కాంగ్రెస్ వైఫల్యాలు Archives - Journalist Sirisha

తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకే!
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో, తెలంగాణ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నింపుతూ.. పార్టీలోని ఇద్దరు కీలక ప్రజాదరణ కలిగిన నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య ఉన్న చిన్నపాటి భేదాభిప్రాయాలకు పార్టీ అధిష్టానం శాశ్వత ముగింపు పలికింది. వీరిద్దరూ ఏకతాటిపైకి రావడంతో అధికార కాంగ్రెస్, ఉనికి కోసం ఆరాటపడుతున్న బీఆర్ఎస్ (BRS) శిబిరాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.

కలిసికట్టుగా కమలనాథులు.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో, సీనియర్ నేత ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ నివాసంలో జరిగిన కీలక సమావేశంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సయోధ్య కుదిరింది. ఓ వైపు హిందూత్వ అజెండాతో యువతలో, ప్రజల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా చెరగని ముద్ర వేసిన బండి సంజయ్, మరోవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ వర్గాల్లో బలమైన పట్టున్న ఈటల రాజేందర్.. ఇద్దరూ చేతులు కలపడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. “మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మా అంతిమ లక్ష్యం తెలంగాణలో రామరాజ్యం స్థాపించడమే, పేదల సంక్షేమమే” అని వీరిద్దరూ స్పష్టం చేయడం కింది స్థాయి కార్యకర్తల్లో నయా జోష్ నింపింది.

కాంగ్రెస్ అరాచక పాలనపై అసహనం.. సమావేశం అనంతరం బీజేపీ నేతలు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిందని, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచిందని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తెలంగాణలో దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని, ప్రజలు ఈ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయారని జర్నలిస్టులు, విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

కనుమరుగవుతున్న బీఆర్ఎస్.. ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే! ఇక పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కుటుంబ పాలనతో తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. గడిచిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోనే కేసీఆర్ పార్టీని తెలంగాణ సమాజం శాశ్వతంగా పాతాళానికి తొక్కింది. అవినీతి, అహంకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన గులాబీ పార్టీకి ఇక తెలంగాణలో భవిష్యత్తు శూన్యం. బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.

ఈ రాజకీయ శూన్యతను పూరిస్తూ, కాంగ్రెస్ వైఫల్యాలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, దేశభక్తి ఎజెండాకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండి సంజయ్ దూకుడు, ఈటల రాజేందర్ వ్యూహచతురత, కిషన్ రెడ్డి అనుభవం, లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో తెలంగాణ కమలదళం అజేయ శక్తిగా ఆవిర్భవించింది.

“సింహాలు రెండు కలిస్తే వేట ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూస్తారు” అన్నట్లుగా తెలంగాణ బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కుటుంబ పార్టీ బీఆర్ఎస్‌ను పూర్తిగా బొందపెట్టి.. కాషాయ జెండాను గోల్కొండ కోటపై ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరించింది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, ఆపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం తథ్యం అని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

The post తెలంగాణ కమల దళంలో నయా జోష్: ఏకతాటిపై బండి, ఈటల.. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు వణుకే! appeared first on Journalist Sirisha.

మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా?
బండి సంజయ్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న క్యాడర్ – వణుకుతున్న ప్రత్యర్థులు!

–గ్రౌండ్ రిపోర్ట్ ఫ్రం శిరీష జర్నలిస్ట్..

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార పీఠమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ వ్యూహకర్త నితిన్ నబి రాష్ట్రంలో వరుస పర్యటనలు చేయడం వెనుక అతిపెద్ద రాజకీయ ఆంతర్యం దాగి ఉంది. కేవలం నాయకులను కలవడం మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికల రణరంగానికి సమాయత్తం చేయడమే ఢిల్లీ పెద్దల అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.

యోధులున్నారు.. కానీ సమన్వయమేదీ?

తెలంగాణలో బీజేపీకి ఉన్న బలమైన నాయకత్వం మరే పార్టీకి లేదు. ఎనిమిది మంది ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ లాంటి నాయకులతో పార్టీ క్యాడర్ ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది. ముఖ్యంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి నాయకులు కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించగల అగ్రెసివ్ యోధులు.

అయితే, ఇంతటి బలమైన నాయకత్వం ఉన్నప్పటికీ పార్టీలో ‘ఈగో వార్స్’ నడుస్తున్నాయనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కానీ, గ్రౌండ్ రియాలిటీ అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అసలైన, ఏకైక రాజకీయ శత్రువుగా బీజేపీనే పరిగణిస్తున్నాయి. కమల దళం బలపడితే తమ ఉనికి గల్లంతవుతుందనే భయం ఆ రెండు పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జతెలంగాణ ప్రజల నాడి పసిగట్టడం అంత సులువు కాదు. ఆరు దశాబ్దాల పాటు పోరాడి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతనే నిర్దాక్షిణ్యంగా ఫామ్ హౌస్‌కు పరిమితం చేసిన చరిత్ర తెలంగాణ ఓటర్లది. అలాంటి ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసాధ్యమైన హామీలు ఇప్పుడు ఆ పార్టీకే ఉరితాడుగా మారుతున్నాయి.

100 రోజుల్లో అద్భుతాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ, ఇప్పుడు ప్రజలకు మొండిచేయి చూపుతోంది:

హైడ్రా పేరుతో విధ్వంసం: అక్రమాల కూల్చివేతల పేరుతో సామాన్యులను, పేదలను భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజల కన్నీటి ఉసురు పోసుకుంటోంది.

రైతాంగానికి ద్రోహం: గిట్టుబాటు ధరల ఊసే లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘రెండు లక్షల రుణమాఫీ’ సగంలోనే ఆగిపోయి రైతులను రోడ్డున పడేసింది.

మహిళలు, వృద్ధులకు దగా: పెన్షన్లు పెంచుతామని ఆశపెట్టి ఇప్పుడు నిధులు లేవని దాటవేస్తున్నారు.

కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం: ఎన్నికల ముందు ఊదరగొట్టిన ఈ హామీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కనీసం గుర్తుకూడా లేదు.

విద్యార్థినులకు స్కూటీలు: ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.

బడుగు, బలహీన వర్గాలకు మోసం: బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి విస్మరించారు. దళిత బంధుకు అదనంగా మరో ఐదు లక్షలు కలిపి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తామని ఆశపెట్టి దళితుల ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఆ వర్గాలన్నీ రగిలిపోతున్నాయి.

తెలంగాణ సాధన కోసం సకల జనులు ఎలాగైతే ఏకమయ్యారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కూడా ఇదే తరహాలో అన్ని వర్గాలూ ఏకమవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

కుటుంబ రాజకీయాలతో చతికిలబడ్డ బీఆర్ఎస్

మరోవైపు పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పూర్తిగా పతనావస్థకు చేరుకుంది. కేటీఆర్, హరీష్ రావు, అప్పుడప్పుడు కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సభలు పెడుతూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, జనాలు ఆ కుటుంబ పాలనను, వారి మాటలను నమ్మే స్థితిలో లేరు. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తూ, తెలంగాణకు అసలైన ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల ముందు నిలబడుతోంది.

గల్లీ నుంచి సిటీ వరకు.. చాప కింద నీరులా కాషాయ దళం

క్షేత్రస్థాయిలో బీజేపీ క్యాడర్ ఊహించని స్థాయిలో బలపడింది. బూత్ స్థాయి కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధిరోహించడం పార్టీ విస్తరణకు నిదర్శనం. నిజామాబాద్ లాంటి చోట్ల అధికార పార్టీల కుటిల రాజకీయాల వల్లే మేయర్ పీఠాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, వారి పోరాట పటిమను తక్కువ అంచనా వేయలేం. తెలంగాణ వ్యాప్తంగా కాషాయ రంగు చాప కింద నీరులా కాదు, ఏకంగా ఒక సునామీలా విస్తరిస్తోంది.

జీహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్లు.. బండి సంజయ్ మాస్ వార్నింగ్

అధికారంలోకి రావాలంటే పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడం కీలకం. ఇప్పుడు బీజేపీ టార్గెట్ గ్రేటర్ హైదరాబాద్ (GHMC), గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలే. నితిన్ నబి సమక్షంలో నిన్న జరిగిన సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

“వరంగల్ కార్పొరేషన్ వర్సెస్ హైదరాబాద్ కార్పొరేషన్.. ఎవరికి ఎంత దమ్ముందో తేల్చుకుందాం రా..!” అంటూ ఆయన విసిరిన సవాల్ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. “మనకు గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంది.. వాళ్లకు శిక్షణ ఇచ్చి నాయకులుగా తీర్చిదిద్దుతాం” అని బండి సంజయ్ చేసిన ప్రకటన బీజేపీ భవిష్యత్ వ్యూహానికి అద్దం పడుతోంది.

ప్రధాని సభలో బండికే బ్రహ్మరథం.. సీఎం అభ్యర్థి ఆయనేనా?

నాయకుడికి జనాదరణ ఉంటే క్యాడర్ ఎలా రియాక్ట్ అవుతుందో మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ స్పష్టం చేసింది. మోడీ సభకు బండి సంజయ్ రాగానే క్యాడర్ చూపించిన జోష్, ఇచ్చిన స్వాగతం చూస్తే.. తెలంగాణ భవిష్యత్ సీఎం ఆయనే అన్నంతగా వాతావరణం మార్మోగిపోయింది.

అధ్యక్ష పదవి బండి సంజయ్‌కి ఇస్తేనే..!

అధికార రాజకీయాల్లో ఎత్తుగడలు సాధారణమే. కానీ బీజేపీకి ఉన్న అతిపెద్ద బలం దాని కార్యకర్తలు. ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వ సిద్ధాంతం కోసం దశాబ్దాలుగా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న నిస్వార్థ సైనికులు వారు. “మా తాత చెప్పారు బీజేపీ అధికారంలోకి వస్తుందని, మా నాన్న చెప్పారు వస్తుందని.. కానీ ఈసారి కచ్చితంగా రామరాజ్యం వస్తుంది” అనే ప్రగాఢ విశ్వాసంతో వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

కానీ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోని కొందరు నాయకుల ఈగో వార్స్, తప్పుడు రిపోర్టుల వల్లే అధిష్టానం బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే.. బండి సంజయ్‌ను ఆరోజు తప్పించడం వల్లే బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, ఆ ఒక్క తప్పు వల్లే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇది తెలంగాణలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా సామాన్యులు చెప్పే నిజం!

కార్యకర్తల మనోభావాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను బీజేపీ హైకమాండ్ గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యక్తుల మధ్య ఈగోలను పక్కనబెట్టి, క్యాడర్‌కు గౌరవం దక్కాలంటే.. ఫైర్ బ్రాండ్ నాయకుడు బండి సంజయ్ కుమార్‌కు రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు అప్పగించాలి. అదే జరిగితే తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని పొలిటికల్ అనలిస్టులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరి ఢిల్లీ పెద్దలు గ్రౌండ్ రియాలిటీని గ్రహించి ఆ దిశగా అడుగులు వేస్తారా? బండి సంజయ్‌కు పగ్గాలు అప్పగిస్తారా? కాలమే సమాధానం చెప్పాలి!

The post మిషన్ తెలంగాణ! కాంగ్రెస్ వైఫల్యాలు, బీఆర్ఎస్ పతనం.. తెలంగాణలో కమలం వికసించేనా? appeared first on Journalist Sirisha.