నక్సల్స్ సామ్రాజ్యం కూలిపోతోంది… ఎర్ర కోటలు బద్దలవుతున్నాయి!

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఏం జరిగిందో చూశారా ❓

దశాబ్దాలుగా “మాదే రాజ్యం… అడవి మా గుప్పెట్లో ఉంది” అని విర్రవీగిన నక్సల్స్‌కి, వారి కళ్ల ముందే మోడీ సర్కార్ చుక్కలు చూపించింది!

అడవిలో మావోయిస్టులు కట్టుకున్న భారీ స్మారక చిహ్నాన్ని CRPF కోబ్రా దళాలు ఒక్క దెబ్బతో నేలమట్టం చేశాయి…

ఇది కేవలం రాళ్లు పగలగొట్టడం కాదు… దేశంపై యుద్ధం ప్రకటించిన ఒక “విషపు వ్యవస్థను” పాతిపెట్టడం!

గతంలో ప్రభుత్వాలు ఎలా ఉండేవి ❓

చర్చల పేరుతో కాలయాపన… దాడులు జరిగితే ఖండనలు… కానీ ఢిల్లీ గద్దె మీద ఇప్పుడు ఉన్నది మోడీ!

2014 తర్వాత లెక్క మారింది…

తుపాకీ పడితే… తూటాతో సమాధానం. అడవిలో దాక్కుంటే… డ్రోన్లతో వేట. ఇప్పుడు ఏకంగా వారి గుర్తులను, చిహ్నాలను కూడా మట్టికరిపిస్తున్నారు.

అమాయక గిరిజనులను చంపి, రక్తం ఏరులై పారించిన వారికి స్మారక చిహ్నాలు ఎందుకు ❓

అభివృద్ధిని అడ్డుకుని, పేదరికాన్ని పెంచే వారికి అడవిలో స్థానం ఎందుకు ❓

మోడీ – అమిత్ షా ద్వయం దెబ్బకి నక్సల్స్ వెన్నులో వణుకు పుట్టింది…

ఒకప్పుడు పది రాష్ట్రాల్లో విస్తరించిన నక్సలిజం, నేడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయే పరిస్థితికి వచ్చింది.

ఎవరైతే “భారత్ తేరే తుక్డే హోంగే” అని కలలు కన్నారో… వారి కలలు కల్లలయ్యాయి! వారి చిహ్నాలు కూలిపోయాయి!

ఇది నయా భారత్…

ఇక్కడ ఉగ్రవాదానికి, హింసకు, దేశద్రోహానికి ఇసుక రేణువంత స్థానం కూడా లేదు.

నక్సల్స్ అంతం… అభివృద్ధి ఆరంభం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *