ముంబై మారణహోమం: డీకోడింగ్ ఆపరేషన్ ‘జింక్ ఫాస్ఫైడ్’

ముంబై… దేశ ఆర్థిక రాజధాని. ఎన్నో ఉగ్రదాడి కుట్రలను చూసిన నగరం. అయితే, ఈసారి ఉగ్రవాదులు లేదా నేరస్థులు ఎంచుకున్న రూట్ పూర్తిగా భిన్నమైనది. బాంబులు కాదు, తుపాకులు కాదు.. ప్రాణాలు నిలబెట్టే ‘మందు’నే మృత్యుపాశంగా మార్చారు. ముహర్రం ర్యాలీలో ఏకంగా 30 వేల మందిని టార్గెట్ చేస్తూ పన్నిన ఈ ‘మెడికల్ టెర్రరిజం’ కుట్ర ఇప్పుడు నిఘా వర్గాలను సైతం విస్తుపోయేలా చేస్తోంది.

అసలు ఈ కుట్రకు మాస్టర్ మైండ్ ఎవరు? దీని వెనుక ఉన్న ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఏంటి? ఇన్వెస్టిగేషన్‌లో బయటపడుతున్న షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం.

మృత్యువు పంపిణీ.. ముహర్రం ర్యాలీలో ఏం జరిగింది?

అది ముంబైలోని రద్దీగా ఉండే ప్రాంతం. ముహర్రం ర్యాలీలో దాదాపు 30 వేల మందికి పైగా జనం పాల్గొన్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక యువకుడు జనాల్లోకి చొరబడ్డాడు. ఉచితంగా మందులు పంచుతున్నానంటూ క్యాప్సూల్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఏంటి ఈ మందు అని అడిగితే.. ఆరోగ్యానికి మంచిది, బాడీ పెయిన్స్ తగ్గుతాయి అంటూ నమ్మించాడు.

అలా ఆ మందులు తీసుకున్న వారిలో ‘సల్మాన్ సయ్యద్’ అనే వ్యక్తి ఒకరు. ఆ క్యాప్సూల్ వేసుకున్న కొద్ది నిమిషాలకే సల్మాన్‌కు తీవ్రమైన కడుపునొప్పి, విపరీతమైన వాంతులు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో వెంటనే ముంబై పోలీసులకు సమాచారం అందింది. అలర్ట్ అయిన పోలీసులు.. మెరుపుదాడి చేసి ఆ మందులు పంచుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మెడిసిన్ కాదు.. మైండ్ బ్లాంక్ చేసే పాయిజన్!

పోలీసులు ఆ క్యాప్సూల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా కళ్లు బైర్లు కమ్మే నిజం వెలుగులోకి వచ్చింది. ఆ క్యాప్సూల్స్ లో ఉన్నది సాధారణ మందు కాదు.. ప్రాణాలను గాలిలో కలిపేసే అత్యంత ప్రమాదకరమైన ‘జింక్ ఫాస్ఫైడ్’ (Zinc Phosphide). సాధారణంగా దీనిని ఎలుకల మందులో, తీవ్రమైన క్రిమిసంహారకాలుగా వాడతారు. మనిషి శరీరంలోకి ఇది కొద్ది మొత్తంలో వెళ్లినా, కడుపులోని ఆమ్లాలతో కలిసి ఫాస్ఫైన్ గ్యాస్‌గా మారి, గుండె, కాలేయం, కిడ్నీలను డ్యామేజ్ చేసి నిమిషాల్లో ప్రాణాలు తీస్తుంది.

ఎవరీ ఫయాజ్ ప్రేమ్‌జీ? వాట్ ఈజ్ హిజ్ బ్యాక్‌గ్రౌండ్?

పోలీసుల విచారణలో నిందితుడి పేరు ‘ఫయాజ్ ప్రేమ్‌జీ’ (వయసు 34) అని తేలింది. ఇతని ప్రొఫైల్ చూస్తే ఏ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న రౌడీ షీటరో కాదు. పుణేలోని ఖరీదైన విమాన్ నగర్ ప్రాంతానికి చెందిన వాడు. BBA (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) చదివాడు. బయటకు మాత్రం తాను ఒక ‘పెయింట్ బిజినెస్’ చేస్తున్నానని కవరింగ్ ఇస్తుంటాడు.

కానీ, 15 రోజుల క్రితమే తన మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయడానికి పుణే నుంచి ముంబై షిఫ్ట్ అయ్యాడు. డోంగ్రీ ప్రాంతంలో ఒక గది అద్దెకు తీసుకుని తన ‘ఆపరేషన్ మృత్యువు’కు శ్రీకారం చుట్టాడు.

50 కిలోల విషం.. 30 వేల మృత్యు గుళికలు (The Modus Operandi)

ఫయాజ్ ప్రేమ్‌జీ ప్లాన్ ఎంత పక్కాగా ఉందంటే.. ఏకంగా 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్‌ను మార్కెట్ నుంచి దొంగచాటుగా కొనుగోలు చేశాడు. ఒక్కో ఖాళీ క్యాప్సూల్‌లో సరిగ్గా ఒక గ్రాము చొప్పున విషం నింపాడు. తన టార్గెట్ 30,000 క్యాప్సూల్స్ నింపడం. పోలీసులు అరెస్ట్ చేసే సమయానికే, డోంగ్రీలోని తన గదిలో 14,900 క్యాప్సూల్స్‌ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఒక్కొక్క క్యాప్సూల్ ఒక్కో ప్రాణం తీయడానికి సరిపోతుంది. అంటే 30 వేల మందిని చంపాలన్నది వాడి టార్గెట్.

“అనుమతి లేకుండా మందులు పంచుతున్న సమయంలో పక్కా సమాచారంతో నిందితుడిని అరెస్ట్ చేశాం. ఇతని వెనుక ఏదైనా పెద్ద సంస్థ ఉందా? ఇంత పెద్ద ఎత్తున విషం ఎలా సేకరించాడు? అనే కోణంలో డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.” – జయంత్ మీనా, డీసీపీ, ముంబై పోలీస్.

ఇరాన్, ఇరాక్ కనెక్షన్.. ఉగ్రవాద స్లీపర్ సెల్సా?

ఇప్పుడు పోలీసుల ముందున్న అతి పెద్ద ప్రశ్న.. ఇదంతా ఫయాజ్ ప్రేమ్‌జీ ఒక్కడే చేశాడా? లేక వెనుక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా?

పోలీసులు ఫయాజ్ పాస్‌పోర్ట్, ఆధార్ సీజ్ చేసి విచారించగా భారీ ట్విస్ట్ బయటపడింది. 2025లో ఫయాజ్ ఇరాన్, ఇరాక్ దేశాల్లో పర్యటించాడు.

  • సాధారణ బిజినెస్ పేరుతో వెళ్లి, అక్కడ ఉగ్రవాద సంస్థలతో కానీ, స్లీపర్ సెల్స్ తో కానీ టచ్ లోకి వెళ్లాడా?
  • 50 కిలోల పాయిజన్ కొనడానికి, 15 రోజులు ముంబైలో మకాం వేయడానికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది?
  • అసలు మతపరమైన ర్యాలీనే ఎందుకు టార్గెట్ చేశాడు? మత ఘర్షణలు సృష్టించే కుట్ర ఏమైనా ఉందా?

అనే కోణంలో ముంబై ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్), ఇతర నిఘా వర్గాలు ఇప్పుడు విచారణను వేగవంతం చేశాయి.

ఒకవేళ ముంబై పోలీసుల టైమింగ్ కొంచెం మిస్ అయి ఉంటే, ఈపాటికి ముంబై వీధుల్లో వేలాది శవాలు గుట్టలుగా పడి ఉండేవి. ఒక ఉన్నత విద్యావంతుడు, సమాజంలో ఒక సాధారణ పౌరుడిగా తిరుగుతూ ఇంతటి ఘోరానికి ప్లాన్ చేయడం సిస్టమ్‌లో ఉన్న లొసుగులను, స్లీపర్ సెల్స్ ఎంత డీప్‌గా పాతుకుపోయాయో ఎత్తి చూపుతోంది. ఈ కేసు వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు అనేది ముందు ముందు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *