కాషాయం జనసేన కవాతు…ఇది పొత్తు కాదు… అవినీతి కోటలను కూల్చే ‘ధర్మయుద్ధం’….

తెలంగాణ రాజకీయాల్లో ఒక ప్రచండ ఝంజావాతం మొదలైంది…. అవినీతి అనకొండల వెన్నులో వణుకు పుట్టించే సమయం ఆసన్నమైంది….

ఈ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏదో సామాన్యమైన రాజకీయ ఎత్తుగడ అనుకుంటున్నారా❓

కానే కాదు…. ఇన్నాళ్లూ ఓట్ల చీలికతో పబ్బం గడుపుకున్న అసమర్థ పార్టీల పాలిట మరణ శాసనం…. దొరల గడీలను బద్దలు కొట్టేందుకు సిద్ధమైన ఒక “మాస్టర్ స్ట్రోక్”.

గత ఎన్నికల్లో జరిగింది ఏంటి❓ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే…. లబ్ది పొందింది ఎవరు..❓ మళ్ళీ ఆ అవినీతి పార్టీలే గద్దెనెక్కలేదా..❓ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇన్నాళ్లు పగటికలలు కన్నాయి… “జనసేన పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి, మనం దర్జాగా గెలవొచ్చు” అని…

కానీ ఇప్పుడు ఆ ఆశలు గల్లంతు…. “రాష్ట్ర ప్రయోజనాల కోసం, అవినీతి రహిత సమాజం కోసం నేను తగ్గడానికైనా సిద్ధమే” అంటూ జనసేనాని తీసుకున్న నిర్ణయం…. రాజకీయ త్యాగం కాదు… అది ఒక “యుద్ధ తంత్రం”….

ఇప్పుడు అక్కడ ఉన్నది ఒంటరి బీజేపీ కాదు.. జనసేన బలం తోడైన మహా శక్తి…. ఇది ‘పవర్’ పాలిటిక్స్ కాదు.. ప్రజా రక్షణ….

అసలు మీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి ఏంటి❓ హైదరాబాద్ దాటితే పట్టణాల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా❓

చిన్న వర్షానికే రోడ్లు చెరువులైతే ప్రశ్నించే నాథుడు ఉన్నాడా…❓ డ్రైనేజీలు పొంగిపొర్లినా పట్టించుకునే దిక్కు ఉందా…❓

కేంద్రం పంపే ‘స్మార్ట్ సిటీ’, ‘అమృత్’ నిధులను దారి మళ్లించి… తమ అనుచరుల జేబులు నింపుకుంటున్న తీరును ఇంకా ఎంతకాలం భరిద్దాం…❓❓

ఇలాంటి దౌర్భాగ్యపు పాలనకు చరమగీతం పాడాలంటే.. మోదీ గారి ‘అభివృద్ధి మంత్రం’.. పవన్ గారి ‘పోరాట తత్వం’ కలవాల్సిందే.

మరీ ముఖ్యంగా “సెటిలర్స్” గా పిలవబడుతున్న సోదరులారా… ఇది మీకు ఒక సువర్ణావకాశం…. ఇన్నాళ్లూ మిమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుని, అవసరం తీరాక చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం రాలేదా…❓ మీ సత్తా ఏంటో బ్యాలెట్ బాక్స్ ద్వారా చూపించాల్సిన తరుణం ఇది….

యువతరం ఆలోచించాలి…. నిరుద్యోగంతో మీరు అల్లాడుతుంటే.. పాలకులు రాజకీయ క్రీడల్లో మునిగి తేలుతున్నారు. మాయమాటలు చెప్పే పార్టీల మోజులో పడకండి. అభివృద్ధి చేసే ఇంజిన్‌కు ఓటు వేయండి….

జనసైనికుల్లారా.. నిరాశ వద్దు…. యుద్ధంలో గెలవాలంటే కొన్నిసార్లు వెనక్కి తగ్గడం కూడా ఒక గొప్ప వ్యూహమే…. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకుంది మన బలహీనతతో కాదు, మన బలాన్ని సరైన చోట దెబ్బ కొట్టడానికి…. గెలిచేది కమలం పువ్వు అయినా.. ఆ గెలుపు వెనుక ఉండేది మన జనసేన స్వేదమే….

ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ సామాన్యమైనది కాదు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం….

సనాతన ధర్మాన్ని హేళన చేసేవారికి.. హిందువుల ఓట్లతో గెలిచి హిందువులనే తొక్కేసేవారికి.. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వారికి.. ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి….

“జై శ్రీరామ్” అంటూ కమలం గుర్తుకు ఓట్ వేస్తే.. ఆ శబ్దం ఢిల్లీ దాకా వినిపించాలి….

యుద్ధం మొదలైంది.. ఇక వేట మామూలుగా ఉండదు! జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *