గుడి కడితే కడతెరుస్తాం
..ఖబడ్దార్!

ఈ గడ్డపై ఒక హిందువు, తన సొంత స్థలంలో, సొంత డబ్బుతో, ప్రభుత్వ అనుమతులు చేతిలో ఉన్నా సరే.. ఒక దేవాలయం కట్టాలంటే మాత్రం యుద్దమే చేయాల్సిన పరిస్థితి దాపురించింది. పి.గన్నవరం గ్రామంలో గుబిలి సురేష్ అనే శివభక్తుడికి ఎదురవుతున్న దుస్థితి చూస్తుంటే.. మనం హిందూ దేశంలో ఉన్నామా లేక పరాయి పాలనలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.

అసలేం జరిగింది? గుబిలి సురేష్ గారి కథనం ప్రకారం.. 11 ఏళ్ల క్రితం ఆయన స్థలంలో స్వయంభూగా శివలింగం వెలసింది. అప్పటి నుంచి అక్కడ నిత్య పూజలు, శివరాత్రికి లక్ష దీపోత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ తాత్కాలిక షెడ్డు స్థానంలో శాశ్వత ఆలయం నిర్మించాలని సంకల్పిస్తే.. స్థానికంగా కొందరు వ్యక్తులు, వేరే మత పెద్దల అండదండలతో అడ్డుకుంటున్నారు. “ఇళ్ల మధ్యలో గుడి కట్టడానికి వీల్లేదంటూ” దౌర్జన్యం చేస్తున్నారు.

మరి ఇళ్ల మధ్యలో అడుగుకో చర్చ్ ఉండొచ్చా…?

అడుగడుగుకో చర్చ్ కడుతుంటే  ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు  అన్య మతస్తులు… ఐకమత్యం తో ఆక్రమించేస్తున్నారు…
అలాంటిది ఇక్కడ హిందువుల దగ్గరికి వచ్చేసరికి మన భారతదేశంలో ఇలాంటి ధర్మ భూమిలో గుడి కట్టాలంటే పరాయి వారి నుంచి కాదు అయిన  వారి దగ్గర నుంచే ఆక్షేపణలు…నిందలు…బెదిరింపులు..ఎన్నో రాజకీయాలు…. ఇది ఎంతవరకు సమర్ధనీయం..?
ఒక గుడి కట్టడానికి ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలా? పోనీ తీసుకున్న కూడా మన హిందువులే దీన్ని అడ్డుకోవడం ఏంటి…?
ఇలా అయితే మన హిందుత్వం బీటలు పారకపోతే ఇంకెక్కడ మిగులుతుంది…
అస్తిత్వం కోల్పోయి అనాథ కాక ఇంకేం అవుతుంది..
ఇక్కడ మనకు కావాల్సింది ఐకమత్యం.మనకు మనం సహకరించుకోవడం..
మనలో మనకు ఐక్యత ఉండి  గుడినిర్మాలకు కృషి చేయడం కావాలి.
5000 గుళ్ళు కడతా అంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి అన్యమతస్థులు అభ్యంతరం వ్యక్తం   చేశారు..  అదే అడుగుకో చర్చి వెలుస్తుంటే హిందువులు చేవ చచ్చి చూస్తున్నారు.
ఒక చిన్న రూమ్ దొరికితే చాలు చర్చ్ గా మార్చేస్తున్నారు… ఎక్కడెక్కడో హిందువులను మతమార్పిడి చేస్తున్నారు..మనల్ని మనకు కాకుండా చేస్తున్నారు.
ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం.ఇప్పుడు  ఎదురుకోకపోతే మన అస్తిత్వం ఇరకాటంలో పడిపోతుంది.

రేపటి తరాలకు గుడి మ్యూజియం లో పెట్టి చూపించాల్సి వస్తుందేమో.

హైందవులారా మేలుకోండి…గుడి నిర్మాణానికి సహకరించండి.

దీనికి కావాల్సిందంటూ ఏమి లేదు..
కేవలం ఐకమత్యం మాత్రమే..

ఇక్కడ మనకు కావాల్సింది.. మనలో మనం కుమ్ములాడుకోవడం కాదు, ఒకరికొకరు సహకరించుకోవడం. ఇక్కడ సహకారం అనే పదానికి అర్థం  చేయూత నివ్వడమని గుర్తించాలి.హిందూ ధార్మిక సంఘాలు, ప్రభుత్వం తక్షణం స్పందించి సురేష్ గారికి రక్షణ కల్పించి, ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలి. ఇది ఒక వ్యక్తి సమస్య కాదు.. ఇది ధర్మ పోరాటం. రండి హైదవులారా
చేయి చేయి కలిపి ధర్మకర్యం లో మనవంతు సహకారం చేద్దాం…ఆసక్తి గల ధార్మికవేత్తలు వెంటనే స్పందించండి.

సంప్రదించాల్సిన వివరాలు:

గుబిలి సురేష్: 98495 71204

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *