హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) సంచలన తీర్పు వెలువరించింది. జనవరి 24, 2026న బాలాపూర్‌లో తలపెట్టిన ‘ధర్మరక్షణ సభ’ (Dharma Rakshana Sabha) కు అనుమతినిస్తూ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ, కోర్టు జోక్యంతో ఈ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది.
జాగో భాగ్యనగర్ – ఛలో బాలాపూర్ (Jago Bhagyanagar – Chalo Balapur): భాగ్యనగరంలో అక్రమంగా తిష్టవేసిన బంగ్లాదేశ్ (Bangladesh) మరియు రోహంగియా ముస్లిం (Rohingya Muslim) చొరబాటుదారులను వెంటనే అరెస్టు చేసి, దేశం నుంచి వెనక్కి పంపించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సభ జరుగుతోంది. దేశ అంతర్గత భద్రత మరియు భాగ్యనగర్ భవిష్యత్తు కోసం ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ‘జాగో భాగ్యనగర్’ ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
కోర్టులో ప్రభుత్వం సంచలన అంగీకారం: హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఒక్క బాలాపూర్ (Balapur) ప్రాంతంలోనే సుమారు 8,000 మంది రోహంగియాలు అక్రమంగా నివసిస్తున్నట్లు ప్రభుత్వం కోర్టు సాక్షిగా అంగీకరించింది. అయితే, బంగ్లాదేశీయుల సంఖ్యపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయింది. లక్షలాది మంది అక్రమ వలసదారుల రక్షణ కోసమే ప్రభుత్వం ఈ సభను అడ్డుకునే ప్రయత్నం చేసిందని నిర్వాహకులు మండిపడ్డారు.
జనవరి 24న భారీ సభ: గౌరవ హైకోర్టు మరియు హైదరాబాద్ పోలీసుల (Hyderabad Police) నిబంధనలకు లోబడి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ సభ జరగనుంది. జాతీయవాదులంతా ఈ సభకు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపేంత వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.