దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి తేల్చిచెప్పారు. అస్సాంలోని కామ్రూప్ గడ్డపై ఆయన చేసిన సింహగర్జన.. దేశంలో అక్రమంగా చొరబడి స్థిరపడిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిన ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. దేశ భద్రతకు ముప్పుగా మారిన అక్రమ వలసదారుల ఏరివేతపై ఆయన చేసిన ప్రకటన ప్రతి అచ్చమైన భారతీయుడూ గర్వించదగినది.
నక్సలిజం తరహాలోనే నిర్దాక్షిణ్యంగా ఏరివేత గత పదేళ్లలో దేశంలో నక్సలిజాన్ని ఎలాగైతే ఉక్కుపాదంతో అణచివేశారో, రాబోయే ఐదేళ్లలో చొరబాటుదారులను కూడా అదే రీతిలో ఏరివేస్తామని అమిత్ షా చేసిన ప్రకటన దేశభక్తులందరికీ ఒక భరోసా. సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, ఇక్కడి వనరులను అనుభవిస్తూ, దేశ భద్రతకు అంతర్గత ముప్పుగా మారిన ఈ చీడపురుగులను కూకటివేళ్లతో పెకిలించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే ఎవరినైనా ఉపేక్షించేది లేదని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది.
కాంగ్రెస్ దిగజారుడు ‘ఓటు బ్యాంకు’ రాజకీయాలకు చెక్ కాంగ్రెస్ పార్టీకి అక్రమ వలసదారులే అతిపెద్ద ఓటు బ్యాంకు. వారిని అడ్డం పెట్టుకుని దశాబ్దాల పాటు ఆ పార్టీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టింది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చొరబాటుదారులను బహిష్కరిస్తామని కల్లబొల్లి మాటలు చెబుతారే తప్ప, ఆచరణలో వారిని అక్కున చేర్చుకుని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ లాంటి సరిహద్దు రాష్ట్రాల జనాభా స్వరూపాన్నే దెబ్బతీస్తూ, ఆయా రాష్ట్రాలకు కాంగ్రెస్ విధానాలు ఎంతటి ప్రమాదకరంగా మారాయో అమిత్ షా కళ్లకు కట్టారు. కాంగ్రెస్ స్వార్థపూరిత విధానాలకు ఇక కాలం చెల్లినట్లే!
ఓటర్ల జాబితా నుంచే కాదు, దేశం నుంచే తరిమివేత చొరబాటుదారులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చి దేశ పౌరులుగా చెలామణి చేస్తున్న కుట్రలకు అమిత్ షా చరమగీతం పాడనున్నారు. కేవలం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే కాదు, వారిని పట్టుకుని దేశ సరిహద్దులు దాటించే వరకు విశ్రమించేది లేదని ఆయన చేసిన స్పష్టమైన ప్రకటన ప్రశంసనీయం.
దేశ శాంతి భద్రతల పరిరక్షణ, మన పౌరుల హక్కుల రక్షణ కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకుంటున్న ఈ కఠినమైన, సాహసోపేతమైన అడుగును ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. చొరబాటుదారుల్లేని, సురక్షితమైన నవ భారతాన్ని నిర్మించే దిశగా ఇది ఒక చారిత్రక ఘట్టం!