ఈ దేశం దౌర్భాగ్యం ఏంటో తెలుసా? పరాయి దేశం నుండి వచ్చి మన దేవాలయాలను కూల్చి, మన తలలు నరికిన ఔరంగజేబుకి, అక్బర్ కి చరిత్ర పుస్తకాల్లో “ది గ్రేట్” (The Great) అని మెన్షన్ చేస్తూ పేజీలకు పేజీలు రాసారు. కానీ, ఆ రాక్షసుల నుండి భారతీయులను కాపాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి రాయడానికి మాత్రం వీళ్ళ పెన్నుల్లో ఇంకు అయిపోయిందో? లేక మెదళ్ళు బానిసత్వపు జబ్బుతో చచ్చుబడిపోయాయో తెలియదు?
- ఎర్ర చొక్కాల (Communists) కుట్రలు ఇక సాగవు!
చరిత్రను వక్రీకరించడంలో ఈ కమ్యూనిస్ట్ మేధావుల తర్వాతే ఎవరైనా! వీళ్ళకి రష్యా విప్లవం గురించి తెలుసు, ఫ్రెంచ్ విప్లవం గురించి తెలుసు.. కానీ ఈ గడ్డ మీద, ఒక సామాన్య మరాఠా బిడ్డ, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన హిందవి సామ్రాజ్య స్థాపకుడు గురించి మాత్రం పిల్లలకు చెప్పరు. ఎందుకు?
శివాజీ మహారాజ్ గురించి నిజాలు చెప్తే, వీళ్ళ “సెక్యులర్” పునాదులు కదిలిపోతాయనెమో? కాషాయ జెండా (Bhagwa) అంటేనే భయపడే ఇలాంటి వాళ్లకు, శివాజీ మహారాజ్ చరిత్ర “కంటిలో నలుసు” లాగే ఉంటుంది. అందుకే ఆయన్ని పుస్తకాల్లో లేకుండా చేసి, భావితరాలకు ఆయన గొప్పతనం తెలియకుండా చేయాలని ఎన్నో కుట్రలు పన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి.. పుస్తకాల్లో పేజీల్లో స్థానం లేకుండా చేయగలరేమో, కానీ భారతీయుల రక్తంలో నరనరాల్లో ఇంకిపోయిన శివాజీ పేరుని చరిత్రని చెరిపేయలేరు! - రాజకీయ బానిసలారా.. సిగ్గు తెచ్చుకోండి!
ఓట్ల కోసం ఏ గడ్డి అయినా తినే రాజకీయ నాయకుల్లారా.. మీకు శివాజీ మహారాజ్ కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే గుర్తొస్తాడు కదా.. మిగతారోజుల్లో ఆయన ఆశయాలను పూర్తిగా గాలికి వదిలేస్తారు.
మన సిలబస్‌లో తాజ్ మహల్ కట్టిన వాడి గురించి ఉంటుంది కానీ, ప్రతాప్‌గఢ్ కోటలో ధర్మం కోసం యుద్ధం చేసిన వాడి గురించి ఉండదు. ఎందుకంటే, శివాజీ గురించి చదివితే యువతలో “పౌరుషం” వస్తుంది. ఆ పౌరుషం వస్తే, మీలాంటి చేతకాని రాజకీయ నాయకులను, దేశద్రోహులని కాలర్ పట్టుకుని ఎక్కడ నిలదీస్తారేమో అనే భయం మీకు పట్టుకుంది. అందుకే ఉద్దేశపూర్వకంగానే మన వీరుల చరిత్రను అటకెక్కించారు.
- మాకు మీ సర్టిఫికెట్లు అక్కర్లేదు!
శివాజీ మహారాజ్ గొప్పతనం చెప్పడానికి మీ చరిత్ర పుస్తకాల సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.
ఆయన కత్తి దూయకపోతే, ఈ రోజు మీరందరూ ఈ పేర్లు పెట్టుకుని తిరిగేవాళ్ళు కాదు.. వేరే పేర్లతో బానిసలుగా బతికేవాళ్ళు. హిందూ ధర్మం ఈ రోజు ఇంకా ఊపిరితో ఉందంటే అది శివాజీ మహారాజ్ భిక్ష!
అయినా ఆయన ఏదో ఒక్క పేజీకో ఏదో ఒక చాప్టర్ కో పరిమితం అయ్యే వ్యక్తి చరిత్ర కాదు.. చెప్పుకుంటూ పోతే ఆయన జీవించిన ప్రతీ గడియ ఒక అధ్యాయం…
ఈ దేశ గడ్డపై పుట్టిన ప్రతీ భారతీయుడికి దేశ భక్తి అంటే ఏంటో తెలిపే పాఠాలు..
హెచ్చరిక:
మేధావి ముసుగులో ఉన్న దేశద్రోహులారా.. వినండి.
మీరు ఎంతగా దాచిపెట్టాలని చూస్తే, అంతగా ప్రజ్వరిల్లుతుంది ఆ చరిత్ర. ఇకపై మేము మా పిల్లలకు మీ “వక్రీకరించిన చరిత్ర” (Distorted History) పాఠాలు చెప్పం.. తల్లి పాలు తాగుతున్నప్పుడే శివాజీ మహారాజ్ వీరగాథలను రంగరించి ఉగ్గుపాలలో కలిపి పోస్తాం.
మీ పుస్తకాల్లో స్థానం లేకపోతేనేం.. ప్రతి హిందువు గుండెలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చున్నాడు!
జై శివాజీ! జై భవానీ!