అబద్ధాల ఫ్యాక్టరీలో తయారైన ‘సూట్‌కేసు’ కథలు… బండి సంజయ్‌పై విషం చిమ్మేందుకు విపక్షాల ‘ఫేక్’ స్కెచ్!

(కరీంనగర్ పొలిటికల్ డెస్క్): రాజకీయం అంటే ప్రజాసేవ అనుకునే రోజులు పోయాయి. ప్రత్యర్థిని ఎదుర్కోలేక, వ్యక్తిత్వ హననానికి (Character Assassination) పాల్పడటమే ఇప్పుడు నయా ట్రెండ్. సరిగ్గా ఇదే తంతు ఇప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో నడుస్తోంది. కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ లక్ష్యంగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక పక్కా ప్రణాళికతో కూడిన దుష్ప్రచారం జరుగుతోంది. “సూట్‌కేసులకు టికెట్లు”, “కుటుంబ పెత్తనం” అంటూ సర్క్యులేట్ అవుతున్న రాతల వెనుక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు బట్టబయలవుతోంది.

సూట్‌కేసు రాజకీయాలు ఎవరివి? సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన బండి సంజయ్ చరిత్ర కరీంనగర్ ప్రజలకు తెరిచిన పుస్తకం. డబ్బు రాజకీయాలకు, పైరవీలకు ఆయన బద్ధ వ్యతిరేకి అన్న విషయం సొంత పార్టీ నేతలకే కాదు, ప్రత్యర్థి పార్టీలకూ తెలుసు. అలాంటి వ్యక్తిపై “టికెట్లు అమ్ముకున్నారు” అనే నింద వేయడం అంటే.. సూర్యుడి మీద ఉమ్మి వేయడమే. టికెట్ల కేటాయింపులో అసంతృప్తులు సహజం. కానీ, దానిని ఆసరాగా చేసుకుని, కొందరు అజ్ఞాత శత్రువులు ‘ఫేక్ న్యూస్’ సృష్టించి, కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాలని చూడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.

‘బ్రదర్స్’ పేరుతో బ్లాక్ మెయిల్ పాలిటిక్స్? బండి సంజయ్ సోదరులను, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగుతూ రాస్తున్న రాతలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడినవే అని స్పష్టమవుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా.. గెలుపు గుర్రాలకే టికెట్లు అన్నది బీజేపీ సిద్దాంతం. కానీ, డబ్బు ఇచ్చినోళ్లకే టికెట్లు అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు మొసలి కన్నీరు కారుస్తూ పోస్టులు పెట్టడం హాస్యాస్పదం. నిన్నటి వరకు బండి సంజయ్ ని తిట్టిన నోళ్లే, నేడు ఆయన మీద సానుభూతి ఉన్నట్లు నటిస్తూ.. “నమ్మించి గొంతు కోశారు” అని లేఖలు రాయడం వెనుక ఉన్నది “రాజకీయ భయం” తప్ప మరొకటి కాదు.

ఓటమి భయంతోనే ‘ఫేక్’ ప్రచారం! బండి సంజయ్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతుండటంతో, వచ్చే ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టడం అసాధ్యమని గ్రహించిన ప్రత్యర్థులు ఎంచుకున్న మార్గమే ఈ “ఫేక్ న్యూస్”. బేతి మహేందర్ రెడ్డి వంటి సీనియర్ల పేర్లను వాడుకుంటూ, పార్టీలో చిచ్చు పెట్టాలని చూస్తున్న విపక్షాల పాచికలు పారవు. బీజేపీ క్యాడర్ ఒక కుటుంబం లాంటిది. అక్కడ అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ, సిద్ధాంత రీత్యా అందరూ ఒక్కటే.

బాధ్యత గల మీడియాగా మా ప్రశ్న ఇదే… ఆరోపణలు చేసేవాళ్లకు దమ్ముంటే ఆధారాలతో ముందుకు రావాలి. అంతేకానీ, చీకట్లో ఉండి రాళ్లు విసిరే పిరికిపందల చర్యలను జర్నలిజం సమర్థించదు. డబ్బు సంచులతో రాజకీయం చేసే సంస్కృతి ఎవరిదో తెలంగాణ సమాజానికి తెలుసు. నీతి, నిజాయితీకి కట్టుబడిన బండి సంజయ్ లాంటి నాయకుడిపై బురద చల్లితే, అది తిరిగి మీ ముఖం మీదే పడుతుందని గుర్తుంచుకోండి.

కరీంనగర్ ప్రజలారా… అప్రమత్తంగా ఉండండి. ఈ విష ప్రచారాలను నమ్మకండి. వాస్తవాలను గ్రహించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *