలతో వ్యూహాత్మక సమీక్ష appeared first on Journalist Sirisha.

KTR And Revanth Reddy’s Secret Friendship Exposed?
Congress and BRS Leaders Unite at DMK Event, Sparking Controversy
Chennai, Tamil Nadu

A recent meeting organized by the DMK party in Tamil Nadu has ignited a political firestorm, with allegations of a “secret friendship” between Congress and Bharat Rashtra Samithi (BRS) leaders from Telangana. Critics argue the event reveals a clandestine alliance aimed at undermining the Bharatiya Janata Party (BJP) ahead of impending delimitation discussions.

Sources claim the gathering was more than just a friendly meet-and-greet, accusing the parties of conspiring to exploit linguistic and regional differences for political gain. Accusations have been leveled that this is a calculated move to distract from alleged corruption, including the ongoing liquor scam investigations.

“They are conspiring to provoke linguistic… regional differences between the people in order to suck people’s money and prevent it from coming out in many issues like the liquor scam,” alleged sources familiar with the situation.

Adding fuel to the fire, the DMK’s controversial stance on Hinduism has drawn sharp criticism. The presence of Congress and BRS leaders at the event has been interpreted as a tacit endorsement of the DMK’s views, leading to accusations of anti-Hindu sentiment. “If we see the BRS Congress joining hands with the DMK, which constantly makes statements against Hindus that it will permanently eradicate Sanatana Dharma, it becomes clear what their policy is towards Hindus,” critics stated.

The timing of the meeting, coinciding with the Central Government’s impending delimitation guidelines, has also raised eyebrows. While opponents acknowledge the right to express objections democratically, they condemn the meeting as a clandestine effort to damage the BJP politically. They claim it’s a desperate attempt to divert attention from alleged corrupt practices.

“Like pumpkin thieves, they have organized these meaningless meetings as part of a conspiracy to politically damage the BJP in order to cover up their corrupt dealings and this time they have exposed the secret love they have shown for each other for so many years,” a source declared.

The controversy erupts as Prime Minister Narendra Modi pushes forward with his vision for a developed India. Detractors argue that parties like Congress, BRS, and DMK, driven by hidden agendas, are actively working to sow division among the people along linguistic and regional lines.

The unfolding situation is being closely watched by the public in Telangana, who are reportedly becoming increasingly aware of these alleged political machinations. The long-term impact of this apparent alliance remains to be seen, but it has undoubtedly injected a new level of complexity into the political landscape.

The post KTR And Revanth Reddy’s Secret Friendship Exposed? appeared first on Journalist Sirisha.