
శుక్రవారం పిఠాపురంలో 12వ సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజు తెలంగాణ ఆంధ్ర కార్యకర్తలతో 25-40వేల మందితో జయకేతనం సభ నిర్వహించిన సంగతి తెలిసినదే. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి సోదరులు నాగబాబు చేసిన కామెంట్స్ పెను దుమారంగా మారాయి.
అందులో నాగబాబు చేసిన కామెంట్స్ ఏమిటి అని పరిశీలిస్తే పిఠాపురంలో గెలిచింది పవన్ కళ్యాణ్ మరియు ప్రజల ద్వారానే ఇంకా ఎవరి వల్ల కాదు అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు రెండు స్థానాల్లో గతంలో డిపాజిట్లు కూడా దక్కని వ్యక్తికి అదే జనసేన పార్టీ వెంటిలేటర్ల మీద ఉన్నప్పుడు పునర్వాయు పోసింది టిడిపి.. పార్టీని మరియు పార్టీ కార్యకర్తలు కష్టాన్ని విశ్వాసం లేకుండా ఇలా మాట్లాడటం నాగబాబు తల పొగరుకు నిదర్శనం అన్ని మేధావి వర్గాల అభిప్రాయం.

నాగబాబు చేసిన రచ్చ మరవకముందే తగుదునమ్మ అంటూ మనం నిలబడడమే కాదు 40 సంవత్సరాలు ఉన్న టిడిపిని నిలబెట్టాము అని తెలుగు తమ్ములను రెచ్చగొట్టేల మాట్లాడడంతో సోషల్ మీడియా వేదికగా పరస్పర దూషణతో టిడిపి జనసేన కార్యకర్తల మధ్యలో తారాస్థాయిలో పెను దుమారం లెగిసింది .

ఈ ఎపిసోడ్ ని ఎన్క్యాష్ చేస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టు ఎపిసోడ్ టిడిపికి కంటే జనసేనకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఉపయోగపడంతా ఇంకెవ్వరికీ లేదు అనే చెప్పుకోవాలి. వాస్తవానికి రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదే కరెక్ట్ ఛాయిస్ అని ఇప్పుడైతే లొంగుతాడని కపట ప్రేమ చూపించి పొత్తు పెట్టుకున్నాడని వైసిపి బ్యాచ్ ఆరోపణ, దానికి ఆర్జం పోస్తు నిన్న పవన్ నాగబాబు కామెంట్స్ ఏ ప్రత్యక్ష ఉదాహరణ!

సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 140+ స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే మ్యాండేట్ ఉన్న పొత్తు ధర్మాన్ని వీడకూడదని అటు బిజెపిని ఇటు జనసేనను కీలక మంత్రుత్వ శాఖలు ఇచ్చి తన క్యాబినెట్లో స్థానాలు కల్పించిన చంద్రబాబు మంచితనం ఇప్పుడు అదే శాపంగా మారనుందా, టీడీపీ కార్యకర్తల తలలు తెగినాయి, కేసులు పాలయ్యాము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నాశనం మళ్లీ ఇలాంటి విమర్శలు వినాలా బాబు గారు అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు.

ఇలా పరస్పరదోషణ చిలికి చిలికి గాలి వాన లెక్క మారితే బిజెపికి నష్టం అయ్యే ఛాన్స్ ఎందుకంటే జనసేన కంటే టిడిపి నుంచి ఎంపీ స్థానాలు ఎక్కువగా వచ్చాయి 20 మంది ఎంపీ స్థానాలు టీడీపీ ఉండగా కేవలం రెండు స్థానాలు జనసేన ఉన్న సంగతి మనకు తెలిసినది. పవన్ పై కోపంతో బిజెపికి మద్దతు ఉపసంహరించుకుంటే దేశంలో మరలా ఎన్నికలు జరిగే అవకాశం ఉండవచ్చని మేధావివర్గుల అభిప్రాయం.