China Hukou system Telugu Archives -

ఎవరూ చూడని చైనా చీకటి కోణం!
ప్రపంచాన్ని మోసంచేస్తున్న డ్రాగన్ వెనుక దాగున్న దారుణమైన నిజాలు!

ఆకాశాన్ని తాకే భవనాలు (Skyscrapers), ప్రపంచంలోనే అత్యుత్తమ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్, మైండ్ బ్లాక్ అయ్యే స్మార్ట్ సిటీలు, ఎటు చూసినా టెక్నాలజీ.. బయట ప్రపంచానికి ‘చైనా’ అనగానే కనిపించే చిత్రం ఇది. సుమారు 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో ప్రపంచానికి అతిపెద్ద ‘ఫ్యాక్టరీ’గా మారిన చైనా, తన గ్లిట్టరింగ్ ఇమేజ్ ని కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఆ అద్దాల మేడల వెనుక, కనీసం పూట గడవని, కన్న బిడ్డల ముఖం చూడలేని కోట్ల మంది కన్నీటి గాథలు ఉన్నాయి.

తన దేశంలోని భయంకరమైన వివక్షను, దరిద్రాన్ని కప్పిపుచ్చుకోవడానికి చైనా ఎంచుకున్న మార్గం.. ఇతర దేశాలపై, ముఖ్యంగా ఎకానమీలో తనకు గట్టి పోటీ ఇస్తున్న ‘భారతదేశం’ పై ఆన్లైన్ వేదికగా విషప్రచారాన్ని (Propaganda) చేయడం. అసలు చైనా చేస్తున్న ఈ కుట్రల వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? స్వంత దేశంలోనే ప్రజలను చైనా ఎలా బానిసలుగా చూస్తోంది? ఈ డీప్ ఇన్వెస్టిగేషన్ లో వెలుగుచూసిన సంచలన వాస్తవాలు మీకోసం.

సింగపూర్ లో బట్టబయలైన ‘చైనా ప్రాపగాండా’

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో భారతీయుల మీద, ఇండియన్ కల్చర్ మీద నెగెటివిటీ విపరీతంగా పెరగడాన్ని మీరు గమనించే ఉంటారు. ఇండియన్స్ అంటే శుభ్రత లేని వారని, ఇండియన్ కల్చర్ తక్కువ స్థాయిది అని ఒక నరేటివ్ ని సెట్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్నది చైనా బేస్డ్ ప్లాట్ఫార్మ్స్ అని సింగపూర్ లో జరిగిన ఒక సంఘటనతో అఫీషియల్ గా బయటపడింది.

సింగపూర్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ పసిగట్టిన ఈ కుట్రను స్టెప్-బై-స్టెప్ ఎలా అమలు చేశారో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే:

స్టెప్ 1 – భయం సృష్టించడం: సింగపూర్ తన సొంత కల్చర్ ని, తన ఐడెంటిటీని కోల్పోతోందని చైనీస్ భాషలోని గ్రూప్స్ లో ఫేక్ పోస్ట్లు స్టార్ట్ చేశారు.

స్టెప్ 2 – టార్గెట్ ఇండియా: సింగపూర్ ని ఇండియన్స్ ఆక్రమించేస్తున్నారని, వారి వల్లే సింగపూర్ కల్చర్ నాశనం అవుతోందని ప్రచారం చేశారు. (వాస్తవానికి సింగపూర్ లో ఇండియన్స్ ఉన్నది కేవలం 9% మాత్రమే).

స్టెప్ 3 – ఫేక్ విజువల్స్: సింగపూర్ లోని ‘లిటిల్ ఇండియా’ అనే ప్రాంతంలో వారాంతాల్లో (వీకెండ్స్) ఎప్పుడో మైగ్రెంట్ వర్కర్స్ తో రద్దీగా ఉన్న ఫోటోలను వాడుకుంటూ, “చూడండి సింగపూర్ ని ఎలా ఆక్రమించారో” అని భయభ్రాంతులకు గురిచేశారు.

స్టెప్ 4 – జాత్యహంకారం (Racism): ఇండియన్స్ పెరిగిపోవడాన్ని “కాన్సంట్రేషన్ ఆఫ్ కర్రీ (Concentration of Curry)” అని చాలా దారుణమైన జాత్యహంకార పదాలతో పోస్ట్లు పెట్టారు.

దీనిపై వెంటనే అలెర్ట్ అయిన సింగపూర్ హోమ్ మినిస్ట్రీ, ‘ఆన్లైన్ క్రిమినల్ హామ్స్ యాక్ట్’ కింద ఇలాంటి 14 సోషల్ మీడియా పోస్టులను వెంటనే బ్లాక్ చేయించి, ఇది పక్కాగా బయటి దేశాల నుంచి ప్లాన్ చేసి చేస్తున్న దాడిగా (Foreign interference) తేల్చింది.

మణిపూర్ నుండి కెనడా దాకా.. డ్రాగన్ మాస్టర్ ప్లాన్

కేవలం సింగపూర్ లోనే కాదు, భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో బద్నాం చేయడానికి చైనా భారీ నెట్వర్క్ నే నడుపుతోంది.

మణిపూర్ అల్లర్లు: మణిపూర్ అల్లర్ల సమయంలో ‘సెంగ్ జియాంగ్’ అనే చైనీస్ ప్రొఫెసర్ రంగంలోకి దిగి “మణిపూర్ ఇండియాలో భాగం కాదు, అది మినీ చైనా” అని ప్రచారం చేశాడు. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం, మయన్మార్ ఉగ్రవాదుల ద్వారా మణిపూర్ మిలిటెంట్స్ కు చైనీస్ ఆయుధాలు సప్లై అయ్యాయి.

కెనడా వివాదం & దలైలామా: ఇండియా-కెనడా మధ్య వివాదం రాజుకున్నప్పుడు కెనడాలో యాంటీ-ఇండియా సెంటిమెంట్ ను రగిలించింది ఈ చైనా ‘బాట్స్ (Bots)’. అలాగే దలైలామాకి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ సృష్టించడం వెనుక ఉన్నది కూడా చైనా సైబర్ ఆర్మీనే.

60 కోట్ల మంది నెలకు రూ. 14 వేలతో బ్రతుకుతున్నారా?

ఇండియాలో పేదరికం గురించి ట్రోల్ చేసే చైనాలో అసలు పేదరికం ఎలా ఉందో వాళ్ళ ప్రధానే స్వయంగా బయటపెట్టాడు. 2020లో చైనా ప్రీమియర్ (ప్రైమ్ మినిస్టర్) ‘లీ కియాంగ్’ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ.. “చైనాలో ఇప్పటికీ 600 మిలియన్ల (60 కోట్ల) మంది ప్రజల నెలసరి ఆదాయం కేవలం 1000 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ. 14,000)” అని చెప్పాడు. 14 వేల రూపాయలు అంటే విజయవాడ లాంటి నగరంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెతో సమానం. ఆ డబ్బుతో వాళ్ళు నెలంతా ఎలా బ్రతుకుతున్నారు?

ఈ నిజం బయటకు రాగానే చైనా ప్రభుత్వం సెన్సార్ షిప్ మొదలుపెట్టింది. 2023లో ‘కైక్సిన్ (Caixin)’ అనే ప్రఖ్యాత ఆర్థిక పత్రిక ఈ 60 కోట్ల మంది డేటాతో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేస్తే, పవర్ఫుల్ చైనా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెంటనే ఆ ఆర్టికల్ ని డిలీట్ చేయించింది.

వదిలివేయబడ్డ బాల్యం  : చైనా గుండెకోత

చైనాలోని సిటీలు ఎంత డెవలప్ అయ్యాయో, అక్కడి పల్లెలు అంత దారుణమైన నెగ్లెక్ట్ కు గురయ్యాయి. రూరల్ చైనాలో పిల్లల గురించి వాడే ఒక పదం “లెఫ్ట్ బిహైండ్ చిల్డ్రన్”.

ఉదాహరణకు ‘వాంగ్ గింగ్’ అనే 14 ఏళ్ల అమ్మాయి కథ చూస్తే కన్నీళ్లు ఆగవు. చైనాలోని అత్యంత పేద ప్రాంతమైన లియాంగ్షన్ లో ఉండే ఈ పాప, తన తమ్ముడిని, చెల్లిని తానే పెంచుతోంది. ఆమె తల్లిదండ్రులు అక్కడ బ్రతకలేక 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళిపోయారు. రోజుకు 11 గంటలు పనిచేస్తే వారికి వచ్చేది కేవలం 15 డాలర్లు. సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వారు ఇంటికి వస్తారు. కనీసం నేలపై టైల్స్ కూడా లేని మట్టి ఇంట్లో ఆ 14 ఏళ్ల చిన్నారి పొటాటోలు ఉడకబెట్టి తన తోబుట్టువుల ఆకలి తీరుస్తోంది.

ఇది కేవలం ఒక వాంగ్ గింగ్ కథ కాదు. చైనాలో ఇలా తల్లిదండ్రులకు దూరంగా, ఒంటరిగా బ్రతుకుతున్న పిల్లలు ఏకంగా 61 మిలియన్ల నుండి 69 మిలియన్ల (దాదాపు 6.9 కోట్లు) వరకు ఉన్నారు. అంటే అమెరికాలో ఉన్న మొత్తం పిల్లల జనాభాతో సమానం. 2015లో గైజౌ (Guizhou) అనే ప్రాంతంలో తల్లిదండ్రులు లేక, ఒంటరిగా బ్రతకలేక నలుగురు అనాథ పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం చైనా వ్యవస్థ వైఫల్యానికి సజీవ సాక్ష్యం.

ద డార్క్ రియాలిటీ: చైనా ‘సొంత కుల వ్యవస్థ’ (Hukou System)

అసలు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను సిటీలకు ఎందుకు తీసుకువెళ్లలేరు? అక్కడే ఉంచుకుని ఎందుకు చదివించలేరు? దీనికి కారణం చైనా ప్రభుత్వం ప్రాణప్రదంగా అమలు చేస్తున్న “హుకోవు (Hukou)” సిస్టమ్. దీన్నే చైనా అధికారిక ‘జాతి వివక్ష వ్యవస్థ’ లేదా ‘క్యాస్ట్ సిస్టమ్’ అని పిలుస్తారు.

1950లలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సిస్టం ఒక “ఇంటర్నల్ పాస్పోర్ట్” లాగా పనిచేస్తుంది. ఒక వ్యక్తి పల్లెటూరిలో పుడితే వాళ్లకి ‘రూరల్ హుకోవు’ ఇస్తారు. సిటీలో పుడితే ‘అర్బన్ హుకోవు’ ఇస్తారు.

సెకండ్ క్లాస్ సిటిజన్స్: మిస్టర్ జాంగ్ అనే వ్యక్తి పల్లెటూరి నుండి వచ్చి షాంఘై సిటీలో 20 సంవత్సరాలుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కానీ అతని దగ్గర ఉన్నది ‘రూరల్ హుకోవు’. కాబట్టి 20 ఏళ్లు కష్టపడినా షాంఘైలో అతనికి హెల్త్ కేర్ లేదు, అతని పిల్లలకు ఉచిత విద్య లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అతని భార్యాపిల్లలు 1500 కిలోమీటర్ల దూరంలో పల్లెటూరిలో ఉండాల్సిందే.

పుట్టుకతోనే వివక్ష: ఈ హుకోవు స్టేటస్ వారసత్వంగా వస్తుంది. అంటే సిటీలో పుట్టిన పిల్లలకు కూడా, వారి తల్లిదండ్రులది రూరల్ హుకోవు అయితే వాళ్లకి కూడా అదే రూరల్ ముద్ర పడుతుంది.

దౌర్జన్యం: కొన్ని సంవత్సరాల క్రితం బీజింగ్ లో ఇలాంటి రూరల్ హుకోవు ఉన్న మైగ్రెంట్ వర్కర్స్ ని రాత్రికి రాత్రే ఇళ్ళు, షాపులు కూలగొట్టి బలవంతంగా పల్లెటూర్లకు తరిమేశారు.

ఇండియాలో కుల వ్యవస్థ ఉందని గ్లోబల్ లెవెల్ లో ప్రాపగాండా చేసే చైనా… తన సొంత ప్రజలను ఈ ‘హుకోవు’ పేరుతో రెండు వర్గాలుగా విభజించింది. అద్భుతమైన ఫెసిలిటీస్ అనుభవించే ‘అర్బన్ చైనా’ ఒకటైతే… కనీస బ్రతికే హక్కు కూడా లేకుండా, తక్కువ జీతాలతో, అత్యంత ప్రమాదకరమైన పనులు చేస్తూ మార్జిన్స్ లో మిగిలిపోయిన ‘రూరల్ చైనా’ మరొకటి.

ఏ రైతులైతే విప్లవం తెచ్చి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారో, ఈరోజు అదే పార్టీ ఆ రైతులను, పల్లెటూరి ప్రజలను బానిసలుగా చూస్తోంది. ఇండియాలో లోపాలు లేవని కాదు, మన దగ్గర పేదరికం, నిరుద్యోగం, పొల్యూషన్, స్కామ్స్ ఉన్నాయి. వాటిపై మనం నిత్యం పోరాడుతూనే ఉన్నాం. మన సిస్టం ను మార్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ, ఒక పక్క సొంత దేశపు పౌరులను బానిసలుగా చూస్తూ, ఫేక్ డెవలప్మెంట్ తో ప్రపంచాన్ని నమ్మిస్తూ.. ఇండియా లాంటి దేశాలపై బురదజల్లే చైనా కుట్రలను మాత్రం మనం తిప్పికొట్టక తప్పదు. అద్దాల మేడల వెనుక దాగి ఉన్న ఈ డ్రాగన్ అసలు రంగును ప్రపంచం గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.

The post ఎవరూ చూడని చైనా చీకటి కోణం! appeared first on .