కరీంనగర్ ఖిల్లాలో ‘బండి’ చక్రవ్యూహం..

విపక్షాల వెన్నులో వణుకు! సీన్ రివర్స్.. ఎగిరేది కాషాయమే!

కరీంనగర్ (పొలిటికల్ బ్యూరో): అది కరీంనగర్ గడ్డ.. అక్కడ ఏం జరిగినా ఒక రేంజ్‌లో ఉంటుంది! కానీ ఇప్పుడు జరుగుతోంది మామూలు రాజకీయం కాదు.. ఒక కురుక్షేత్రం! మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం (MIM) చీకటి ఒప్పందాలు చేసుకుని, ఇండిపెండెంట్లను అడ్డం పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నాయి. కానీ, వాళ్లకు తెలియని విషయం ఒకటుంది.. అసలు ఆట మొదలుపెట్టిందే ‘బండి సంజయ్’ అని!

అపవిత్ర కూటమికి ‘అదిరిపోయే’ షాక్? సిద్ధాంతాలు లేవు, సిగ్గు లేదు.. కేవలం బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా బద్ధ శత్రువులంతా ఒక్కటయ్యారు. గులాబీ, హస్తం, మజ్లిస్ పార్టీలు కలిసి ఇండిపెండెంట్లతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్నాయి. “మాదే మేయర్ పీఠం” అని తొడగొడుతున్నాయి. కానీ ఈ కూటమి వేస్తున్న ప్రతి అడుగును బండి సంజయ్ డేగ కన్నుతో గమనిస్తున్నారు. వాళ్లు వేసేది స్కెచ్ అయితే.. బండి వేసేది ‘మాస్టర్ ప్లాన్’.

బండి మౌనం.. తుఫానుకు సంకేతం! గత 24 గంటలుగా బండి సంజయ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. “పులి వేటకు వెళ్లేముందు రెండడుగులు వెనక్కి వేస్తుంది.. అది భయంతో కాదు, పంజా విసరడానికి” అన్నట్లుగా ఉంది బండి తీరు. తెరవెనుక ఆయన నడుపుతున్న ‘మైండ్ గేమ్’కు విపక్షాల శిబిరాల్లో అలజడి మొదలైంది. ఏ క్షణాన ఏ ఇండిపెండెంట్ ఎటు జంప్ అవుతాడో.. ఏ పార్టీ కార్పొరేటర్ ఎవరికి జై కొడతాడో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్? కాదు.. అంతకు మించి! కరీంనగర్ కార్పొరేషన్ పరిణామాలు చూస్తుంటే ఇండియా-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కూడా చిన్నబోవాల్సిందే. నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం మారుతున్న రంగులు! అవతలి పార్టీలకు బీపీలు పెరుగుతుంటే.. బీజేపీ క్యాడర్ మాత్రం కాలర్ ఎగరేస్తోంది. “ఆటగాళ్లు ఎంతమంది ఉన్నా.. ఆడించే మొనగాడు మా బండి సంజయ్ ఒక్కడే” అని సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు.

జెండా పాతేది కమలదళమే! అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. చివరికి గెలిచేది ధర్మమే, ఎగిరేది కాషాయ జెండానే! బండి సంజయ్ సిద్ధం చేసిన ‘బ్రహ్మాస్త్రం’ ముందు ఈ కూటమి కుట్రలు పటాపంచలు కావడం ఖాయం. చివరి నిమిషంలో జరిగే ఆ ‘మ్యాజిక్’ చూసి ప్రత్యర్థులు దిమ్మతిరిగిపోవడం గ్యారెంటీ!

మేయర్ కుర్చీ ఎవరిదో తేలడానికి ఇంకాస్త సమయం ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఇక్కడ ‘చెక్’ పెట్టేది బండి సంజయే.. ‘మేట్’ అయ్యేది విపక్షాలే! వెయిట్ అండ్ సీ.. కాషాయ జెండా రెపరెపలు ఖాయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *