Sanskrit Belongs To India Archives -

దివాలా తీసిన పాకిస్తాన్ దొంగ బుద్ధి! చుక్క నీటి కోసం మన సనాతన ధర్మాన్ని, చరిత్రను దొంగిలించే సిగ్గుమాలిన కుట్ర!
ఒకప్పుడు భారత్ అంటే పళ్లు నూరిన దేశం, హిందువులంటేనే పాఠ్యపుస్తకాల్లో విషం చిమ్మిన దేశం.. ఇప్పుడు అకస్మాత్తుగా “సంస్కృతం మాది, చాణక్యుడు మావాడు, సింధు నాగరికత మాదే” అంటూ సరికొత్త నాటకానికి తెరలేపింది. ఆర్థికంగా దివాలా తీసి, తిండికి గతిలేని పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా మన ఘనమైన చరిత్రను దొంగిలించే పనిలో పడింది. అసలు ఈ బరితెగింపు వెనుక ఉన్నది పాకిస్తాన్ మేధోవికాసం కాదు, దాహంతో అల్లాడిపోతున్న ఒక బిచ్చగాడి భయం! అడుక్కోవడానికి సెక్యులర్ ముసుగు వేస్తున్న పాకిస్తాన్ అసలు కుట్రను ఇక్కడ బట్టబయలు చేద్దాం.

చరిత్రను దొంగిలించే దౌర్భాగ్య స్థితి: పాకిస్తాన్ అంటేనే అబద్ధం మీద, హిందూ ద్వేషం మీద పుట్టిన దేశం. జిన్నా ‘టూ నేషన్ థియరీ’ (ద్విజాతి సిద్ధాంతం) పునాదులే ముస్లింలు, హిందువులు వేరని, వారి సంస్కృతులు ఎప్పటికీ కలవవని స్పష్టంగా చెప్పాయి. ఇన్నేళ్లుగా తాము అరేబియా, పర్షియా, టర్కీల నుంచి వచ్చామని, మొఘలులు, ఘజనీలే తమ ఐడెంటిటీ అని చంకలు గుద్దుకున్న దద్దమ్మలు వీరు. కానీ ఇప్పుడు ఏకంగా దైవభాషగా మనం కొలిచే సంస్కృతానికి వ్యాకరణం రాసిన ‘పాణిని’ తమ వాడని, అర్థశాస్త్రాన్ని రచించిన ‘చాణక్యుడు’ తమ వాడని సిగ్గులేకుండా క్లెయిమ్ చేస్తున్నారు. పాణిని గారు తన ‘అష్టాధ్యాయి’లో ఈ ప్రాంతాన్నంతటినీ కలిపి భౌగోళికంగా ‘భారత్’ అని పిలిచారు తప్ప ఎక్కడా పాకిస్తాన్ అనే ప్రస్తావన లేదు. ఇస్లాం, టర్కిష్ బ్లడ్ పుట్టక ముందు కాలం నాటి బౌద్ధుడైన రాజా పోరస్‌ను సైతం పాకిస్తానీగా మార్చే దారుణమైన ప్రాపగాండాకు వాళ్ళ నాయకులు తెరలేపారు.

అసలు భయం ఎక్కడుంది? నీళ్లు! ఈ దొంగ నాటకాలన్నింటి వెనుక ఉన్న ఏకైక కారణం.. నీళ్లు! ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన కాశ్మీర్‌లో హిందూ యాత్రికుల మీద దాడులు చేస్తున్న పాకిస్తాన్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. “ఉగ్రవాదం, నీళ్లు ఒకేసారి పారలేవు” అని మన ప్రభుత్వం తెగేసి చెప్పింది. 1960 సింధు నదీ జలాల ఒప్పందం (Indus Water Treaty) ప్రకారం మనకు హక్కున్న తూర్పు నదుల (రావి, బియాస్, సట్లెజ్) నీటిని పాకిస్తాన్‌కు వెళ్లకుండా కట్టడి చేశాం. షాపూర్ కండి డ్యామ్ పూర్తి చేసి, మన నీటిని చుక్క కూడా దాయాదికి వెళ్లకుండా ఆపాం. దీంతో పాటు పశ్చిమ నదులైన చీనాబ్, జీలంలపైన కూడా అగ్రెసివ్‌గా ప్రాజెక్టులు (సవల్కోట్, రాట్లే, కిరు) నిర్మిస్తూ పాకిస్తాన్ గొంతు నులుముతున్నాం.

దీంతో భయపడిపోయిన పాకిస్తాన్ నాయకులు అణుబాంబులు వేస్తాం, క్షిపణులు ప్రయోగిస్తాం, చైనాతో బ్రహ్మపుత్ర నీళ్లు ఆపిస్తాం అని మొరిగారు. కానీ ఇండియా వాటిని గడ్డిపోచతో సమానంగా తీసిపారేసింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టుకు (హేగ్), ఐక్యరాజ్యసమితికి, వరల్డ్ బ్యాంక్ కు వెళ్లి కాళ్లు పట్టుకున్నా లాభం లేకపోయింది. మన ప్రభుత్వం వారి ఏకపక్ష తీర్పులను చెత్తబుట్టలో వేసి దమ్మున్న దేశంలా నిలబడింది.

‘చిల్డ్రన్ ఆఫ్ ఇండస్’ – ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్: అన్ని దారులూ మూసుకుపోవడంతో పాకిస్తాన్ ఈ కొత్త ఎత్తుగడ వేసింది. పాకిస్తాన్ మంత్రులు ఖవాజా ఆసిఫ్, అతుల్లా త్రార్ లాంటి వాళ్ళు “మేము చిల్డ్రన్ ఆఫ్ ఇండస్ (సింధు నాగరికత బిడ్డలం), ఆ నీటి మీద మాకు చారిత్రక హక్కు ఉంది” అంటూ సెంటిమెంట్ రగుల్చుతున్నారు. లాహోర్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సులు పెట్టడం, విదేశీ డిప్లమాట్లకు ట్యాక్సిలా లాంటి బౌద్ధ క్షేత్రాలు చూపించి చైనా లాంటి దేశాల నుంచి సిపెక్ (CPEC) నిధులు దండుకోవడం వీరి అసలు ప్లాన్. బసంత్ (వసంత పంచమి) లాంటి మన హిందూ పండుగలను తమవిగా జరుపుకుంటూ, అందులోంచి సరస్వతీ దేవి పూజను మాత్రం తెలివిగా పీకేసి, ఒక ప్రాంతీయ పండుగగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కేవలం నీళ్ల కోసం ప్రపంచాన్ని ఏమార్చడానికి వేస్తున్న ముసుగు మాత్రమే.

హిందూ ఫోబియాతో రగిలిపోయే దేశం: జనరల్ జియా-ఉల్-హక్ కాలం నుంచి పాకిస్తాన్లో 7వ తరగతి పిల్లల మెదళ్లలో సైతం హిందువులంటే కుట్రదారులు అనే విషం నింపారు. చీర కట్టుకోవడం హిందూ సంస్కృతి అని దాన్ని నిషేధించిన మూర్ఖులు వీరు. ఈరోజుకు కూడా లాహోర్లో హిందూ, సిక్కుల పేర్లున్న వీధులకు మళ్లీ ఆ పాత పేర్లు పెడతామంటే అక్కడి కరుడుగట్టిన ఇస్లామిస్టులు, ఉగ్రవాద మూకలు అంగీకరించలేదు, ఆ ప్రభుత్వాన్ని బెదిరించి వెనక్కి తగ్గేలా చేశారు. తమ సొంత గడ్డపై ఒక హిందువు పేరును భరించలేని ఈ దేశానికి, ఇప్పుడు చాణక్యుడు, పాణిని కావాల్సి వచ్చారు.

భౌగోళికంగా కొన్ని సింధు నాగరికత ప్రాంతాలు పాకిస్తాన్ భూభాగంలో ఉండొచ్చు, కానీ ఆ సంస్కృతి, ఆ జీవనాడి భారత్‌లోనే నేటికీ సజీవంగా ఉన్నాయి. మొహంజోదారోలో దొరికిన పశుపతి (శివుడు) ముద్ర నుండి, ఈరోజు మన గుళ్లలో చదివే సంస్కృత మంత్రాల వరకు.. ఆ వారసత్వం, ఆ సివిలైజేషనల్ కంటిన్యూటీ భారతీయులది మాత్రమే! ఇస్లాం మతం కోసం దేశాన్ని ముక్కలు చేసుకొని, ఆ ఐడెంటిటీ క్రైసిస్‌తో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, ఇప్పుడు బ్రతకడానికి మన ఐడెంటిటీని దొంగిలించాలని చూస్తోంది. ఒకవేళ వాళ్ళు తమ హిందూ మూలాలను ఒప్పుకుంటే, ఇక రెండు దేశాలుగా విడిపోవడానికి అర్థమే లేదు కదా? కపట బుద్ధితో, కుయుక్తులతో మన చరిత్రను అపహాస్యం చేసి నీళ్లు దొంగిలించాలనుకుంటున్న పాకిస్తాన్ ఆటలు ఇక సాగవు. నవభారతం వారి కుతంత్రాలను ఉక్కుపాదంతో అణిచివేస్తుంది

The post దివాలా తీసిన పాకిస్తాన్ దొంగ బుద్ధి! చుక్క నీటి కోసం మన సనాతన ధర్మాన్ని, చరిత్రను దొంగిలించే సిగ్గుమాలిన కుట్ర! appeared first on .