కరీంనగర్ భవిష్యత్తు బీజేపీ లిఖించబోతుందా?
కరీంనగర్ రాజకీయాల్లో నిజంగా ఏమి జరుగుతోంది?
ప్రజల విశ్వాసం మాట్లాడబోతుందా…?
లేక హామీలా..?
కరీంనగర్ రాజకీయాలపై డేటా ఆధారిత పరిశీలనలు పలు సందేహాలను లెవనెత్తుతుంది..
1998–99లో BJP వాజ్పేయి ప్రభుత్వ కాలంలో
C. విద్యాసాగర్ గారు..
2004 నుంచి 2008 వరకు MPగా కేసీఆర్ (TRS)
మళ్లీ
2019 నుంచి ఇప్పటివరకు BJP నుండి బండి సంజయ్
ఈ మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణాన్ని చూస్తే..
కరీంనగర్ ఓటరు తీర్పు మారుతోందా… లేక పునరావృతమవుతోందా?
డేటా ఏం చెబుతోంది?
2019లో బండి సంజయ్కు 4,98,276 ఓట్లు..
ఇటీవల ఎన్నికల్లో 5,85,116 ఓట్లు..
అంటే 1.15% ఓటింగ్ పెరుగుదల కనిపిస్తుంది..
గతంతో పోలిస్తే ప్రజా మద్దతు పెరిగింది అని స్పష్టం ఇక్కడ…
ఇక కేసీఆర్ విషయానికి వస్తే…
2004–06 మధ్య రెండు సార్లు ఎన్నికలు
ఒకసారి 3.78 లక్షల ఓట్లు, తర్వాత 4,51,199 ఓట్లు
కానీ అప్పుడు కరీంనగర్లో అభివృద్ధి కనిపించిందా? అంటే శూన్యమ్..
ఇక్కడే అసలు ప్రశ్న ప్రజలను అభివృద్ధి దిశగా నడుపితుంది…
కేసీఆర్ గెలిచిన కాలంలో అభివృద్ధి కనుచూపు మేరలో కూడా లేకపోతే
బండి సంజయ్ గెలిచిన తర్వాత ఎందుకు ఇంతలా అభివృద్ధి కనిపిస్తోంది?
ఇది కేవలం రాజకీయ ఆరోపణా?
లేక ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించి ఇచ్చిన తీర్పా?
గ్రామీణ రాజకీయాల్లో మార్పు ఎందుకు వస్తోంది?
ఇంతవరకు పట్టణ ఓటర్లకే పరిమితమైన BJP…
MLC ఎన్నికల్లో విజయం
అదే ఊపుతో
ఇటీవల 100 పైగా సర్పంచ్లు BJP మద్దతుతో గెలవడం
ఇది యాదృచ్ఛికమా?
లేక గ్రామీణ ఓటరు విశ్వాసంలో వచ్చిన మార్పు సంకేతమా?
మరి కాంగ్రెస్ 400+ హామీలు ఎందుకు పని చేయలేదు?
ప్రజలు హామీలను నమ్మలేదా?
లేక పనితనం చూసి ఓటేశారు?
సర్పంచ్ ఎన్నికల్లో BJPకి వచ్చిన మద్దతు దానికి నిదర్శనమా?
ఈ పరిస్థితుల్లో
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో
BJP మేయర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది అసలు ప్రశ్న…?
ప్రజల నమ్మకం నిజంగా BJP వైపు షిఫ్ట్ అవుతోందా?
లేక ఇది తాత్కాలికంగా రాజకీయంగా కనిపించే ఒక ఉపా?
పట్టణం మరియు గ్రామం రెండింట్లో ఒకేసారి మద్దతు వస్తే
కరీంనగర్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం రాయబడబోతుందా?
మీ అభిప్రాయం ఏంటి?
డేటా చెబుతున్న నిజాన్ని మీరు ఎలా సమర్ధిస్తారు?