Social Issues Archives - Journalist Sirisha

నాణ్యత గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఓ నిర్ణయం తీసుకుందాం…
అంగన్వాడీలో గుడ్లు వద్దు… కోవా బన్నులే ముద్దు!

పిల్లల ఆరోగ్యం తర్వాత విషయం’తోపుడు బండి’ వ్యాపారమే ముఖ్యం – రుచికరమైన కోవా బన్  చిరు వ్యాపారులను  ఆదుకోవడమే మన కర్తవ్యం ఇప్పుడు…

కోవా బన్ అనగానే ఎగబడి తినేది చిన్నారులె కదా…ఇప్పుడు వారి ఇష్టాలకే పెద్దపీట వేసేద్దాం…ఇప్పటిదాకా రాష్ట్రంలో చిన్నారులకు ఆరోగ్యం, బలవర్ధకమైన ఆహారం అంటూ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి గుడ్లు పంపిణీ చేస్తూ వస్తుంది కదా… కానీ ఇప్పుడు సడెన్ గా ఇదే పిల్లల ఆరోగ్యం విషయం కన్నా రోడ్ పక్కన కోవా బన్ అమ్ముకునే తోపుడు బండి ఆహారానికే ఎక్కువ విలువ ఇస్తున్నప్పుడు..  ఈ గుడ్ల వల్ల ఎవరికి లాభం? కేవలం పిల్లలకు మాత్రమే కదా..
అదే, ఆ గుడ్లు పక్కన పెట్టి మన వీధుల్లో తిరిగే “కోవా బన్ బండ్ల” వారిని ఆదుకుంటే, అటు వ్యాపారం, ఇటు పిల్లలకు ఇష్టమైన చిరు తిండిగా కడుపు నిండా మైదా పిండి దొరుకుతుంది కదా! ఈ చిన్న విషయం ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు?

పాపం.. మేడారం జాతరలో కోవా బన్ కి అవమానం:
ఈ మధ్యనే జరిగిన మేడారం జాతరకు ఎంతో ఆశతో వెళ్లిన ఒక చిరు వ్యాపారి దీనగాధ అందరికీ కళ్ళు తెరిపించాలి. “జనం వస్తారు, నా బన్నులు తింటారు, నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు” అని ఎంతో ఆశతో తన కోవా బన్ బండి వేసుకుని అంత దూరం వెళ్తే..
నాణ్యత లేదు… ఇంత తక్కువ ధరకు ఎలా కోవా బన్ వస్తుంది అంటూ  నిగ్గదీసి అడిగే ప్రయత్నం చేయడం లో నిజంగా ఆ కోవా బన్ కి అవమానమే జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇది ముమ్మాటికి ఖండించాల్సిన విషయమే..

ఇప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన సమయం వచ్చేసింది…

నాణ్యత ని పక్కన పెట్టేద్దాం కాసేపు..పోతే పోయింది పిల్లల ఆరోగ్యం. ముందు కోవా బన్ కి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందా…

ప్రభుత్వం గనక మధ్యాహ్నం భోజనం లో స్కూల్ పిల్లలకు గుడ్లు ఆపేసి, ఇతని దగ్గర బన్నులు కొని గుడ్ల ప్లేస్ ని భర్తీ చేస్తే ఆ బండి వాడికి జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుంది… ఇంకా ఇలాంటి వ్యాపారాలు చేయడానికి ఎంతో మందికి ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది..
నాణ్యత తక్కువైనా పర్లేదు.. ఇక్కడ వ్యాపారం ముఖ్యం కదా ! పొట్ట కొట్టకూడదు కదా..!

ఇక గుడ్డులో బలం ఉంటుంది, పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతారు కానీ,
పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడుతూ చిరు వ్యాపారులను ఆదుకోవాలని చూడ్డం లో ఓటు బ్యాంకింగ్ ఉంటుంది కదా…(చిన్నపిల్లలకు ఎలాగూ ఓటు హక్కు ఉందదు కదా) నాణ్యత తక్కువ అంటూ కోవా బన్నులో మత్తు పదార్థాలు ఏమైనా కలిసాయా అంటూ మైదా పిండి,డాల్దా అంటూ జనాలు గోల చేయడం ఎంతవరకు సమంజసం..? ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిధి కదా…

సామాన్యుడు గొంతు చించుకుంటే సరిపోతుందా…?

ఇలా ప్రభుత్వం ఆదా చేసిన డబ్బుతో ఇంకొన్ని కోవా బన్ బండ్లను ప్రోత్సహించవచ్చు. పిల్లల ఆరోగ్యం తర్వాత చూసుకోవచ్చు, ముందు బండి వాడి బతుకుదెరువు ముఖ్యం.

రేపటి భవిష్యత్తు…తోపుడు బండ్లే మన దేవాలయాలు:

గుడ్లు ఉడకబెట్టడం, పొట్టు తీయడం, ఆయాలకు పెద్ద శ్రమ. అదే కోవా బన్ బండ్లు బడి గేటు ముందుకు వస్తే.. కాగితంలో చుట్టి ఇచ్చేస్తారు. పని సులువు, సమయం ఆదా!
పిల్లలకు ఎముకల బలం ఎలా మరి అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు.., కనీసం బండి వాడికి చేతి నిండా పని దొరుకుతుంది..

అంతేకదా. అందుకే, నాణ్యత ప్రమాణాలు, ఆహార భద్రత నిబంధనలు పక్కన పెట్టి.. ఊరూరా తిరిగే కోవా బన్ బండ్లనే అధికారిక సరఫరాదారులుగా ప్రకటించాలి..

మళ్ళీ ల్యాబ్ కి పంపి టెస్ట్ లు అవి చేయించే ప్రయత్నం చేస్తే వ్యాపారుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది..

ప్రభుత్వానికి విన్నపం:
అయ్యా పాలకులారా.. గుడ్ల ఒప్పందాలను పక్కన పెట్టండి. మేడారం వెళ్లి నష్టపోయిన బండి వాడిలాంటి వారిని ఆదుకోండి. అంగన్వాడీ ఆహార పట్టికలో నుంచి గుడ్డును తొలగించి, వెంటనే కోవా బన్ (అదీ నాణ్యత తక్కువదైనా సరే) ప్రవేశపెట్టండి.
జై కోవా బన్.. జై జై బండి!
(గమనిక: ఇది ప్రభుత్వ విధానాలపై, వ్యవస్థలోని లోపాలపై సంధించిన వ్యంగ్య కథనం మాత్రమే.)

The post నాణ్యత గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఓ నిర్ణయం తీసుకుందాం… appeared first on Journalist Sirisha.

అదుపు లేని ‘కో-లివింగ్’ సంస్కృతి – సామాజిక ముప్పు
ఒకప్పుడు హాస్టల్ అంటే కేవలం వసతి మరియు భోజన సదుపాయం మాత్రమే. కానీ నేడు ‘కో-లివింగ్’ పేరుతో స్త్రీ, పురుషులు కలిసి ఉండేలా అనుమతిస్తున్న ఈ హాస్టళ్లు పాశ్చాత్య పోకడలకు కేంద్రాలుగా మారుతున్నాయి. స్వేచ్ఛ పేరుతో యువత విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నారు. ఇది కేవలం నైతిక విలువలను దెబ్బతీయడమే కాకుండా, మన భారతీయ కుటుంబ వ్యవస్థ పునాదులను కదిలిస్తోంది.
ఆరోగ్య విపత్తు – సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆందోళన
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ విచ్చలవిడి జీవనశైలి కారణంగా యువతలో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పని చేసే వారిలో ప్రాణాంతకమైన హెచ్‌ఐవి (HIV) వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు పెరుగుతున్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి.
-పని ఒత్తిడి, ఒంటరితనం, మరియు అందుబాటులో ఉన్న అపరిమిత స్వేచ్ఛ కారణంగా యువత క్షణికానందాలకు లొంగిపోతున్నారు.
-హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తలు సామాజిక ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పును సూచిస్తున్నాయి.
-ఇది కేవలం వ్యక్తుల సమస్య కాదు, భావి తరాల ఆరోగ్య సమస్య.
ప్రభుత్వ నిర్లక్ష్యం – చోద్యం చూస్తున్న యంత్రాంగం
ఇంత జరుగుతున్నా, అధికారులు మరియు ప్రభుత్వం చోద్యం చూడటం విచారకరం.
-చాలా కో-లివింగ్ హాస్టళ్లకు సరైన అనుమతులు లేవు.
– నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా, ఎటువంటి తనిఖీలు (Raids) జరగడం లేదు.
-కేవలం ఆదాయమే పరమావధిగా యాజమాన్యాలు వ్యవహరిస్తుంటే, ప్రభుత్వం కళ్లు మూసుకొని కూర్చోవడం దారుణం.
ఈ గణతంత్ర దినోత్సవం నుంచే మార్పు రావాలి
రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇచ్చింది కానీ, అది స్వైర విహారం కోసం కాదు. ప్రజల ఆరోగ్యాన్ని, నైతికతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ జనవరి 26న, ప్రభుత్వం ఈ క్రింది చర్యలకు ఉపక్రమించాలి:
కఠిన నిబంధనలు (Strict Regulations): కో-లివింగ్ హాస్టళ్ల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలి. అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారే వాటిని సీజ్ చేయాలి.
వైద్య పరీక్షలు & అవగాహన: సాఫ్ట్వేర్ కంపెనీలు మరియు హాస్టల్స్ కేంద్రంగా హెచ్‌ఐవి వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి మరియు హెల్త్ చెకప్స్ తప్పనిసరి చేయాలి.
పోలీస్ నిఘా: హాస్టళ్లలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా షీ టీమ్స్ (SHE Teams) మరియు టాస్క్ ఫోర్స్ ద్వారా నిరంతర నిఘా ఉంచాలి.
లైసెన్సుల రద్దు: నిబంధనలు పాటించని హాస్టళ్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
ముగింపు
అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాలు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన సమాజం కూడా. “స్వేచ్ఛ” అనే పదాన్ని “విచ్చలవిడితనం”గా మారుస్తుంటే చూస్తూ ఊరుకోకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, కో-లివింగ్ హాస్టళ్ల ముసుగులో జరుగుతున్న అరాచకాలపై ఉక్కుపాదం మోపాలి. మన యువతను, మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.

The post అదుపు లేని ‘కో-లివింగ్’ సంస్కృతి – సామాజిక ముప్పు appeared first on Journalist Sirisha.