బండి సంజయ్ Archives - Journalist Sirisha

తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకే!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో, తెలంగాణ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపుతూ.. పార్టీలోని ఇద్దరు కీలక ప్రజాదరణ కలిగిన నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలకు పార్టీ అధిష్టానం శాశ్వత ముగింపు పలికింది. వీరిద్దరూ ఏకతాటిపైకి రావడంతో అధికార కాంగ్రెస్, ఉనికి కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్ (BRS) శిబిరాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

కలిసికట్టుగా కమలనాథులు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో, సీనియర్ నేత ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నివాసంలో జరిగిన కీలక సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. ఓ వైపు హిందూత్వ అజెండాతో యువతలో, ప్రజల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా చెరగని ముద్ర వేసిన బండి సంజయ్, మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ వర్గాల్లో బలమైన పట్టున్న ఈటల రాజేందర్.. ఇద్దరూ చేతులు కలపడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. “మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మా అంతిమ లక్ష్యం తెలంగాణలో రామరాజ్యం స్థాపించడమే, పేదల సంక్షేమమే” అని వీరిద్దరూ స్పష్టం చేయడం కింది స్థాయి కార్యకర్తల్లో నయా జోష్ నింపింది.

కాంగ్రెస్ అరాచక పాలనపై అసహనం.. సమావేశం అనంతరం బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని, ప్రజలు ఈ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయారని జర్నలిస్టులు, విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

కనుమరుగవుతున్న బీఆర్ఎస్.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే! ఇక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోనే కేసీఆర్ పార్టీని తెలంగాణ సమాజం శాశ్వతంగా పాతాళానికి తొక్కింది. అవినీతి, అహంకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గులాబీ పార్టీకి ఇక తెలంగాణలో భవిష్యత్తు శూన్యం. బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.

ఈ రాజకీయ శూన్యతను పూరిస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, దేశభక్తి ఎజెండాకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండి సంజయ్ దూకుడు, ఈటల రాజేందర్ వ్యూహచతురత, కిషన్ రెడ్డి అనుభవం, లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో తెలంగాణ కమలదళం అజేయ శక్తిగా ఆవిర్భవించింది.

“సింహాలు రెండు కలిస్తే వేట ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూస్తారు” అన్నట్లుగా తెలంగాణ బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కుటుంబ పార్టీ బీఆర్ఎస్‌ను పూర్తిగా బొందపెట్టి.. కాషాయ జెండాను గోల్కొండ కోటపై ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, ఆపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం తథ్యం అని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

The post తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకే! appeared first on Journalist Sirisha.

మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా?
బండి సంజయ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న క్యాడర్ – వణుకుతున్న ప్రత్యర్థులు!

–గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రం శిరీష జర్నలిస్ట్..

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ వ్యూహకర్త నితిన్ నబి రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయడం వెనుక అతిపెద్ద రాజకీయ ఆంతర్యం దాగి ఉంది. కేవలం నాయకులను కలవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికల రణరంగానికి సమాయత్తం చేయడమే ఢిల్లీ పెద్దల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

యోధులున్నారు.. కానీ సమన్వయమేదీ?

తెలంగాణలో బీజేపీకి ఉన్న బలమైన నాయకత్వం మరే పార్టీకి లేదు. ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లాంటి నాయకులతో పార్టీ క్యాడర్ ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల అగ్రెసివ్ యోధులు.

అయితే, ఇంతటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ పార్టీలో ‘ఈగో వార్స్’ నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అసలైన, ఏకైక రాజకీయ శత్రువుగా బీజేపీనే పరిగణిస్తున్నాయి. కమల దళం బలపడితే తమ ఉనికి గల్లంతవుతుందనే భయం ఆ రెండు పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జతెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం అంత సులువు కాదు. ఆరు దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే నిర్దాక్షిణ్యంగా ఫామ్ హౌస్‌కు పరిమితం చేసిన చరిత్ర తెలంగాణ ఓటర్లది. అలాంటి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసాధ్యమైన హామీలు ఇప్పుడు ఆ పార్టీకే ఉరితాడుగా మారుతున్నాయి.

100 రోజుల్లో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, ఇప్పుడు ప్రజలకు మొండిచేయి చూపుతోంది:

హైడ్రా పేరుతో విధ్వంసం: అక్రమాల కూల్చివేతల పేరుతో సామాన్యులను, పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల కన్నీటి ఉసురు పోసుకుంటోంది.

రైతాంగానికి ద్రోహం: గిట్టుబాటు ధరల ఊసే లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రెండు లక్షల రుణమాఫీ’ సగంలోనే ఆగిపోయి రైతులను రోడ్డున పడేసింది.

మహిళలు, వృద్ధులకు దగా: పెన్షన్లు పెంచుతామని ఆశపెట్టి ఇప్పుడు నిధులు లేవని దాటవేస్తున్నారు.

కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం: ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఈ హామీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కనీసం గుర్తుకూడా లేదు.

విద్యార్థినులకు స్కూటీలు: ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

బడుగు, బలహీన వర్గాలకు మోసం: బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి విస్మరించారు. దళిత బంధుకు అదనంగా మరో ఐదు లక్షలు కలిపి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఆశపెట్టి దళితుల ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఆ వర్గాలన్నీ రగిలిపోతున్నాయి.

తెలంగాణ సాధన కోసం సకల జనులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కూడా ఇదే తరహాలో అన్ని వర్గాలూ ఏకమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కుటుంబ రాజకీయాలతో చతికిలబడ్డ బీఆర్ఎస్

మరోవైపు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. కేటీఆర్, హరీష్ రావు, అప్పుడప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సభలు పెడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, జనాలు ఆ కుటుంబ పాలనను, వారి మాటలను నమ్మే స్థితిలో లేరు. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తూ, తెలంగాణకు అసలైన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల ముందు నిలబడుతోంది.

గల్లీ నుంచి సిటీ వరకు.. చాప కింద నీరులా కాషాయ దళం

క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ ఊహించని స్థాయిలో బలపడింది. బూత్ స్థాయి కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించడం పార్టీ విస్తరణకు నిదర్శనం. నిజామాబాద్ లాంటి చోట్ల అధికార పార్టీల కుటిల రాజకీయాల వల్లే మేయర్ పీఠాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, వారి పోరాట పటిమను తక్కువ అంచనా వేయలేం. తెలంగాణ వ్యాప్తంగా కాషాయ రంగు చాప కింద నీరులా కాదు, ఏకంగా ఒక సునామీలా విస్తరిస్తోంది.

జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్లు.. బండి సంజయ్ మాస్ వార్నింగ్

అధికారంలోకి రావాలంటే పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడం కీలకం. ఇప్పుడు బీజేపీ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ (GHMC), గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలే. నితిన్ నబి సమక్షంలో నిన్న జరిగిన సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

“వరంగల్ కార్పొరేషన్ వర్సెస్ హైదరాబాద్ కార్పొరేషన్.. ఎవరికి ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా..!” అంటూ ఆయన విసిరిన సవాల్ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. “మనకు గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది.. వాళ్లకు శిక్షణ ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దుతాం” అని బండి సంజయ్ చేసిన ప్రకటన బీజేపీ భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది.

ప్రధాని సభలో బండికే బ్రహ్మరథం.. సీఎం అభ్యర్థి ఆయనేనా?

నాయకుడికి జనాదరణ ఉంటే క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ స్పష్టం చేసింది. మోడీ సభకు బండి సంజయ్ రాగానే క్యాడర్ చూపించిన జోష్, ఇచ్చిన స్వాగతం చూస్తే.. తెలంగాణ భవిష్యత్ సీఎం ఆయనే అన్నంతగా వాతావరణం మార్మోగిపోయింది.

అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి ఇస్తేనే..!

అధికార రాజకీయాల్లో ఎత్తుగడలు సాధారణమే. కానీ బీజేపీకి ఉన్న అతిపెద్ద బలం దాని కార్యకర్తలు. ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వ సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న నిస్వార్థ సైనికులు వారు. “మా తాత చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తుందని, మా నాన్న చెప్పారు వస్తుందని.. కానీ ఈసారి కచ్చితంగా రామరాజ్యం వస్తుంది” అనే ప్రగాఢ విశ్వాసంతో వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

కానీ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోని కొందరు నాయకుల ఈగో వార్స్, తప్పుడు రిపోర్టుల వల్లే అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే.. బండి సంజయ్‌ను ఆరోజు తప్పించడం వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, ఆ ఒక్క తప్పు వల్లే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సామాన్యులు చెప్పే నిజం!

కార్యకర్తల మనోభావాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తుల మధ్య ఈగోలను పక్కనబెట్టి, క్యాడర్‌కు గౌరవం దక్కాలంటే.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ కుమార్‌కు రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలి. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని పొలిటికల్ అనలిస్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరి ఢిల్లీ పెద్దలు గ్రౌండ్ రియాలిటీని గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తారా? బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి!

The post మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా? appeared first on Journalist Sirisha.

టార్గెట్ తెలంగాణ: మోదీ ఇచ్చిన జోష్… బండి సంజయ్ అసలు వ్యూహం ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఏ నాయకుడికైనా అదనపు బలాన్నిస్తుంది. కానీ, ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న సమయంలో ఆ కలయిక రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ ప్రధాని మోదీని కలిసిన అనంతరం చేసిన వ్యాఖ్యలు కేవలం ఉద్వేగభరితమైనవి మాత్రమే కాదు.. తెలంగాణలో కమలం వికసించేలా చేయడానికి వేసిన పక్కా పొలిటికల్ స్కెచ్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

“కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు” అని బండి సంజయ్ చెప్పడం వెనుక ఒక బలమైన వ్యూహం దాగి ఉంది. కరీంనగర్ అనేది తెలంగాణలో బీజేపీకి ఒక బలమైన కోట. అక్కడ సాధించిన గెలుపును స్వయంగా ప్రధాని ప్రస్తావించారని చెప్పడం ద్వారా.. కిందిస్థాయి కార్యకర్తలు పడే కష్టాన్ని ఢిల్లీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారని క్యాడర్‌కు ఆయన ఒక స్పష్టమైన సందేశం పంపారు. ఇది పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది.

ఈ భేటీ ద్వారా తెలంగాణపై బీజేపీ అటెన్షన్ పెంచేలా బండి సంజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. “మోదీని కలిసిన ప్రతిసారీ కొత్త శక్తి, బాధ్యత పెరుగుతుంది” అన్న ఆయన మాటలు పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ ఒక ఇన్స్పిరేషన్. నాయకుడు యాక్టివ్‌గా ఉంటే క్యాడర్ ఆటోమేటిక్‌గా అగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తుందన్నది సుస్పష్టం. అలాగే, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి బీజేపీకి ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం ‘నరేంద్ర మోదీ’. “ప్రతి ఇంటికీ బీజేపీ మిషన్‌ను తీసుకెళ్లాలని మోదీ స్ఫూర్తినిచ్చారు” అని చెప్పడం ద్వారా, మోదీ బ్రాండ్‌ను నేరుగా గల్లీ స్థాయికి, సామాన్యుడి గడప తొక్కించే ప్రయత్నానికి ఆయన శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతోందని, కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రత్యర్థి పార్టీలకు మైండ్ గేమ్ ద్వారా పరోక్షంగా ఒక బలమైన సంకేతం పంపారు.

రాజకీయాల్లో ఏ మాటా యాదృచ్ఛికంగా రాదు. బండి సంజయ్ ప్రధానిని కలవడం, ఆ వెంటనే భావోద్వేగంతో పాటు బాధ్యతను గుర్తుచేస్తూ ప్రకటన చేయడం.. ఇదంతా తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజల్లో ఆసక్తిని అమాంతం పెంచే ఎత్తుగడే. మోదీ ఇచ్చిన ఉత్సాహంతో, “ప్రతి గడపకూ బీజేపీ” అనే నినాదాన్ని బండి సంజయ్ ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారో, అది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో

The post టార్గెట్ తెలంగాణ: మోదీ ఇచ్చిన జోష్… బండి సంజయ్ అసలు వ్యూహం ఇదే! appeared first on Journalist Sirisha.

కరీంనగర్ పీఠం కైవసం – ఫలించిన ‘బండి’ వ్యూహం! బెడిసికొట్టిన విపక్షాల ఎత్తుగడలు
(కరీంనగర్ – పొలిటికల్ బ్యూరో): కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ చదరంగంలో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తనదైన శైలిలో చక్రం తిప్పారు. విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో సంజయ్ సంపూర్ణ విజయం సాధించారు.

ముందస్తు పొత్తుల ప్రచారం – ఆత్మరక్షణలో విపక్షాలు
మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తెరవెనుక మంతనాలు జరిపినట్లు, అక్రమ పొత్తులకు సిద్ధమైనట్లు తొలుత వార్తలు గుప్పుమన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఆయా పార్టీలు, మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశాయి. అయితే, బండి సంజయ్ రంగప్రవేశంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

‘గేర్’ మార్చిన బండి – వెనక్కి తగ్గిన బీఆర్ఎస్
“కరీంనగర్ గడ్డపై బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే” అంటూ బండి సంజయ్ ప్రజల్లోకి తీసుకెళ్లిన వాదన విపక్షాలను ఇరకాటంలో పెట్టింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసి మేయర్ స్థానాన్ని దక్కించుకున్నా.. ఆ ప్రభావం రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై తీవ్రంగా పడుతుందని, ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతామని విపక్ష నేతల్లో భయం పట్టుకుంది. బండి సంజయ్ అగ్రెసివ్ పాలిటిక్స్ దెబ్బకు, పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ రేసు నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అభివృద్ధే ఎజెండా..
సరైన సమయంలో గేర్ మార్చి, రాజకీయ చతురతతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంతో కరీంనగర్ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇకపై కరీంనగర్ అభివృద్ధిలో నంబర్ వన్ గా నిలుస్తుందని, రాజకీయాలకు అతీతంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని నూతన మేయర్ ప్రమాణస్వీకారం అనంతరం ప్రకటించారు. మొత్తానికి బండి సంజయ్ మార్క్ రాజకీయం మరోసారి కరీంనగర్ గడ్డపై సత్తా చాటింది.

The post కరీంనగర్ పీఠం కైవసం – ఫలించిన ‘బండి’ వ్యూహం! బెడిసికొట్టిన విపక్షాల ఎత్తుగడలు appeared first on Journalist Sirisha.

కరీంనగర్ భవిష్యత్తు బీజేపీ లిఖించబోతుందా
కరీంనగర్ భవిష్యత్తు బీజేపీ లిఖించబోతుందా?

కరీంనగర్ రాజకీయాల్లో నిజంగా ఏమి జరుగుతోంది?
ప్రజల విశ్వాసం మాట్లాడబోతుందా…?
లేక హామీలా..?

కరీంనగర్ రాజకీయాలపై డేటా ఆధారిత పరిశీలనలు పలు సందేహాలను లెవనెత్తుతుంది..

1998–99లో BJP వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో
C. విద్యాసాగర్ గారు..

2004 నుంచి 2008 వరకు MPగా కేసీఆర్ (TRS)
మళ్లీ
2019 నుంచి ఇప్పటివరకు BJP నుండి బండి సంజయ్
ఈ మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని చూస్తే..
కరీంనగర్ ఓటరు తీర్పు మారుతోందా… లేక పునరావృతమవుతోందా?

డేటా ఏం చెబుతోంది?
2019లో బండి సంజయ్‌కు 4,98,276 ఓట్లు..
ఇటీవల ఎన్నికల్లో 5,85,116 ఓట్లు..
అంటే 1.15% ఓటింగ్ పెరుగుదల కనిపిస్తుంది..
గతంతో పోలిస్తే ప్రజా మద్దతు పెరిగింది అని స్పష్టం ఇక్కడ…

ఇక కేసీఆర్ విషయానికి వస్తే…
2004–06 మధ్య రెండు సార్లు ఎన్నికలు
ఒకసారి 3.78 లక్షల ఓట్లు, తర్వాత 4,51,199 ఓట్లు
కానీ అప్పుడు కరీంనగర్‌లో అభివృద్ధి కనిపించిందా? అంటే శూన్యమ్..

ఇక్కడే అసలు ప్రశ్న ప్రజలను అభివృద్ధి దిశగా నడుపితుంది…

కేసీఆర్ గెలిచిన కాలంలో అభివృద్ధి కనుచూపు మేరలో కూడా లేకపోతే
బండి సంజయ్ గెలిచిన తర్వాత ఎందుకు ఇంతలా అభివృద్ధి కనిపిస్తోంది?
ఇది కేవలం రాజకీయ ఆరోపణా?
లేక ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించి ఇచ్చిన తీర్పా?

గ్రామీణ రాజకీయాల్లో మార్పు ఎందుకు వస్తోంది?
ఇంతవరకు పట్టణ ఓటర్లకే పరిమితమైన BJP…
MLC ఎన్నికల్లో విజయం
అదే ఊపుతో
ఇటీవల 100 పైగా సర్పంచ్‌లు BJP మద్దతుతో గెలవడం

ఇది యాదృచ్ఛికమా?
లేక గ్రామీణ ఓటరు విశ్వాసంలో వచ్చిన మార్పు సంకేతమా?

మరి కాంగ్రెస్ 400+ హామీలు ఎందుకు పని చేయలేదు?
ప్రజలు హామీలను నమ్మలేదా?
లేక పనితనం చూసి ఓటేశారు?
సర్పంచ్ ఎన్నికల్లో BJPకి వచ్చిన మద్దతు దానికి నిదర్శనమా?

ఈ పరిస్థితుల్లో
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
BJP మేయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది అసలు ప్రశ్న…?

ప్రజల నమ్మకం నిజంగా BJP వైపు షిఫ్ట్ అవుతోందా?
లేక ఇది తాత్కాలికంగా రాజకీయంగా కనిపించే ఒక ఉపా?
పట్టణం మరియు గ్రామం రెండింట్లో ఒకేసారి మద్దతు వస్తే
కరీంనగర్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం రాయబడబోతుందా?

మీ అభిప్రాయం ఏంటి?
డేటా చెబుతున్న నిజాన్ని మీరు ఎలా సమర్ధిస్తారు?

The post కరీంనగర్ భవిష్యత్తు బీజేపీ లిఖించబోతుందా appeared first on Journalist Sirisha.