Health News Archives - Journalist Sirisha

చూడటానికి చిన్న చీమలా ఉంటుంది.. కానీ చర్మంపై వాలితే యాసిడ్ పోసినట్లే!
–జర్నలిస్ట్ శిరీష స్పెషల్ రిపోర్ట్

వాతావరణంలో వస్తున్న మార్పులు, ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వివిధ రకాల కీటకాల బెడద పెరుగుతోంది. ఇటీవల కాలంలో ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించిన ఒక నిర్దిష్ట కీటకం పట్ల వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడటానికి సాధారణ ఎర్ర చీమలా కనిపించే “ఆసిడ్ బగ్” (Acid Bug) చర్మంపై తీవ్రమైన గాయాలకు కారణమవుతోంది. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, నివారణా చర్యల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఆసిడ్ బగ్ (Acid Bug) అనగానేమి? దీనిని శాస్త్రీయ పరిభాషలో ‘నైరోబీ ఫ్లై’ (Nairobi Fly) లేదా ‘పాడెరస్’ (Paederus) అని వ్యవహరిస్తారు. నలుపు, ఎరుపు రంగుల మిశ్రమంతో ఉండే ఈ చిన్న కీటకాలు తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో, వ్యవసాయ భూములు, మురుగు కాల్వల సమీపంలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుతురుకు ఇవి త్వరగా ఆకర్షితమవుతాయి.

చర్మంపై తీవ్ర ప్రభావం: ఈ కీటకం గురించి ప్రజలు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇది నేరుగా కుట్టడం లేదా కరవడం చేయదు. అయితే, ఇది చర్మంపై వాలినప్పుడు, అసంకల్పితంగా మనుషులు దానిని చేతితో అదిమిపట్టడం లేదా నలపడం చేస్తారు. అలా జరిగినప్పుడు ఆ కీటకం శరీరం నుండి ‘పెడెరిన్’ (Pederin) అనే అత్యంత విషపూరితమైన రసాయనం (Toxin) విడుదలవుతుంది.

ఈ రసాయనం చర్మానికి తాకిన 12 నుండి 24 గంటల్లోపు, ఆ భాగంలో యాసిడ్ దాడికి గురైనట్లుగా తీవ్రమైన మంట, ఎర్రటి దద్దుర్లు, ద్రవంతో కూడిన బొబ్బలు ఏర్పడతాయి. దీనివల్ల బాధితులు తీవ్రమైన చర్మ సంబంధిత నొప్పితో పాటు సెకండరీ ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.

తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్తలు: వైద్య నిపుణుల సూచనల మేరకు, ఈ ఆసిడ్ బగ్ ముప్పు నుండి రక్షణ పొందడానికి కింది జాగ్రత్తలు పాటించాలి:

కీటకాన్ని నలపవద్దు: చర్మంపై ఈ కీటకాన్ని గమనించినట్లయితే, ఆందోళన చెంది చేతితో కొట్టకూడదు. దానికి బదులుగా గట్టిగా గాలి ఊదడం లేదా ఏదైనా కాగితం సహాయంతో నెమ్మదిగా తొలగించాలి.

తక్షణ ప్రథమ చికిత్స: ఒకవేళ పొరపాటున కీటకం చర్మంపై నలిగిపోతే, తక్షణమే ఆ ప్రదేశాన్ని సబ్బు మరియు శుభ్రమైన నీటితో కడగాలి. దీనివల్ల పెడెరిన్ రసాయనం చర్మంలోకి చొచ్చుకుపోకుండా నిరోధించవచ్చు.

కళ్లకు రక్షణ: కీటకాన్ని తాకిన చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లను స్పృశించకూడదు. కంటికి సోకితే దృష్టి లోపం తలెత్తే ప్రమాదం ఉంది.

పరిసరాల పరిశుభ్రత: రాత్రి పూట కిటికీలు మూసి ఉంచడం, దోమ తెరలు ఉపయోగించడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా వీటి బెడదను నివారించవచ్చు.

చూడటానికి చిన్నదిగా అనిపించినప్పటికీ, దీని వల్ల కలిగే ఆరోగ్యపరమైన నష్టం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలి.

The post చూడటానికి చిన్న చీమలా ఉంటుంది.. కానీ చర్మంపై వాలితే యాసిడ్ పోసినట్లే! appeared first on Journalist Sirisha.

నాణ్యత గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఓ నిర్ణయం తీసుకుందాం…
అంగన్వాడీలో గుడ్లు వద్దు… కోవా బన్నులే ముద్దు!

పిల్లల ఆరోగ్యం తర్వాత విషయం’తోపుడు బండి’ వ్యాపారమే ముఖ్యం – రుచికరమైన కోవా బన్  చిరు వ్యాపారులను  ఆదుకోవడమే మన కర్తవ్యం ఇప్పుడు…

కోవా బన్ అనగానే ఎగబడి తినేది చిన్నారులె కదా…ఇప్పుడు వారి ఇష్టాలకే పెద్దపీట వేసేద్దాం…ఇప్పటిదాకా రాష్ట్రంలో చిన్నారులకు ఆరోగ్యం, బలవర్ధకమైన ఆహారం అంటూ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి గుడ్లు పంపిణీ చేస్తూ వస్తుంది కదా… కానీ ఇప్పుడు సడెన్ గా ఇదే పిల్లల ఆరోగ్యం విషయం కన్నా రోడ్ పక్కన కోవా బన్ అమ్ముకునే తోపుడు బండి ఆహారానికే ఎక్కువ విలువ ఇస్తున్నప్పుడు..  ఈ గుడ్ల వల్ల ఎవరికి లాభం? కేవలం పిల్లలకు మాత్రమే కదా..
అదే, ఆ గుడ్లు పక్కన పెట్టి మన వీధుల్లో తిరిగే “కోవా బన్ బండ్ల” వారిని ఆదుకుంటే, అటు వ్యాపారం, ఇటు పిల్లలకు ఇష్టమైన చిరు తిండిగా కడుపు నిండా మైదా పిండి దొరుకుతుంది కదా! ఈ చిన్న విషయం ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు?

పాపం.. మేడారం జాతరలో కోవా బన్ కి అవమానం:
ఈ మధ్యనే జరిగిన మేడారం జాతరకు ఎంతో ఆశతో వెళ్లిన ఒక చిరు వ్యాపారి దీనగాధ అందరికీ కళ్ళు తెరిపించాలి. “జనం వస్తారు, నా బన్నులు తింటారు, నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు” అని ఎంతో ఆశతో తన కోవా బన్ బండి వేసుకుని అంత దూరం వెళ్తే..
నాణ్యత లేదు… ఇంత తక్కువ ధరకు ఎలా కోవా బన్ వస్తుంది అంటూ  నిగ్గదీసి అడిగే ప్రయత్నం చేయడం లో నిజంగా ఆ కోవా బన్ కి అవమానమే జరిగిందని చెప్పుకోవచ్చు.
ఇది ముమ్మాటికి ఖండించాల్సిన విషయమే..

ఇప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన సమయం వచ్చేసింది…

నాణ్యత ని పక్కన పెట్టేద్దాం కాసేపు..పోతే పోయింది పిల్లల ఆరోగ్యం. ముందు కోవా బన్ కి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుందా…

ప్రభుత్వం గనక మధ్యాహ్నం భోజనం లో స్కూల్ పిల్లలకు గుడ్లు ఆపేసి, ఇతని దగ్గర బన్నులు కొని గుడ్ల ప్లేస్ ని భర్తీ చేస్తే ఆ బండి వాడికి జీవనోపాధి ఇచ్చినట్టు ఉంటుంది… ఇంకా ఇలాంటి వ్యాపారాలు చేయడానికి ఎంతో మందికి ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది..
నాణ్యత తక్కువైనా పర్లేదు.. ఇక్కడ వ్యాపారం ముఖ్యం కదా ! పొట్ట కొట్టకూడదు కదా..!

ఇక గుడ్డులో బలం ఉంటుంది, పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతారు కానీ,
పిల్లలకి ఇష్టమైన ఫుడ్ పెడుతూ చిరు వ్యాపారులను ఆదుకోవాలని చూడ్డం లో ఓటు బ్యాంకింగ్ ఉంటుంది కదా…(చిన్నపిల్లలకు ఎలాగూ ఓటు హక్కు ఉందదు కదా) నాణ్యత తక్కువ అంటూ కోవా బన్నులో మత్తు పదార్థాలు ఏమైనా కలిసాయా అంటూ మైదా పిండి,డాల్దా అంటూ జనాలు గోల చేయడం ఎంతవరకు సమంజసం..? ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానిధి కదా…

సామాన్యుడు గొంతు చించుకుంటే సరిపోతుందా…?

ఇలా ప్రభుత్వం ఆదా చేసిన డబ్బుతో ఇంకొన్ని కోవా బన్ బండ్లను ప్రోత్సహించవచ్చు. పిల్లల ఆరోగ్యం తర్వాత చూసుకోవచ్చు, ముందు బండి వాడి బతుకుదెరువు ముఖ్యం.

రేపటి భవిష్యత్తు…తోపుడు బండ్లే మన దేవాలయాలు:

గుడ్లు ఉడకబెట్టడం, పొట్టు తీయడం, ఆయాలకు పెద్ద శ్రమ. అదే కోవా బన్ బండ్లు బడి గేటు ముందుకు వస్తే.. కాగితంలో చుట్టి ఇచ్చేస్తారు. పని సులువు, సమయం ఆదా!
పిల్లలకు ఎముకల బలం ఎలా మరి అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే పని జరగదు.., కనీసం బండి వాడికి చేతి నిండా పని దొరుకుతుంది..

అంతేకదా. అందుకే, నాణ్యత ప్రమాణాలు, ఆహార భద్రత నిబంధనలు పక్కన పెట్టి.. ఊరూరా తిరిగే కోవా బన్ బండ్లనే అధికారిక సరఫరాదారులుగా ప్రకటించాలి..

మళ్ళీ ల్యాబ్ కి పంపి టెస్ట్ లు అవి చేయించే ప్రయత్నం చేస్తే వ్యాపారుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది..

ప్రభుత్వానికి విన్నపం:
అయ్యా పాలకులారా.. గుడ్ల ఒప్పందాలను పక్కన పెట్టండి. మేడారం వెళ్లి నష్టపోయిన బండి వాడిలాంటి వారిని ఆదుకోండి. అంగన్వాడీ ఆహార పట్టికలో నుంచి గుడ్డును తొలగించి, వెంటనే కోవా బన్ (అదీ నాణ్యత తక్కువదైనా సరే) ప్రవేశపెట్టండి.
జై కోవా బన్.. జై జై బండి!
(గమనిక: ఇది ప్రభుత్వ విధానాలపై, వ్యవస్థలోని లోపాలపై సంధించిన వ్యంగ్య కథనం మాత్రమే.)

The post నాణ్యత గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఓ నిర్ణయం తీసుకుందాం… appeared first on Journalist Sirisha.