భారతదేశంలో అత్యంత వైభవంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే విధంగా కేవలం 45 రోజుల్లో 65 కోట్ల ప్రజలు కుల ప్రస్తావన లేకుండా పేద ధనిక అని తేడా లేకుండా అందరూ సమానంగా పుణ్యస్నానాలు ఆచరించి ప్రయాగరాజులోని మహా కుంభమేళ ను విజయవంతం చేసిన సంగతి మనకు తెలిసినదే. ఈ మహా కుంభమేళను సౌకర్యాలు కల్పించడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీ కంటికి రెప్పవలె చూసుకున్నారని చెప్పడంలో సందేహం లేదు, 45 రోజుల మహా కుంభమేళాలో పీఠాధిపతులు, సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.

సనాతన ధర్మాన్ని దగ్గర ఉండి కాపాడుతున్న సాధువులను, అఘోరాలను, పీఠాధిపతులను గురువులను వారి యొక్క పీఠం కోసం కొందరు ఆశపడి ఆ పీఠం కోసం దాడులు చేస్తున్నారు కొందరైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దీనికి ఆర్జం పోస్తూ చిలుకూరి స్వామి ఆలయ ప్రధాన అర్చకుల పై ఒక సంస్థ పేరు చెప్పి దాడి చేయడం

ఇదే అలుసుగా చూసి గత కొద్ది రోజులుగా రాజేష్ నాథ్ అఘోర ను స్వయం ప్రకటిత అఘోర అమ్మ ల చలామణి అవుతున్న శ్రీనివాస అనే వ్యక్తి విచక్షణ కోల్పోయి దుర్భాషలాడుతూ బెదిరిస్తూ వీడియో తన యూట్యూబ్ ఛానల్ లో పబ్లిక్ గా పబ్లిష్ చేస్తున్నా మరియు ప్రజలకు రక్షణగా ఉన్న పోలీసులను దుర్భాషలాడుతూ వారిపై తన దగ్గర ఉన్న ఆయుధాలతో బెదిరిస్తున్న పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం గమనార్థం.


ఈరోజు ఒక్క మహిళను మీడియా ముందు ఉసిగొలిపి రాజేష్ నాథ్ అఘోర పై చెడుగా మాట్లాడించడం వెనుక ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరి అమ్మ ఉన్నడని తణుకు ప్రజల అనుమానం.. దాన్ని నిజం చేస్తూ ఆ వీడియో లైవ్ అయిపోయిన అరగంటకే రాజేష్ నాథ్ అగోర గురునిలయం ముందు శ్రీనివాస్ అలియాస్ అగోరి అమ్మ హల్చల్ చేయడంతో అనుమానం కాస్త నిజంగా బలపడినది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ఒక వ్యక్తి సూటిగా అడగగా కంగారులో పప్పులో కాలేస్తూ రాజేష్ నాథ్ కు గురుదక్షిణ కింద లక్ష రూపాయలు ఇచ్చాను అది వసూలు చేయడానికి వచ్చాను అని చెబుతూ అడ్డంగా దొరికిపోయింది.

శ్రీనివాస్ అలియాస్ అఘోరి అమ్మ గుప్త నిధులు పేరుట వసూళ్ల దందా చేస్తూ వచ్చిన భక్తులను బోల్తా కొట్టించి పారిపోతున్నాడని పబ్లిక్ టాక్! ఇన్ని మోసాలు చేస్తున్నా, పోలీసుల పై దాడి చేస్తున్న, పోలీసులపై దుర్భాషలు ఆడుతున్న ఈ రెండు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం నిద్ర వీడకపోతే ఎంతోమంది అమాయకులు బలి అవ్వాల్సి వస్తుందని మేధావులు హెచ్చరిస్తున్నారు..