మమతాబెనర్జీ చేస్తున్నది ముమ్మాటికీ దేశ ద్రోహమే….!

దేశ ప్రజలు తమ మనుగడ కోసం ఆలోచించాల్సిన విషాదమైన తరుణం వచ్చింది….

ఈ రోజు సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగింది ఏమైనా చిన్న సంఘటన అనుకుంటున్నారా❓

భారత ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు ఉన్న గౌరవాన్ని కళ్లముందే చిన్నబుచ్చేలా చేసిన ప్రయత్నం
.
సుప్రీంకోర్టు అంటే….
అదేమైన పార్టీ ఆఫీస్ అనుకుంటుందా..❓
పోనీ రాజకీయ వేదిక అనుకుంటుందా..❓
లేక ఓటు బ్యాంక్ కోసం పుంఖాలు పుంఖాలు ప్రసంగాలు ఇచ్చే స్టేజ్ అనుకుంటుందా…❓

అది దేశ భద్రత కు కాపలా కాసే కంచు కోట….
అలాంటి గౌరవనీయమైన న్యాయస్థానంలో…
తన తరఫున వాదించేందుకు అత్యంత అనుభవజ్ఞుడైన న్యాయవాది ఉన్నప్పటికీ..

మమతాబెనర్జీ మధ్యలో లేచి “మిలార్డ్… మిలార్డ్…” అంటూ అడ్డుకోవడం….

ఆ వాదనను రాజకీయ నాటకంగా మార్చే ప్రయత్నం….

ఇది బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ప్రవర్తనేనా…❓

CJI స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది:
“మీరు ఒక అద్భుతమైన న్యాయవాదిని ఎంచుకున్నారు. ఆయన మాట్లాడనివ్వండి అని….
ఒక హెచ్చరికలా కాకుండా వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు చేసిన విజ్ఞప్తి లా…

ఇప్పుడు అసలు విషయం తెలిస్తే నివ్వెరపోతారు…

SIR (Special Intensive Revision).
ఎన్నికల కమిషన్ పని ఏంటి ❓

నిజమైన ఓటర్లను తొలగించడమా…❓
లేక నకిలీ, అక్రమ, డూప్లికేట్ ఎంట్రీలను తొలగించడమా..❓

కాస్త చదువుకున్న, స్మార్ట్ ఫోన్ వాడడం వచ్చిన ఎవ్వరిని అడిగినా చెప్తారు…
ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశమైనా,
ఓటర్ లిస్ట్ శుద్ధి చేయడం అత్యవసరం….
అదే పని SIR చేస్తుంది…

మీరు చూడండి…అమెరికా, యూరప్, ఆసియా
ఎక్కడైనా అక్రమ వలసదారులకు ఆయాదేశాల్లో…
ఒక ఓటు హక్కు ఇవ్వలేదు.
పౌరసత్వం ఇవ్వలేదు
రాజకీయ పరంగా రక్షణ అసలే ఇవ్వలేదు….

అయితే మరి భారతదేశంలో మాత్రం ఎందుకు ఈ మినహాయింపు❓
ఒక ముఖ్యమంత్రి ఇలా బహిరంగంగా వచ్చి
రోహింగ్యాలు, అక్రమ బంగ్లాదేశీయులకు సపోర్ట్ చేయడం ఏంటి…❓

పాస్‌పోర్ట్ లేకుండా
వీసా లేకుండా
సరిహద్దులు దాటి వచ్చి
ఓటర్లుగా నమోదవుతుంటే
అది ప్రశ్నించడమే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పా..❓

ఇక్కడ అసలు నొప్పి ఏంటో తెలుసా మీకు…
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి
అక్రమ వలసదారుల తరఫున దేశ అత్యున్నత న్యాయస్థానంలో రాజకీయంగా పోరాడటం అనేది
ఇది మానవత్వం పేరుతో చేస్తున్న సేవా అనుకుంటున్నారా….❓❓❓❓❓

అలా పెద్డమనసుతో అనుకునేరు..పొరపాటున కూడా అనుకోకండి…

కేవలం ఓటు బ్యాంక్ కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టడం❓❓❓❓

దేశం సరిహద్దుల దగ్గర మన సైనికులు ప్రాణాలు ఇస్తుంటే…
లోపల మాత్రం అక్రమ చొరబాట్లను “రాజకీయ హక్కు”గా మార్చే ప్రయత్నం చేస్తున్న తీరుకు ప్రజలు కళ్ళు తెరవకపోతే….నష్టపోయేది ఒక్క రాష్టం మాత్రమే కాదు..యావత్ భారతదేశం….భారత దేశం అంటే ప్రతీ పౌరుడికి నష్టం జరుగుతుంది.

ప్రజలు గమనించాలి…..
న్యాయస్థానాలు గమనిస్తున్నాయి….
చరిత్ర కూడా గమనిస్తుంది….

ఓటు కోసం దేశాన్ని తాకట్టు పెట్టిన నాయకత్వాన్ని
చరిత్ర ఎప్పటికీ క్షమించదు.
ఇది కేవలం మమతా బెనర్జీ మీద విమర్శ కాదు…. ఇది వ్యవస్థపై జరుగుతున్న అపచారం….
ఇది రేపటి దేశ భద్రతపై కలుగుతున్న ఆందోళన….
ఇది భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనే ఆర్తనాదం…

ఇలాంటి దిగజారుడు రాజకీయానికి
ప్రజాస్వామ్యంలో చోటు ఉండకూడదు.

మమతాబెనర్జీ చేస్తున్నది ముమ్మాటికీ దేశ ద్రోహమే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *