Satellite Channels v/s Independent Journalist..

మీరు న్యూస్ చూస్తున్నారా… ?

లేక న్యూస్ పేరుతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చూస్తున్నారా?

ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాను…

మీరు రోజూ గంటల తరబడి న్యూస్ చానెల్స్ ని అప్డేట్స్ ని ఫాలో అవుతున్నారు కదా….

అయితే చెప్పండి రీసెంట్ గా రేలీస్ చేసిన
బడ్జెట్ లో ఎన్ని పాయింట్ గుర్తున్నాయి…?
ఒక్క పాలసీ ప్రభావం అయినా అర్థమైందా. మీకు?
ఒక కొత్త చట్టం ఎందుకు వచ్చింది అనేది తెలుసా?

ఇవేమైన గుర్తున్నాయా …?
లేదంటే
ఎవరు ఎవరిపై అరిచారు….?
ఎవరు ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు..?
ఏ హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది…?

ఇప్పుడు చెప్పండి.. కరెంట్ అఫైర్స్ గుర్తున్నాయా…? లేక
ఈ ఎమ్మెటర్టైన్మెంట్ ఎక్కువగా గుర్తున్నాయా…?

అదే ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ మీ మెదడులో తిరుగుతున్నాయా?

సాటిలైట్ మీడియా
ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఆపేసి
ఎమోషన్ ట్రిగ్గర్ చేయడం మొదలుపెట్టింది.
ఇదే అసలు సమస్య గా తయారైంది..

కానీ ఎందుకు ఇలా చేస్తుంది?
జనాల ఎమోషన్స్ ని ఎంగేజ్‌ చేయడమే పని గా పెట్టుకుని ఆ ఎంగేజ్‌మెంట్ తన TRP రేటింగ్ ని పెంచుకుంటూ….
ఆ TRP రేటింగ్ కి బానిస గా తయారయ్యి దాని మూలంగా వచ్చే అడ్వర్టైజ్‌మెంట్ ఆదాయ మార్గం మోజులో పడిపోయి…జనాలకు విలువలతో కూడిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను తుంగలో తొక్కేసింది….

అందుకే
ఒక సంఘటనను జనాల మెదడుల్లో దురుస్తూ 40 గంటలు నలిపేస్తున్నారు…అంతేకాకుండా
ఒక న్యూస్ ని 400 కోణాల్లో చీల్చి చెండాడి చూపిస్తున్నారు…
ఒక వ్యక్తిని హీరో గా మార్చేస్తున్నారు
విలన్‌గా మలిచేస్తారు…ఏదైనా చేసేస్తారు…

మరి ఇదేనా జర్నలిజం…?
ఎవడన్నాడండీ దీనిని జర్నలిజం అని….?
ఇది ఇప్పుడు Narrative Factory అయిపోయింది…

ఇప్పుడు యూత్‌కు ఒక ప్రశ్న అడుగుతాను…సూటిగా సమాధానం చెప్పండి…?
మీరు న్యూస్ చూస్తున్నారా?
వాటిని నిజానికి న్యూస్ అంటారా…?
లేక మీ భవిష్యత్ ని..ఎదగాలి అనుకునే మీ ఆలోచనలపై ఎవరో పగబట్టి తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ లా అనిపిస్తున్నాయా…?

పోనీ ఒకటి చెప్పండి.
మీరు చూసే న్యూస్‌లో..
రైతు సమస్యలకు ఎంత టైం ఇచ్చారు ..?
విద్యా విధానాలకు ఎంత టైం ఇచ్చారు…?
ఉద్యోగాల గురించి ఎంత సేపు చర్చ చేశారు…?ఇంకా
సైన్స్, ఎకానమీ, టెక్నాలజీకి ఎంత స్పేస్ ఇచ్చారు…?
అసలు ఇచ్చారా….? ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చేసారా….?

లేదంటే…
ఏ హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది…?
ఏ ఏ సెలబ్రిటీ లు డైవోర్స్ తీసుకున్నారు…?
వాళ్ళా వ్యక్తిగత జీవితాలు..
ఇవే హాట్ న్యూస్ కదా మీకు….?
ఇప్పుడున్న యువత కి న్యూస్ అంటే ఇవే అనుకినే స్థాయి కి దిగజార్చేశారు కదా సాటిలైట్ చానెల్స్…?

ఒకప్పుడు ఈనాడు లాంటి న్యూస్ చానెల్స్ చూస్తుంటే …
కరెంట్ అఫైర్స్ నోట్స్ తయారు చేసుకునేవారు..
న్యూస్ వింటే ..దేశం, వ్యవస్థ, పాలన మీద అవగాహన పెరిగేది.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి?
సబ్జెక్ట్‌ను వదిలేసి
క్రింజ్‌నే కంటెంట్‌గా మార్చేశారు.

ఇక్కడే ఇండిపెండెంట్ జర్నలిజం ఎంటర్ అవుతుంది.
కానీ ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు నిజంగా ఇండిపెండెంట్ గా జర్నలిజాన్ని ఫాల్లో అవుతున్నారా…?
లేక వాళ్లూ ఇదే అల్గరిథం భయంతో అదే క్రింజ్ ఫార్ములా ఫాలో అవుతున్నారా అనేది మళ్ళీ సందిగ్ధంలోకి నెట్టేస్తుంది?
వ్యూస్ కోసం
ఫాలోవర్స్ కోసం అతిశయోక్తిగా న్యూస్ ని చూపించే ప్రయత్నం చేయడం…
వైరల్ కోసం సగం నిజానీ మాత్రమే చూపిస్తూ మిగతాది కట్టుకథలు అల్లడం..

ఇలా మారితే
సాటిలైట్ మీడియా కి ఇండిపెండెంట్ మీడియా కి
డిఫరెన్స్ ఎక్కడుంది ఇంకా..?

అంటే జనాలు ఇదే కోరుకుంటున్నారు కాబట్టి
జర్నలిజం తన స్టాండర్డ్స్ తగ్గించుకోవాలా?
అలా అని కొత్త రూల్స్ పెట్టుకున్నారా…?

లేకపోతే ఎటు వెళ్తుంది ఈ జర్నలిజం…?
జనాలను ఎడ్యుకేట్ చేయడం….
సమాజాన్ని ప్రశ్నించే విధానం నేర్పించడం
నిజాన్ని నిర్భయంగా సింపుల్‌గా జనాలకు చేర్చడం….
ఇవి జర్నలిజం యొక్క కనీస బాధ్యతలు కాదా?
న్యూస్ ఛానల్స్‌కు ఒక డైరెక్ట్ ప్రశ్న:

మీరు దేశాన్ని ప్రజల ముందు ఉంచుతున్నారా ?
లేక జర్నలిజాన్ని జబర్దస్త్ షోలా మార్చుతున్నారా?

బ్రేకింగ్ న్యూస్ పేరిట
మీరు చేస్తున్నది ఏంటి….?

జనాల పొజిటివ్ ఆలోచనా విధానాన్ని బ్రేక్ చేస్తున్నారు….
సమాజాన్ని పోలరైజ్ చేస్తున్నారు….
తప్పుడు సమాచారం తో లేదంటే అనవసర మైన సమాచారం తో యూత్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు….
ఇది తెలియక చేస్తున్నారా?
లేక తెలిసీ చేస్తున్నారా?

నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే…
మీరు న్యూస్‌ని కంటెంట్‌గా చూస్తున్నంత వరకూ
జర్నలిజం ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటుంది.

ఎప్పటికి బాధ్యత తో కూడిన జర్నలిజం అవ్వదు అలాగే దేశాన్ని ధర్మమైన మార్గం లో నడపదు…

ఈ దేశానికి కావాల్సింది సందేశం తో కూడిన సమాచారం…
24 గంటల లైవ్ ఎంటర్టైన్మెంట్ కాదు..

మరి దీన్ని ఆపేది ఎవరు?
ప్రభుత్వం చేయాలి అంటూ పక్కకి నెట్టేసి చేతులు దులుపుకుందామా…?
లేక న్యూస్ చానల్స్ వారిదే తప్పంటు మనలోని తప్పుల్ని వెనకేసుకొద్దామా…?

మీరు ఇరవైనాలుగు గంటలు ఫోన్ చేతిలో పెట్టుకుని
నచ్చినవి క్లిక్ చేస్తూ…
అందరికి షేర్ చేస్తూ…అదే జీవితం అనుకుంటూ
మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మానేసిన మీరు మారితే…అంటే..
మీరు ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజే
న్యూస్ మళ్లీ జర్నలిజం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *